భానుచందర్
భానుచందర్ | |
---|---|
జననం | మద్దూరి భానుచందర్ 1952 జూలై 2[1] |
వృత్తి | నటుడు |
పిల్లలు | జయంత్[2] |
తల్లిదండ్రులు |
|
భానుచందర్ చలనచిత్ర నటుడు, దర్శకుడు.[1][3] పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను, సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.
బాల్యం
[మార్చు]సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకైన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలానే తానూ సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు. గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించగలిగేవాడు. భానుచందర్ నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ పొందాడు. అతను శిక్షణ పొందిన సంస్థలో ముందు బ్యాచిలో రజనీకాంత్, తరువాత బ్యాచీలో చిరంజీవి శిక్షణ పొందారు. కొద్ది రోజులు డ్రగ్స్ కి బానిసైనప్పుడు అన్నయ్య అతన్ని మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించాడు.[4] అలా భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు.[1]
కెరీర్
[మార్చు]భానుచందర్ ముందుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడుపాని అనే తమిళ సినిమాలో నటించాడు. తరువాత తమిళంలోనే నీంగళ్ కేటవాయ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో తరువాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు. బాలు మహేంద్ర దర్శకత్వంలో అర్చన జంటగా నటించిన వీడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది.
నటించిన చిత్రాలు
[మార్చు]- మ్యూజిక్ షాప్ మూర్తి (2024)
- రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) (2024)
- ఫోకస్ (2022)
- నిన్నే చూస్తు (2022)
- హిట్ (2020)
- ఎన్.టి.ఆర్. కథానాయకుడు (2019)
- మిక్చర్ పొట్లం (2017)
- రామ్‌లీల (2015)
- ఊ..కొడతారా ఉలిక్కిపడతారా (2012)
- ఆకాశమే హద్దు (2011)
- జలక్ (2011)
- బిందాస్ (2010)
- మనసారా (2010)
- రెచ్చిపో (2009)
- బాణం (2009)
- వీడు మామూలుడు కడు (2008)
- ఇంద్రజిత్ (2008)
- దీపావళి (2008)
- నా అనేవాడు (2008)
- దుబాయ్ శీను (2007)
- హలో ప్రేమిస్తారా (2007)
- ఎవడైతే నాకేంటి? (2007)
- స్టైల్ (2006)
- మధ్యాహ్నం హత్య (2004)
- ఖుషి ఖుషీగా (2004)
- ఇన్స్పెక్టర్ (2003)
- హరివిల్లు (2003)
- సింహాద్రి (2003)
- దేవి (1999)
- సింధూరం (1997)
- దేశద్రోహులు (1995)
- ప్రెసిడెంట్ గారి అల్లుడు (1994)
- రైతుభారతం (1994)
- నక్షత్ర పోరాటం (1993)
- పబ్లిక్ రౌడీ (1992)
- గ్యాంగ్‌వార్ (1992)
- గంగ (1991)
- నాయకురాలు (1991)
- స్టూవర్టుపురం దొంగలు (1991)
- అతిరధుడు (1991)
- కీచురాళ్లు (1991)
- అశ్వని (1991)
- కలియుగ రుద్రుడు (1991)
- ఉద్యమం (1990)
- నేటి దౌర్జన్యం (1990)
- అలజడి (1990)
- ధృవ నక్షత్రం (1989)
- సూత్రధారులు (1989)
- వేగుచుక్క పగటిచుక్క (1988)
- చైతన్యరథం (1987)
- ఉదయం (1987)
- సుహాసిని (1987)
- హంతకుడి వేట (1987)
- నిరీక్షణ (1986)
- పోలీస్ ఆఫీసర్ (1986)
- వేటగల్లు (1986)
- సమాజంలో స్త్రీ (1986)
- మంచి మనుషులు (1986)
- ఖూనీ (1985)
- పున్నమి రాత్రి (1985)
- టెర్రర్ (1985)
- రణరంగం (1985)
- రేచుక్కా (1985)
- ఇంటికో రుద్రమ్మ (1985)
- మెరుపు దాడి (1984)
- యమధూతలు (1984)
- స్వాతి (1984)
- రైల్ డోపిడ్ (1984)
- డాకూ (1984)
- కుర్ర చేష్టలు (1984)
- ముక్కు పుడక (1983)
- గూఢచారి నెం.1 (1983)
- కొంటె కోడళ్ళు (1983)
- ఇద్దరు కిలాడీలు (1983)
- తరంగిణి (1982)
- వంశ గౌరవం (1982)
- ఏడి ధర్మం ఏడి న్యాయం? (1982)
- సత్యం శివం (1981)
- ఆడాళ్లూ మీకు జోహార్లు (1981)
- బెబ్బులి (1980)
- శివమెత్తిన సత్యం (1980)
- మన ఊరి పాండవులు (1978)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "భానుచందర్ ప్రొఫైలు". nettv4u.com. Retrieved 5 October 2016.
- ↑ "Bhanuchander to direct his son Jayanth". timesofindia.indiatimes.com. TNN. Retrieved 5 October 2016.
- ↑ "భానుచందర్ ప్రొఫైలు". veethi.com. Retrieved 5 October 2016.
- ↑ సమీర, నేలపూడి. "మరుజన్మలో ఆ చాన్స్ వదులుకోను!". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 5 October 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భాను చందర్ పేజీ