సభాపతయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సభాపతయ్య
జననం1860
తిరువయ్యూర్, తంజావూరు రాజ్యం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసులు,కృతి కర్త
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

తంజావూరునకు సమీపమున నెలకొనిన తెలుగు కుటుంబములలో త్యాగయ్య కుటుంబమును, సభాపతయ్య కుటుంబమును ప్రసిద్ధములు. త్యాగయ్య రామభక్తుడై, పరమ భాగవతమోత్తముడై, కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతమునకు ప్రవర్తకుడు కాగా, సభాపతయ్య రాజగోపాలభక్తుడై, మన్నారుగుడిలో క్షేత్రయ్య పదములను, సంప్రదాయ సిద్ధముగా పాడి, అభినయించుచు తత్సంప్రదాయ ప్రవర్తకుడగుట మాత్రమేగాక, స్వయముగా తన ఇష్ట దైవమైన రాజగోపాల నామాంకితములుగా క్షేత్రయ్య పదములను పోలిన పదములను రచించి పద రచయితగా బదాభినయ ప్రవర్తకుడిగా ప్రఖ్యాతిగాంచాడు.

సభాపతయ్య, త్యాగయ్య వలెనే ములకనాటి వైదిక శాఖకు చెందిన బ్రాహ్మణుడు. తంజావూరునకు సమీపమున మూవనల్లూరను బ్రాహ్మణాగ్రహారము ఇతని స్వగ్రామము. అక్కడే సమీపమున మన్నారుగుడి యందలి రాజగోపాలస్వామికి భక్తుడైనాడు. అతని మీద శృంగార పదములను రచించాడు. అతని స్వగ్రామము వలననే ఇతని పేరు మూవనల్లూరు సభాపతయ్య అని, మన్నారుగుడిలో చాలకాలము నివసించుటచే రాజమన్నురుగుడి సభాపతయ్య అని వ్యవహరింపబడుచుండెను.

భరతశాస్త్రమందు ఈయన మహా ప్రావీణ్యుడు. ఈయన సుమారు సం.1860 ప్రాంతము వాడని చెప్పవచ్చును. ఈయనను గురించిన ఇతర విశేషములేవి తెలియలేదు. ఈయన శృంగారపదములనే గాక సీతాస్వయంవరము ను పాటలలో రచించెను. ఈయన రచనలలో పలుచోట్ల తమిళ పదములు కనబడును. ఈయనను గూర్చి ఈ క్రింది కథ ప్రచారమున నుండినది:

సభాపతయ్య సంగీతాభినయ శాస్త్రములలో మహావిద్వాంసుడు. ఈయన స్త్రీవేషము వేసి క్షేత్రయ్య పదములను పాడి అభినయించువాడు. సహజముగనే సుందర శరీరుదయి, చక్కని శారీరముగల సభాపతయ్య స్త్రీ వేషమున ప్రేక్షకులను సులభముగా ఆకట్టుకొనేవాడు. ఒకప్పుడు శరభోజి మహారాజు భరతశాస్త్రాభినయములో మేటిఅయిన వారేది కోరినను వారి అభీష్టము తీర్చి సత్కరించెదనని పలుకగా అనేకులు స్త్రీలు, పురుషులు తమ అభినయమును చూపి రాజసన్మానము పొందిరట. అపుడు సభాపతయ్య స్త్రీ వేషముతో సభారంగమున నిలిచి స్త్రీ వాక్యముగా పదముపాడి నాట్యము చేయగా రాజుతో సహా అందరు ఆశ్చర్యమునొందిరట. పరమభాగవతోత్తముడైన సభాపతయ్య రాజాంతఃపురమున అనాదిగా వంశ పరంపరాను గతముగా పూజింప బడుచుండిన ఒక శ్రీకృష్ణుని విగ్రహమును తనకివ్వమని రాజును ప్రార్థించిరట. రాజు దానికి ఆశ్చర్యము నొంది దీనిని నీవేమి చేసుకొందువని ప్రశ్నించగా, మహారాజా ధనము నాకక్కర లేదు. అది అశాశ్వతము. శ్రీకృష్ణానుగ్రహమున నేను నేర్చిన విద్యను పదిమందికి నేర్పి దానిలోనే నేను ఆనందము పొందుచున్నాను. మీరు దయతో ఆవిగ్రహమును నాకొసగిన దానిని నా దేవతార్చనలో నుంచుకొని ప్రతిదినము పూజింతునని చెప్పెనట. రాజు ఆయన కోరికలోని తీవ్రతను గుర్తించి సభాతయ్యను సత్కరించి ఆవిగ్రహమును బహూకరించెనట.

సభాతయ్య రాజగోపాల నామాంకితములుగా రచించిన శృంగారపదములు 50 మాత్రము సా.శ. 1884 సం.లోఅ.స.నృసింహాచార్యులవారి శ్రీవాణీ నిలయ ముద్రాక్షరశాలయందు ముద్రింపబడినవి. ఇందలి పదములకు నీ.మా తిరుపతి వేంకటాచార్యులవారు సంగ్రహించిన ఆంధ్రవాక్యరూపమున నాయకా నాయకాది లక్షణములను, రసమంజరి ఉదాహరణ శ్లోకములను ఒసగబడినవి.

మచ్చునకు సభాపతయ్య గారి శృంగార పదములు:

పల్లవి:

అన్యాయముగ నే నపదూరు పాలైతి అతివరో యేమందు నే

అనుపల్లవి

మన్నారు రాజగోపాల సామికి నాకు కద్దని పలికేరు

చరణములు

ఆ సరసుడు ప్రీతిచేసి పిల్వగను - రోసము చూపితి నే మాసీమలో నిది మరియాద కాదని- వేసారి మొక్కి [తినే దోసమొన్నక పలుకు మోసగత్తెల గేలి - చేసే రేమం [దునే ఆస దీరనే ననుభవించక యయ్యయ్యో-

ఆటపాటలకై యాతనితో నేను- మాటలాడి నందుకా బోటుల కెదుట నీ ప్రొద్దు వానింటికి - పోయి వచ్చి [నందుకా సూటిగాను వాని చూచి నవ్వె యల - వాటుచేసి [నందుకా ఏటికే యాగేలి యే పాప మెరుగనే-

పల్లవి:

ఈ లాగు పాంధుడవు నీవు ఒంటిగాను ఇప్పుడెచ్చటి కేగేవు వేగను

అనుపల్లవి

మేలు పయోధరములు చేరి యెదుటను మెరయగ గోపాల హరి యనుచును

చరణములు

చంత నుండెడి గుడి చాటు జేరక శ్రమము దీర సుఖమొంద గోరిక సుంత యీ తరువున జూచి యయిన నిలువక ఎంత సుఖము చేయు నీ కొమ్మ యనుకొనక ||ఈలాగు|| 1

నీవు కట్టుకోక నిటు బాళి యుంచక నీవేళ భూసుర హితము మాట వినక త్రోవ నడుచుటకు తోడెవ్వరును లేక ఈ వగు ముందు వెనుక యోచింపక ||ఈలాగు|| 2

ఎవ్వరిందు రా నెరుగనట్టి తావు జవ్వని న న్నొక్క తె నిందుగనినావు అవ్వల నైన నిందు నిలువలేవు హరిహరి గోపాల యేల భ్రమసేవు ||ఈలాగు|| 3

పల్లవి:

రారా విడిదికి నొకసారి - రార చక్రధారీ.

అనుపల్లవి

శ్రీ రాజగోపాల శౌరీ - చితామునను దయయుంచి [మురారీ

చరణములు

అంగజ జనకా నిను దలచినదే అటే దేహము పరవశ మయ్యేనిరా పొంగి గుబ్బలివో పులకరించేనిరా భోగి శయన మంచి సమయ మిదిరా ||రారా||

సోముని గేరు నీమోము జూచినదే సొక్కి బాగా ముద్దిడ గోరేను రా సామి నీవు మాటాడగా నీ చక్కెర మో వాన పదరేను రా ||రారా||

ఆకు మడుపు లియ్యగాను నీ చెయి సోకినంతనే కోక వదలెరా ఏకాంతమున నిన్నెనయ గోపాల్ జోకతోడ నీలోక మె మరతురా ||రారా||

భరతనాట్యాచారుడై సంప్రదాయ సిద్ధముగా పదములను పాడి, అభినయించి పదకవితకు ప్రాణము పోసి ప్రచారమునకు తెచ్చుటతో బాటు భాగవతులను తన సంగీతాభినయములచే రసానందభూతికి దార్చుట మాత్రమే గాక, స్వయముగా పదములను రచించి తరువాతి కాలము వారికి గూడ అట్టి రసానుభూతి కల్పించి పదరచయితయై ప్రఖ్యాతి గాంచిన సభాపతయ్య తెలుగు వారికి చిరస్మరణీయుడు.

మూలాలు[మార్చు]

1. భారతి 1951 మాస సంచిక. వ్యాస రచయిత:తమ్మావజ్జుల కోదండరామయ్య

"https://te.wikipedia.org/w/index.php?title=సభాపతయ్య&oldid=3501286" నుండి వెలికితీశారు