క్లైవ్ లాయిడ్

వికీపీడియా నుండి

క్లైవ్ లాయిడ్
ఫైలు:Cricket no pic.png
West Indies Cricket Board Flag.svg West Indies
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
Tests ODIs
మ్యాచ్‌లు 110 87
పరుగులు 7515 1977
బ్యాటింగ్ సగటు 46.67 39.53
100లు/50లు 19/39 1/11
అత్యుత్తమ స్కోరు 242* 102
Overs 286 59.4
Wickets 10 8
Bowling average 62.20 26.25
5 wickets in innings
10 wickets in match n/a
Best bowling 2/22 2/4
Catches/stumpings 90/- 39/-

As of నవంబర్ 10, 2005
Source: [1]

1944, ఆగస్ట్ 31న గుయానాలోని జార్జ్‌టౌన్ లో జన్మించిన క్లైవ్ లాయిడ్ (Clive Hubert Lloyd) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974 నుంచి 1985 వరకు వెస్టీండీస్ కెప్టెన్‌గా ఉండి క్రికెట్ లో అగ్రరాజ్యంగా చేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్‌గా అతనికి ఖ్యాతి లభించింది. అతని నాయకత్వంలో వెస్టీండీస్ ఒక దశలో వరుసగా 27 టెస్టులలో పరాజయం పొందలేదు. అందులో 11 వరస విజయాలు. ( ఈ కాలంలో ఒక టెస్టుకు వివియన్ రిచర్డ్స్ నాయకత్వం వహించాడు). లాయిడ్ 3 ప్రపంచ కప్ లలో వెశ్టీండీస్ కు నాయకత్వం వహించాడు. అందులో 1975 మరియు 1979లలో జర్గిన మొదటి, రెండో ప్రపంచ కప్‌లలో వెస్టీండీస్ విజయం సాధించింది. 1983లో జర్గిన ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్ వరకు వచ్చి కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ పై ఓడిపోయారు.

లాయిడ్ టెస్ట్ క్రికెట్‌లో 110 మ్యాచ్‌లు ఆడి 46.67 సగటుతో 7515 పరుగులు సాధించాడు. అతని తొలి టెస్ట్ 1966లో ఆడినాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 242 నాటౌట్. టెస్ట్ క్రికెట్‌లో 19 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు సాధించాడు.

వన్డే క్రికెట్‌లో లాయిడ్ 87 మ్యాచ్‌లు ఆడి 1977 పరుగులు 39.53 సగటుతో సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్థ సెంచరీలు కలవు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102 పరుగులు.

1971లో లాయిడ్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.

రిటైర్‌మెంట్ తర్వాత లాయిడ్ కోచ్‌గా, కామంటేటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2001 నుంచి 2006 వరకు ఐ.సి.సి.మ్యాచ్ రెఫరీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు వెస్టీండీస్ క్రికెట్ మేనేజర్‌గా ఉన్నాడు.

పేజీకి సంభందించిన లింకులు