సుహాసిని (జూనియర్)
Appearance
సుహాసిని | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | సుహా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
సుహాసిని (జూనియర్) దక్షిణ భారత చలనచిత్ర నటి. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[1]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది.[2] 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అటుతర్వాత తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో కూడా నటించింది.
టెలివిజన్ రంగం
[మార్చు]2010లో జెమినీ టీవీ లో వచ్చిన అపరంజి ధారావాహిక ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. అపరంజి (తెలుగు), అనుబంధాలు (తెలుగు), అష్టాచెమ్మ (తెలుగు), శివశంకరి (తమిళం), ఇద్దరు అమ్మాయిలు (తెలుగు) వంటి ధారావాహికలలో నటించింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2003 | చంటిగాడు[1] | సీతామహాలక్ష్మీ | తెలుగు | |
2004 | అదు | కాయల్ విజి | తమిళం | సుహా |
2005 | మన్నిన్ మైందన్ | అముద భైరవమూర్తి | తమిళం | సుహా |
2006 | సుందరానికి తొందరెక్కువా | తెలుగు | ||
2006 | కోకిల | సుబ్బలక్ష్మీ | తెలుగు | |
2006 | గుణ | ప్రియా | తెలుగు | |
2007 | ఆదివారం ఆడవాళ్లకు సెలవు | తెలుగు | ||
2007 | భూకైలాస్ | బుజ్జి | తెలుగు | |
2007 | లక్ష్మీ కళ్యాణం | పారిజాతం | తెలుగు | |
2007 | జ్ఞాబాగం వారుతే | తమిళం | సుహా | |
2008 | హైవే | సీత | తెలుగు | |
2008 | పాండురంగడు | సత్యభామ | తెలుగు | |
2008 | బా బేగ చందమామ | ప్రీతి | కన్నడ | |
2008 | తమాష చూద్దాం రండి | తెలుగు | ||
2009 | స్వీట్ హార్ట్ | లక్ష్మీ | తెలుగు | |
2009 | పున్నమి నాగు | కాజల్ | తెలుగు | |
2010 | సందడి | సుజి | తెలుగు | |
2010 | మౌనరాగం | కావేరి | తెలుగు | |
2011 | ప్రేమ చరిత్ర | అంజలి | తెలుగు | |
2011 | పిల్లైయార్ తెరు కాడైసి వీడు | వల్లీ | తమిళం | |
2011 | శభరి | భోజ్ పురి | ||
2011 | కుర్బాని | భోజ్ పురి | ||
2011 | పాయిజన్[3] | తెలుగు | ||
2011 | భలే మొగుడు భలే పెళ్ళామ్[3] | తెలుగు | ||
2012 | శ్రీ వాసవి వైభవం | వాసవి కన్యక | తెలుగు | |
2013 | అడ్డా[4][1] | పూజ | తెలుగు | |
2014 | రఫ్[1] | తెలుగు |
టెలివిజన్
[మార్చు]- అపరంజి (తెలుగు)
- అనుబంధాలు (తెలుగు)
- అష్టాచెమ్మ (తెలుగు)
- శివశంకరి (తమిళం)
- ఇద్దరు అమ్మాయిలు (తెలుగు)
- నా కోడలు బంగారం (తెలుగు)
- గిరిజా కళ్యాణం (జెమినీ టీవీ)
- దేవత (స్టార్ మా - 2020, ఆగస్టు 17 నుండి)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 నమస్తే తెలంగాణ. "పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని". Retrieved 26 May 2017.[permanent dead link]
- ↑ ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
- ↑ 3.0 3.1 తెలుగు ఫిల్మిబీట్. "సుహాసిని". telugu.filmibeat.com. Retrieved 26 May 2017.
- ↑ "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.