కుంకుమ పువ్వు
| కుంకుమ పువ్వు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
A saffron crocus flower with red stigma.
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| క్రోకస్ సెటైవస్ లిన్నేయస్ |
|||||||||||||||
|
|
కుంకుమ పువ్వు (Saffron) ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి.
విషయ సూచిక |
[మార్చు] కుంకుమ పువ్వు సాగు
భారత దేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్ లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు.
[మార్చు] ఉపయోగాలు
- కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
- కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది.
- ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.
- కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
[మార్చు] మూఢ నమ్మకం
గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. అయితే పూర్వకాలం నుండి ఉంటున్న ఈ మూఢనమ్మకంలో వాస్తవం లేదు, శాస్త్రీయంగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు.
[మార్చు] రసాయనాలు, పోషక విలువలు
| Saffron crocus morphology | |
| → Stamens (male organs). | |
| → Corolla (whorl of petals). | |
| → Corm (propagation organ). | |
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు అనే రసాయనాలు ఉన్నాయి.
పోషక విలువలు : USDA ప్రకారము :
- శక్తి ----------------15.5%,
- కార్బోహైడ్రేట్స్ -------50% ,
- ప్రోటీన్స్ -----------21% ,
- ఫ్యాట్స్ -----------21% ,
- విటమిన్స్ --------77% ,
- మినరల్స్ --------37% ,
- విటమిన్ ' ఎ ' , ఫోలిక్ యాసిడ్ , విటమిన్ ' సి ' ఎక్కువగా ఉన్నాయి .