టేకు

వికీపీడియా నుండి
టేకు
టేకు ఆకులు మరియు పండ్లు.
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Lamiales
Family: వెర్బినేసి
Genus: టెక్టోనా
జాతులు

టెక్టోనా గ్రాండిస్
Tectona hamiltoniana
Tectona philippinensis

టేకు చెట్టు శ్రేష్టమైన కలపకు ప్రసిద్ధి. దీన్ని కలపలలో రారాజు (King of Timbers) గా పరిగణిస్తారు. బారతదేశంలోని టేకు వెర్బినేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం 'టెక్టోనా గ్రాండిస్'. టెక్టోనా అంటే వడ్రంగి ఇష్టపడేది అని అర్ధం. మనదేశ జనాభాలో 30 శాతం మంది టేకు కలపను ఉపయోగిస్తున్నారని ఒక అటవీశాఖ సర్వేలో తేలింది. కానీ మంచి కలప తయారుకావడానికి కనీసం 15-20 సంవత్సరాలు పడుతుంది.

టేకు కలప [మార్చు]

వినమెక్ మాన్షన్ బాంకాక్, థాయిలాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద 'గోల్డెన్ టేక్' భవనం.

టేకు కలప దృఢంగా ఉండి, చెదలను తట్టుకొని, ఎక్కువకాలం మన్నుతుంది. ముదురు గోధుమ రంగు చారలు కలిగి దీనితో చేసిన వస్తువులు చాలా అందంగా ఉంటాయి. అందువలన ఈ కలపని గృహోపకరణాల తయారీలో వాడడానికి ఎక్కువమంది ఇష్టపడతారు.

వెలుపలి లింకులు [మార్చు]

Wiktionary-logo-en.png
టేకు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=టేకు&oldid=826273" నుండి వెలికితీశారు