అయినాల మల్లేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయినాల మల్లేశ్వరరావు కవి, నటులు

అయినాల మల్లేశ్వరరావు గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ‘సహజకవి’.[1] ఆయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఏప్రిల్ 10 1955ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉప్పుమగులూరు గ్రామంలో జన్మించారు. ఆయన ఆంధ్ర, అన్నామలై విశ్వవిద్యాలయాలలో విద్యాభాసం చేసి తెలుగు, ఆంగ్ల భాషలందు ఎం.ఎ. చేసారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మూల్పూరులో పదవీవిరమణ చేసారు. ఆయన తెనాలి రామకృష్ణ అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షులు. శ్రీ అజంతా కళారామం సంస్థకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు.[3]

ఆసియా ఖండంలోని 464 మంది ప్రముఖులతో రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ ప్రచురించిన ‘ఎమరాల్డ్ హూ ఈజ్ హూ ఇన్ ఆసియాపుస్తకంలో ఆయనకు స్థానం లభించింది. ఉపాధ్యాయ వృత్తిలో జాతీయ అవార్డు అందుకున్న అయినాల, రచయితగానూ వాసికెక్కారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో పనిచేస్తున్నారు.[4]

రచనలు[మార్చు]

  • లాల్ బహాదూర్ శాస్త్రి[5]
  • పి.వి.నరసింహారావు[5]
  • రాజీవ్ గాంధీ[5]
  • సర్దార్ వల్లబాయి పటేల్[5]
  • డా.సర్వేపల్లి రాధాకృష్ణన్[5]

మూలాలు[మార్చు]

  1. మేడే సందర్భంగా పాటల పోటీలు
  2. కెప్టెన్‌ విజరుప్రసాద్‌ జీవితం యువతకు స్ఫూర్తి
  3. inala malleswara rao[permanent dead link]
  4. ఆసియా ప్రముఖుల పుస్తకంలో ‘అయినాల’కు చోటు
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "Ayinala Malleswara Rao". anandbooks. Archived from the original on 9 ఆగస్టు 2017. Retrieved 30 January 2016.

ఇతర లింకులు[మార్చు]