కలివికోడి

వికీపీడియా నుండి
కలివికోడి
కలివికోడి
కలివికోడి
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఎనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: ఏవ్స్
వర్గము: కారడ్రిఫార్మెస్
కుటుంబము: గ్లేరియోలిడే
ప్రజాతి: రైనాప్టిలస్
జాతి: ఆర్. బైటార్క్వేటస్
ద్వినామము
రైనాప్టిలస్ బైటార్క్వేటస్
బ్లిత్, 1848

అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జీవుల జాబితా లోని పక్షి కలివికోడి (Kalivikodi). 1848 లో జెర్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. ఇంగ్లీషులో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ (Jerdon's Courser) అని అంటారు. దీని శాస్త్రీయ నామం - రినోప్టిలస్ బైటర్క్వేటస్ (Rhinoptilus bitorquatus). భారత ప్రభుత్వపు "అటవీ జంతు సంరక్షణ చట్టం 1972" కింద ఈ పక్షి సంరక్షించబడింది.

కలివికోడి స్టాంపు
దస్త్రం:KalivikodiFootprints.jpg
కలివికోడి పాదముద్రలు

గోదావరి, పెన్నా నదీలోయలలో కనిపించే పక్షి ఇది. దీన్ని స్థానికంగా జత పట్టీల చిటానా అనికూడా పిలుస్తారు. 1900 నుంచి కనుమరుగైన ఈ నిశాచర (Nocturnal) పక్షి, 1986 జనవరి తొలి వారంలో మళ్ళీ కనిపించింది. దురదృష్టవశాత్తు ఈ పక్షి మృతి చెందిన కారణంగా బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ వారు తొలిసారిగా ఈ పక్షిని మ్యూజియంలో ఉంచారు. అప్పటినుండీ, ఈ పక్షి వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది.


తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జలాశయం నుండి తవ్వుతున్న ఉపకాలువలు, కలివికోడి నివాసప్రాంతాల గుండా పోతుండడంతో ఈ పక్షి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.

[మార్చు] మూలాలు, వనరులు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=కలివికోడి&oldid=719718" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు