జహీరాబాదు లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సెగ్మెంట్లు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 అసెంబ్లీ సెగ్మెంటు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 సెగ్మెంట్లు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,35,612 [1]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 17.61% మరియు 7.72%.
  • ఓటర్ల సంఖ్య: 12,53,670.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 5 జహీరాబాదు జనరల్ N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2009 5 జహీరాబాదు జనరల్ ఎస్.సురేశ్ కుమార్ పు కాంగ్రెస్ 395767 సయ్యద్ యూసుఫ్ ఆలీ పు తె.రా.స 378360

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్ లింగాయత్ పోటీ చేసారు.[2] పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ యూసఫ్ అలీ పోటీలో ఉన్నాడు. [3] కాంగ్రెస్ పార్టీ టికెట్ సురేశ్ షెట్కార్‌కు లభించింది. [4] సురేశ్ సమీప తె.రా.స పార్టీ పత్యర్థి అయిన యూసుఫ్ ఆలీ పై విజయం సాధించాడు.

2014 ఎన్నికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 28-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009