సమాసం
Jump to navigation
Jump to search
సమాసం అంటే రెండు వేర్వేరు అర్థాలు ఉన్న పదాలు కలిసి ఒకే పదంగా మారి మరో అర్థాన్ని ఇవ్వడం. సమాసంలో పూర్వపదం (ముందు పదం), ఉత్తర పదం (తర్వాతి పదం) అని రెండు పదాలు ఉంటాయి.
సమర్ధః పదనిధిః సమాసః- పాణిని అష్ఠాధ్యాయి
వివిధ సమాసాల వివరణ
[మార్చు]- అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి - ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు. - సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము - విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము - విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును - ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము - ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము. - అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరం - ద్వారక అను పేరుగల నగరం. - నఞ్ తత్పురుష సౌకచంకమాసము: అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము - ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు. - బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు. - బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.
ప్రత్యయాలు విభక్తి పేరు
[మార్చు]డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి. ...
మూలాలు
[మార్చు]- సమాసాల విజ్ఞానం, తెలుగు వ్యాకరణము, మల్లాది కృష్ణ ప్రసాద్, విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ, 2007, పేజీలు: 177-213.