డెస్మండ్ హేన్స్
| డెస్మండ్ హేన్స్ | ||||
| 50px West Indies | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | ఎడమచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | లెగ్‌బ్రేక్ గుగ్లీ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 116 | 238 | ||
| పరుగులు | 7487 | 8648 | ||
| బ్యాటింగ్ సగటు | 42.29 | 41.37 | ||
| 100లు/50లు | 18/39 | 17/57 | ||
| అత్యుత్తమ స్కోరు | 184 | 152* | ||
| ఓవర్లు | 3 | 10 | ||
| వికెట్లు | 1 | 0 | ||
| బౌలింగ్ సగటు | 8.00 | - | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | |||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | n/a | |||
| అత్యుత్తమ బౌలింగ్ | 1/2 | - | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 65/- | 59/- | ||
1956, ఫిబ్రవరి 15న బార్బడస్ లో జన్మించిన డెస్మండ్ హేన్స్ (Desmond Leo Haynes) వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతడు 1991లో విజ్డెన్ క్రికెటర్ గా ఎన్నికయ్యడు.
1980వ దశాబ్దంలో వెస్టీండీస్ తరఫున ఆడిన బ్యాట్స్‌మెన్‌లలో హేన్స్ ప్రముఖుడు. వెస్టండీస్ కు చెందిన మరో ఒపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గార్డన్ గ్రెనిడ్గ్ తో కల్సి టెస్ట్ క్రికెట్‌లో 16 సెంచరీ భాగస్వామ్యాలు నిర్మించాడు. ఇందులో 4 పాట్నర్‌షిప్ డబుల్ సెంచరీలు. హేన్స్ 116 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి టెస్ట్ క్రికెట్‌లో 42.29 సగటుతో 7487 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 184 పరుగులు. దీనిని 1984లో ఇంగ్లాండుపై సాధించాడు. 1978లో భారత పర్యటనలో హ్యాండిల్ ది బాల్ ప్రకారం ఔటై ఈ విధంగా ఔటైన అతికొద్ది బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిల్చినాడు.
వన్డే క్రికెట్‌లో కూడా హేన్స్ అనేక రికార్డులు సృష్టించిననూ కాలక్రమేణా ఆ రికార్డులు తదుపరి బ్యాత్స్‌మెన్‌లచే తిరగరాయబడ్డాయి. ఒక దశలో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు మరియు అత్యధిక సెంచరీలు హేన్స్ పేరిటే ఉన్నాయి. అతడు 1979, 1983, 1987 మరియు 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లలో 25 మ్యాచ్‌లు ఆడి 854 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 3 అర్థ శతకాలు కలవు.
1997లో క్రికెట్ నుంచి నిష్క్రమించిన పిదప హేన్స్ బార్బడస్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టింగ్ చైర్మెన్‌గా, కార్ల్‌టన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా, వెస్ట్‌ఇండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. సెనేటర్ గాను, జాతీయ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మెన్ గాను విధులు నిర్వహించాడు. అతని ఆత్మకథ లియాన్ ఆఫ్ బార్బడస్ (Lion of Barbados)
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · కొలిన్ క్రాప్ట్ · జోయెల్ గార్నర్ · డెస్మండ్ హేన్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · మైఖెల్ హోల్డింగ్ · కొలిస్ కింగ్ · ఆల్విన్ కాళీచరణ్ · డెరిక్ ముర్రే (వికెట్ కీపర్) · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · ఫావుడ్ బచుస్ · వేనె డేనియల్ · విన్స్టన్ డేవిస్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్ · జోయెల్ గార్నర్ · లారీ గోమ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · డెస్మండ్ హేన్స్ · మైకెల్ హోల్డింగ్ · గస్ లోగీ · మాల్కం మార్షల్ · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| రిచర్డ్సన్ (కెప్టెన్) · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · విన్స్టన్ బెంజిమన్ · ఆండర్సన్ కమ్మిన్స్ · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · బ్రియాన్ లారా · గస్ లోగీ · మాల్కం మార్షల్ · పాట్రిక్ పాటర్సన్ · ఫిల్ సిమ్మన్స్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |