సి. లక్ష్మా రెడ్డి
సి. లక్ష్మా రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 3 డిసెంబర్ 2023 | |||
తరువాత | జె. అనిరుధ్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం | ||
వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం
| |||
పదవీ కాలం డిసెంబర్ 17, 2014 – డిసెంబరు, 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్కర్నూల్ జిల్లా, తెలంగాణ | 1962 ఫిబ్రవరి 3 ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | శ్వేత | ||
సంతానం | స్వరణ్, స్ఫూర్తి | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
సి. లక్ష్మా రెడ్డి వైద్యుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. జడ్చర్ల ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కల్వకుంట్ల మొదటి మంత్రివర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశాడు.[2]
జననం
[మార్చు]లక్ష్మా రెడ్డి 1962, ఫిబ్రవరి 3న జడ్చర్లలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు నారాయణ్ రెడ్డి. వీరి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామం.
విద్యాభ్యాసం
[మార్చు]హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషన్ సొసైటీ (గుల్బర్గా, కర్ణాటక) నుండి హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ లో బ్యాచులర్ డిగ్రీ పట్టా పొందాడు. ఆ సమయంలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు జడ్చర్లలో ఒక హోమియోపతిక్ డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు.[3]
వివాహం - పిల్లలు
[మార్చు]లక్ష్మా రెడ్డి వివాహం డాక్టర్ శ్వేతలో జరిగింది.[4] వీరికి ఇద్దరు పిల్లలు.
రాజకీయ జీవితం
[మార్చు]లక్ష్మా రెడ్డి రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేవాడు. చిన్నవయసు నుండి అనేక పదవులను చేపట్టాడు. తన స్వగ్రామైన తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తిమ్మాజిపేట మండల స్థాయిలో సింగిల్ విండో విధానాన్ని, గ్రంథాలయం సంఘాన్ని ఏర్పాటుచేశాడు.
2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పిలుపుతో 2008 ఏప్రిల్ లో తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు.[5]
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొంది, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. అరోగ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టి.రాజయ్య తొలగింపు తర్వాత, అతని స్థానంలో లక్ష్మా రెడ్డిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు మార్చారు.[6][7]
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై 45,082 ఓట్ల తేడాతో గెలుపొందాడు. సి. లక్ష్మా రెడ్డి 2022 జనవరి 26న మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[8] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
- ↑ నవతెలంగాణ, రాష్ట్రీయం. "వైద్యసేవల సంస్థకు స్కాచ్ అవార్డు". Retrieved 17 January 2017.
- ↑ "Profile of Minister". Archived from the original on 2016-05-09. Retrieved 2017-01-17.
- ↑ Prabha News (10 September 2024). "మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి భార్యా వియోగం". Archived from the original on 10 September 2024. Retrieved 10 September 2024.
- ↑ "Jadcherla MLAs". Archived from the original on 2017-03-27. Retrieved 2017-01-17.
- ↑ Rajaih gets marching orders
- ↑ TV9 Telugu (4 May 2021). "ఆరోగ్యశాఖ మంత్రిగా మళ్లీ లక్ష్మారెడ్డికి ఛాన్స్..?". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- 1962 జననాలు
- మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ నాయకులు
- మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)