నెక్ టై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రెండు వేర్వేరు నెక్ టై లు

టై, లేదా నెక్ టై పశ్చిమ దేశాల్లోని ఫార్మల్ వేర్ లో ఒక భాగం. సాధారణంగా పురుషులు కాలర్ చుట్టూ అలంకార ప్రాయంగా కట్టుకునే రిబ్బను వంటి గుడ్డ. కాలరు విధానం బట్టి టై నాట్(ముడి) ఉంటుంది. కాలరు వద్దనున్న గుండీని పెట్టుకొన్నచో ఇది ఫార్మల్ వేర్ అవ్వగా, అదే గుండీని విప్పేసి, వదులుగా తగిలించుకొన్నచో ఇది క్యాజువల్ వేర్ అవుతుంది.

టై నాట్ రకాలు[మార్చు]

టై నాట్ లు (ముడులు) ముఖ్యంగా నాలుగు రకాలు. అవి (అతి సులభమైన దాని నుండి అతి కష్టమైన వరుస లో):

  • ఫోర్ ఇన్ హ్యాండ్ (Four in Hand) లేదా క్రావాట్ (Cravat)
  • ప్రాట్ (Pratt), షెల్బీ (Shelby) లేదా ప్రాట్-షెల్బీ (Pratt-Shelby)
  • హాఫ్ విండ్సర్ (Half Windsor) లేదా సింగిల్ విండ్సర్ (Single Windsor)
  • విండ్సర్ (Windsor), ఫుల్ విండ్సర్ (Full Windsor) లేదా డబుల్ విండ్సర్ (Double Windsor)

90వ దశకం ద్వితీయార్థంలో కేంబ్రిడ్జి క్యావెండిష్ ల్యాబొరెటరీకి చెందిన థామస్ ఫింక్ మరియు యోంగ్ మావో అనే పరిశోధకులు మ్యాథమ్యాటికల్ మోడలింగ్ అనే పధ్ధతిని ఉపయోగించి సాంప్రదాయిక టై ని కట్టుకునే నాట్ లలో ఎనబై ఐదు వివిధ రకాలు సాధ్యపడతాయని కనుగొన్నారు. వీటిని ద ఎయిటీ ఫైవ్ వేస్ టు టై ఎ టై (The 85 Ways to Tie a Tie) అనే పుస్తకం లో ప్రచురించారు. వీటిలో సమరూప మరియు సంతులన యొక్క నాణ్యతలను బట్టి పదమూడింటిని కళాసౌందర్యాత్మక నాట్ లు గా గుర్తించారు. ఈ పుస్తకం ద్వారా, ప్రాచుర్యం ఎక్కువ గల నాలుగు నాట్ లని గుర్తించగలగటమే కాకుండా, అదనంగా గుర్తించిన తొమ్మిది నాట్ లలో కొన్ని ప్రాచుర్యం లేని నాట్ లను మరియు అది వరకు లేని మరికొన్ని సరిక్రొత్త నాట్ లను గుర్తించగలిగారు.

ఇవే కాకుండా ఇతర నాట్ లు:

  • స్మాల్ (Small), ఓరియెంటల్ (Oriental) లేదా కెంట్ (Kent)
  • నికీ (Nicky)
  • ఆట్లాంటిక్ (Atlantic)
  • ప్రింస్ ఆల్బర్ట్ (Prince Albert), డబుల్ (Double) లేదా క్రాస్ విక్టోరియా (Cross Victoria)
  • క్రిస్టెంసన్ (Christensen) లేదా క్రాస్ (Cross)
  • ఇడైటీ (Ediety) లేదా మెరోవింగియన్ (Merovingian)

యూట్యూబ్ లో ఈ క్రింది నాట్ లు ఎలా వేయాలో చూడవచ్చును.

  • షెల్ (Shell)
  • ఎల్డ్ రెడ్జ్ (Eldredge)
  • ట్రినిటీ (Trinity)
  • కేప్ (Cape)
  • ప్లాట్స్ బర్గ్ (Plattsbrgh)
  • క్యావెండిష్ (Cavendish)
  • గ్రాంట్ చెస్టర్ (Grantchester)
  • బాల్థస్ (Balthus)
  • ఓరియెంటల్ (Oriental)
  • సెయింట్ ఆండ్ర్యూస్ (St. Andrews)
  • విక్టోరియా (Victoria)

సభ్యత్వ గుర్తింపు గా టై లు[మార్చు]

ఫిలిప్స్ అకాడమీ కి గల రెండు శైలుల లోని టై లు. చారలు గలది అమెరికన్ సాధారణ (కుడి వైపు ఎత్తుగా ఎడమ వైపు పల్లంగా ఉన్న) శైలి.

ఒకే క్లబ్బుకి, మిలిటరీ రెజిమెంట్ కి, పాఠశాలకి, వృత్తిపరమైన సంఘాల (రాయల్ కాలేజీ, ఇంస్ ఆఫ్ కోర్ట్ ల) ఇత్యాది వాటికి చెందిన వ్యక్తుల సభ్యత్వ గుర్తింపు కోసం ఒకే తీరైన, రంగులు గల టై ల వాడకం ఇంగ్లండు లో 19వ శతాబ్దం లో మొదలైనది.

యునైటెడ్ కింగ్డం లోని చాలా ఉన్నత పాఠశాలల్లో, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా మరియు భారతదేశాలలోని కొన్ని వాటిలో ప్రత్యేకమైన డిజైను గల టైలు యూనీఫారం ల లో భాగాలు గా కలిగి ఉన్నవి. చాలా ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో కూడా టై తప్పని సరి.

యూకే మరియు ఐరోపా దేశాలలో గేడిగా (ధరించిన వ్యక్తికి ఎడమ వైపు ఎత్తుగా, కుడి వైపు పల్లంగా) సమాంతరంగా చారలు ఉన్న టై లని ఇందుకు ఉపయోగిస్తారు.

ఐరోపా చారలకు వ్యతిరేకంగా (ధరించిన వ్యక్తికి కుడి వైపు ఎత్తుగా, ఎడమ వైపు పల్లంగా) ఉన్న టై లను అమెరికా లో ఎటువంటి సభ్యత్వానికి గుర్తింపుగా కాకుండా మామూలుగానే ఉపయోగిస్తారు. ఎటొచ్చీ ఏదైనా సభ్యత్వానికి గుర్తింపుగా కావాలన్నప్పుడు అమెరికాలో కూడా ఐరోపా శైలి టై లనే వినియోగిస్తారు.

చారలకి ప్రత్యామ్నాయంగా టై పిన్ వద్ద ఒక చిహ్నం గానీ, అల వంటి చిహ్నం గల టై లు గానీ, లేదా ఆసాంతం పునరావృత్తమైన ఒకే చిహ్నం గల టైలు గానీ ఉపయోగిస్తారు. ఒక్కోసారి ఈ రెండు రకాలు (చారలు మరియు ప్రత్యామ్నాయం) ఎంపిక కోసమో లేదా సభ్యత్వ స్థాయి ల లో తేడాల కోసమో ఉపయోగించటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈ రెండు ప్రత్యామ్నాయాల కలయిక (చారలతో బాటు ఆసాంతం ఒకే చిహ్నం పునరావృత్తమైన టైల)ని కూడా ఉపయోగించటం జరుగుతుంది.

మహిళల టై లు[మార్చు]

కొన్ని సందర్భాలలో నెక్ టైలు మహిళల కి ప్రత్యేకించి హోటళ్ళు, రెస్టారెంట్ల లో యూనిఫారంలో భాగాలుగా ఉంటాయి. చాలా దేశాలలో బాలికలు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో టైలు యూనిఫారం ల లో భాగాలు. కేవలం ఫ్యాషన్ కొరకు కూడా కొంత మంది మహిళలు టైలన వాడగలరు. 70, 80వ దశకాలలో యువతులు క్యాజువల్ వేర్ గా టైలు వాడటం అసాధారణంగా పరిగడించబడలేదు. 1977 లో డయేన్ కీటన్ అనే నటీమణి అన్నీ హాల్ అనే చిత్రంలో అదే పాత్రని పోషించింది. ఇందులో తను టైలని వాడినది. ఈ చిత్రం విజయవంతమవటంతో కొద్ది రోజులు ఈ ఫ్యాషన్ కొనసాగింది. ఐరోపా అమెరికాలలో 1993 లో టై లు మహిళలకి మరల అలంకార ప్రాయాలైనాయి.

దస్త్రం:Keaton in Annie Hall.jpg
అన్నీ హాల్ లో కీటన్ ధరించిన టై

సమస్యలు మరియు వ్యతిరేకత[మార్చు]

నెక్ టై లని సమర్థించేవారి, వ్యతిరేకించేవరి వాదోపవాదాలు సామాజిక అనుసరణ, వృత్తిపర అంచనాలు, వ్యక్తిగత అభిప్రాయాలు మరియు వాటిని రూపొందించే ప్రక్రియ చుట్టూ అల్లుకొని ఉంటాయి.

ఆరోగ్య మరియు భద్రత ప్రమాదాలు[మార్చు]

చిక్కు పడే, ఇంఫెక్షన్ సోకే, నరాలు కుంచించుకు పోయే ప్రమాదాలు ఉన్నందువలన వ్యతిరేకులు టై లని వాడవద్దనే హితవు పలుకుతారు. పోలీసులు, జైలు గార్డులు, కొన్ని వైద్య సంబంధిత వృత్తులు మరియు భారీ మెషీన్ ల వద్ద పని చేసేవారికి చిక్కు పడటం వలన చిన్న ఇబ్బందుల నుండి ప్రాణహాని జరిగే వరకు ప్రమాదం ఉన్నది. ఇటువంటి వారు టైలు వాడటం మానేయటం కాని, లేదా లాగితే విడిపోయే ప్రీ-నాటెడ్ టై (ముడి వేసేవి కాకుండా, కాలరు కి తగిలించుకుండేవి) లని వాడటం శ్రేయస్కరం. కాలరు ఎక్కువ బిగుతుగా ఉంటే గొంతు వద్ద ఉన్న నరాలు కుంచించుకుపోయి ఫలితంగా కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉన్నది. వేసుకున్నవారికే కాక అవతలి వారికి కూడా టై ప్రమాదాలు తెస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. ఇతర దుస్తులతో పోలిస్తే టై లని శుభ్రపరచే సందర్భాలు తక్కువగా ఉండటంతో ఇవి వ్యాధులని త్వరగా వ్యాపింపజేస్తాయి. 17 సెప్టెంబరు 2007 లో బ్రిటీషు ఆసుపత్రులలో టైలని వాడకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యూకే లో సరదాకి అవతలి వ్యక్తి టై లాగుతూ ఉంటారు. దీనిని పీనటింగ్ (peanuting) లేదా స్క్వాట్ నాటింగ్ (squatknotting) అని అంటారు. ఒక్కోసారి దీనిని బెదిరింపుగా కూడా చేస్తుంటారు.

నెక్ టై వ్యతిరేక భావము[మార్చు]

20 వ శతాబ్దంలో కార్యాలయాలకు వెళ్ళే స్త్రీపురుషుల సంఖ్య పెరిగింది. పని చేసే వైఖరిని, క్రమశిక్షణని, అమ్మకాలని పెంపొందించే సమర్థత టై లకి ఉండటంతో వీటిని ధరించే అవసరం పెరిగినది.

1966 వ సంవత్సరం వరకు టైల వాడకం సర్వసాధారణమైననూ, 1967-69 వరకూ అవసరమైన చోట తప్పితే, దీనిని పాత పద్ధతిగానే భావించారు. 80 వ దశకం లో పునరుత్థానం చెందిననూ, 90 వ దశకం లో (పశ్చిమ దేశాలలో) ఆపిల్ ఇంక్, అమెజాన్, ఈబే, జెనెన్ టెక్, మైక్రోసాఫ్ట్, మోంసాంటో మరియు గూగుల్ వంటి సాంకేతికాధారిత సంస్థలలో క్యాజువల్ డ్రస్ లని ప్రోత్సహించటంతో మరల టైలు ఆదరణ కోల్పోయాయి.

ఐరోపా దేశాల అణచివేత ధోరణికి నిరసనగా ఇరాన్ పాలకులు టై ని నిషేధించారు. 1970 లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమయంలో అమెరికా వార్తాపత్రికలు ఇరాన్ అతివాదులని టర్బంస్ అనీ, మితవాదులని నెక్-టైస్ అని వ్యవహరించటం జరిగినది.

వివిధ నాట్ లలో టైలు[మార్చు]

యూ ట్యూబ్ లో టై నాట్ కట్టే విధానాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నెక్_టై&oldid=1190360" నుండి వెలికితీశారు