సేనాపతి
సేనాపతి | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°16′22″N 94°01′35″E / 25.2727°N 94.0265°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | సేనాపతి |
జనాభా (2011) | |
• Total | 2,183 |
• జనసాంద్రత | 87/కి.మీ2 (230/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మీటీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795106 |
టెలిఫోన్ కోడ | 3871 |
Vehicle registration | ఎంఎన్ |
Literacy | 82.41% |
సేనాపతి, మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధానకేంద్రం.[1]
భౌగోళికం
[మార్చు]ఈ పట్టణం 25°16′22″N 94°01′35″E / 25.2727°N 94.0265°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో మొత్తం 393 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ 2,183 జనాభా ఉంది. అందులో 1,126 మంది పురుషులు ఉండగా, 1,057 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 307 (14.06%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. సేనాపతి పట్టణ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 939 కాగా, ఇది మణిపూర్ రాష్ట్ర సగటు 985 కన్నా తక్కువగా ఉంది. ఇక్కడి అక్షరాస్యత 82.41% కాగా, రాష్ట్ర సగలు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.87% కాగా, మహిళా అక్షరాస్యత 75.50% గా ఉంది.[2]
ప్రజలు
[మార్చు]ఇక్కడ పౌమై, మావో, మరం, తంగల్, జెలియాంగ్‌రాంగ్ నాగ తెగలు మొదలైనవారు ప్రధానంగా ఉన్నారు. ఇతరులలో తంగ్ఖుల్, మారింగ్ నాగస్, కుకిలు, నేపాలీ, మైనారిటీలు ఉన్నారు.
మతం
[మార్చు]ఇక్కడ 98% మంది క్రైస్తవులు, 2% మంది హిందువులు ఉన్నారు.
వృత్తి
[మార్చు]వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఇక్కడ వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, క్యాబేజీ, తృణధాన్యాలు మొదలైన పంటలు పండిస్తారు. పశువులు, గేదె, పంది, మేకలు పెంచుకుంటుంటారు.
పర్యాటక ప్రాంతాలు
[మార్చు]ఈ ప్రాందంలో 80% భూమి దట్టమైన అడవులతో నిండి ఉంది.[3]
- మావో
- యాంగ్ఖుల్లెన్
- డుకో లోయ
- లియాయి
- పురుషల్
- మరం ఖుల్లెన్
- మాఖెల్ గుహ
- సడు చిరు జలపాతాలు
మూలాలు
[మార్చు]- ↑ "Senapati Village in Mao Maram (Senapati) Manipur | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-08.
- ↑ "Senapati Village Population - Mao-Maram - Senapati, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
- ↑ "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.