ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు
వికీపీడియా నుండి
|
|||||||||||||||||
ముస్లింలు క్రైస్తవుల్ని అహల్ అల్-కితాబ్ (దైవగ్రంథం గలిగిన ప్రజలు) గా పరిగణిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] ముస్లింల దృష్ఠిలో బైబిల్
ముస్లింల అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ఇబ్రాహీం (అబ్రహాం), మూసా (మోషే), ఈసా (ఏసు క్రీస్తు) వంటి ప్రవక్తల కథలని వక్రీకరించి తమకి అనుకూలంగా వ్రాసుకున్నారు. ముస్లింలు ఏసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా అంగీకరించరు. క్రీస్తు తరువాత వచ్చిన ముహమ్మదును చివరి ప్రవక్త అంటారు. బైబిల్ అనేక మార్పులు చేర్పులకు గురై కల్తీ చేయబడింది గనుక దేవుడు ఖురాన్ ద్వారా జరిగిన తప్పుల్ని సరిచేశాడని అంటారు.బైబిల్ తరువాత వచ్చిన అంతిమ దైవగ్రంధం ఖురాన్ అంటారు.ఏసు తరువాత వచ్చిన ఆదరణకర్త సత్యస్వరూపి చివరి ప్రవక్త ముహమ్మదు అంటారు.
[మార్చు] క్రైస్తవుల దృష్ఠిలో ఖురాన్
ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని క్రైస్తవులు అంటారు.బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉటంకించబడ్డాయి. అవి యాకోబు సువార్త, తోమా సువార్త, మరియుబర్నబా సువార్త .ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని ముస్లిముల వాదన.బైబిలే అంతిమ దైవగ్రంధం అంటారు.ఏసు చివరి ప్రవక్త అంటారు.
[మార్చు] క్రైస్తవుల దృష్ఠిలో ముహమ్మద్
క్రైస్తవుల ముహమ్మద్ ని ప్రవక్తగా పరిగణించరు. క్రైస్తవుల దృష్ఠిలో ఏసు క్రీస్తే చివరి ప్రవక్త అనుకుంటారు కానీ యేసుక్రీస్తు తరువాత పౌలు కాలంలో అంతియొకయ సంఘంలో బర్నబా ,సుమెయోను ,లూకియ ,మనయేను ,సౌలు అనే ప్రవక్తలు ఉన్నారు( అపొస్తలుల కార్యములు 13:1). ఆదినములలో ప్రవక్తలు యెరూష్లేము నుండి అంతియొకైయకు వచ్చారు. వారిలో అగబు రాబోయే కరువు గురించి ఆత్మ ద్వారా ప్రవచించాడు( అపొస్తలుల కార్యములు 11:27 ,28). ఈ అగబు పౌలు ను యూదులు బంధించి అప్పగిస్తారని ప్రవచిస్తాడు (అపొస్తలుల కార్యములు 21:10).క్రీస్తు తరువాత వచ్చిన ఇలాంటి చాలా మంది చిన్న ప్రవక్తలను అంగీకరించే క్రైస్తవులు ముహమ్మదును మాత్రం అంగీకరించటం లేదు.ముస్లిములు మాత్రం యోహాను సువార్త 1:22 లో ప్రస్తావించబడిన "ఆ ప్రవక్త", క్రీస్తు తరువాత వచ్చే "ఆదరణకర్త",(యోహాను16:7) ముహమ్మదేనని వాదిస్తున్నారు.