హిట్ (2020 సినిమా)
హిట్: ది ఫస్ట్ కేస్ | |
---|---|
దర్శకత్వం | శైలేష్ కొలను |
రచన | శైలేష్ కొలను |
నిర్మాత | నాని ప్రశాంతి తిపిర్నేని |
తారాగణం | విశ్వక్ సేన్ రుహానీ శర్మ మురళీ శర్మ భాను చందర్ |
ఛాయాగ్రహణం | ఎస్. మణికందన్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | వాల్ పోస్టర్ సినిమా |
విడుదల తేదీs | 28 ఫిబ్రవరి, 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹6 కోట్లు[1] |
బాక్సాఫీసు | est.₹8.5 crore (opening weekend)[1] |
హిట్:ది ఫస్ట్ కేస్ 2020, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ సారథ్యంలో శైలేష్ కొలను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది.[3]
కథా నేపథ్యం
[మార్చు]నేర పరిశోధన శాఖలో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం (హిట్) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్) ప్రధాన అధికారి. విశ్వ టీంలోనే విక్రమ్ (విశ్వక్ సేన్), అభిలాష్ (శ్రీనాథ్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఎంతో ప్రతిభ గల ఆఫీసర్లు. ప్రతీ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహ (రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు.
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వ అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్ళినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. అయితే ఈ కేసులోకి షీల (హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇబ్రహీం (మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్ ఛేదించాడా? ప్రీతి, నేహాలకు ఏమైంది? వారిని కిడ్నాప్ చేసింది ఎవరు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అనేవి మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- విశ్వక్ సేన్ (విక్రమ్ రుద్రాజు)
- రుహానీ శర్మ (నేహా)
- చైతన్య సాగిరాజు (రోహిత్)
- బ్రహ్మాజీ (ఆర్. షిండే)
- హరి తేజ (షీల)
- మురళీ శర్మ (ఇబ్రహీం)
- భాను చందర్ (విశ్వనాథ్)
- నవీన రెడ్డి (స్వప్న)
- ధన్వి
- రవిరాజా (ఫహద్)
- సాహితి (ప్రీతి)
- వన్షిక
- రవివర్మ (శ్రీనివాస్)
- మాగంటి శ్రీనాథ్ (అభిలాష్)
- రంగధం (మోహన్)
- రూపాలక్ష్మి (లక్ష్మి)
- రాజేశ్వరి (లత)
- కల్పిక (రూపిక)
- కల్పలత (సరస్వతి)
- ట్రిష్ (అజయ్)
- జయత్రి (సంధ్య)
- సత్య కృష్ణన్ (ప్రియ)
- శ్రీ హర్ష (శివుడు)
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
- నిర్మాత: నాని, ప్రశాంతి తిపిర్నేని
- సంగీతం: వివేక్ సాగర్
- ఛాయాగ్రహణం: ఎస్. మణికందన్
- కూర్పు: గారీ బిహెచ్
- నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
నిర్మాణం
[మార్చు]2019, అక్టోబరు 24న చిత్ర ప్రారంభోత్సవ వేడుక జరిగింది. అదేరోజు చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అ! సినిమా తర్వాత ఇది వారి రెండవ చిత్రం.[4] 2020, జనవరి 1న టీజర్ విడుదలయింది.[5] "హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం" అనేది ఈ చిత్ర శీర్షిక.[6]
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
పాటలను వివేక్ సాగర్ స్వరపరిచాడు. "పోరాటమే", "వెంటాడే గాయం" పాటలు వరుసగా 2020 ఫిబ్రవరి 25న, ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి.[7][8]
అన్ని పాటల రచయిత కె.కృష్ణకాంత్.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "పోరాటమే" | డేవిడ్ సైమన్ | 4:14 | ||||||
2. | "వెంటాడే గాయం" | మోహన భోగరాజు | 3:32 | ||||||
7:46 |
హోమ్ మీడియా
[మార్చు]ఈ చిత్రం 2020, ఏప్రిల్ 1న ప్రైమ్ వీడియోలో విడుదల కాగా, టివి హక్కులను జెమినీ టీవీ కొనుగోలు చేసింది.[9]
స్పందన
[మార్చు]స్క్రీన్ ప్లే, నటుల నటనను ప్రశంసిస్తూ ది హిందూ పత్రిక ఈ చిత్రానికి సానుకూల సమీక్షను ఇచ్చింది.[6] దక్కన్ క్రానికల్ పత్రిక ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది, "విశ్వక్ సేన్ నటన, వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని ఇంకో లెవల్ కు తీసుకెళ్ళింది" అని రాశారు.[10] హేమంత్ కుమార్ కు చెందిన ఫస్ట్ పోస్ట్ ఈ చిత్రానికి 3.25/5 రేటింగ్ ఇచ్చింది. "నేరాల నేపథ్యంలో ఉన్న సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ అనుభవం ఇస్తుంది" అని రాశారు.[11] ఇండియా టుడే పత్రికకు చెందిన కె. జనని, "దర్శకుడు సైలేష్ కోలను హిట్ చిత్రం ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఇది మిమ్మల్ని అకట్టుకుంటుంది" అని రాశారు.[12] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన నీషితా న్యాపతి, "హిట్ ఖచ్చితంగా మిమ్మల్ని సీటు అంచున ఉంచే చిత్రం కాదు, కానీ సినిమా చూస్తున్నపుడు మీలో ఉత్కంఠ కలుగుతుంది" అని రాశారు.[13] ఫిల్మ్ కంపానియన్ సౌత్ పత్రికకు చెందిన భరద్వాజ్ రంగన్ "సైలేష్ కోలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఫిల్మ్‌మేకింగ్‌లో ప్రపంచ దృష్టికి సరిపోయే ఆధునీకత ఉందని, కానీ దీనికి మంచి ముగింపు అవసరం" అని రాశాడు.[14]
ఇతర వివరాలు
[మార్చు]రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో సైలేష్ కోలను దర్శకత్వం వహించిన హిందీ రీమేక్, సీక్వెల్ చర్చాదశలో ఉన్నాయి.[15]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Hit movie 3-day box office collection: Vishwak Sen assures to score a hit in first weekend". International Business Times. 2 March 2020. Retrieved 2020-10-28.[permanent dead link]
- ↑ సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.
- ↑ "'HIT' Box-Office: Vishwak Sen's crime-thriller enters into profits in the first week itself". The Times of India. 6 March 2020. Retrieved 2020-10-28.
- ↑ Nyayapati, Neeshita (24 October 2019). "Vishwak Sen and Ruhani Sharma's next titled 'Hit'". The Times of India. Retrieved 2020-10-28.
- ↑ "Watch | Teaser of Vishwak Sen-starrer 'Hit' is out". The Hindu. 2 January 2020. Retrieved 2020-10-28.
- ↑ 6.0 6.1 Dundoo, Sangeetha Devi (28 February 2020). "'HIT' movie review: This Vishwak Sen-starrer hits close to the bull's eye". The Hindu. Retrieved 2020-10-28.
- ↑ "Poraatame from Vishwak Sen's HIT released - Times of India". The Times of India. Retrieved 2020-10-28.
- ↑ "Ventaade Gaayam from HIT released - Times of India". The Times of India. Retrieved 2020-10-28.
- ↑ "Hit (The First Case)". Amazon. Retrieved 2020-10-28.
- ↑ Kavirayani, Suresh (3 March 2020). "Hit movie review: An engaging thriller!". Deccan Chronicle. Retrieved 2020-10-28.
- ↑ Kumar, Hemanth (28 February 2020). "HIT movie review: Vishwak Sen stands out in an engaging suspense thriller; Sailesh Kolanu makes promising debut". Firstpost. Retrieved 2020-10-28.
- ↑ Janani K. (28 February 2020). "HIT Movie Review: Vishwak Sen's investigative thriller is a hit". India Today. Retrieved 2020-10-28.
- ↑ Nyayapati, Neeshita (28 February 2020). "Hit: The First Case Movie Review : A film worth watching, especially if you're a fan of crime dramas". The Times of India. Retrieved 2020-10-28.
- ↑ "HIT, With Vishwak Sen And Ruhani Sharma, Is On Amazon Prime: A Rewind Of This Classy Investigative Thriller". FilmCompanion. 1 April 2020. Retrieved 2020-10-28.
- ↑ Varma, Lipika (20 July 2020). "Telugu thriller Hit set to be remade in Hindi". Deccan Chronicle. Retrieved 2020-10-28.
ఇతర లంకెలు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2020 తెలుగు సినిమాలు
- భానుచందర్ నటించిన సినిమాలు
- తెలుగు థ్రిల్లర్ సినిమాలు
- విశ్వక్ సేన్ నటించిన సినిమాలు