పరిశుద్ధ గ్రంథము

వికీపీడియా నుండి

హోలీ బైబిల్ నే తెలుగు క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తారు.అందులోని వాక్యాలు దేవుని వాక్యాలని నమ్ముతారు.

  • పరిచయము:
  • పరిశుద్ధ గ్రంధాన్ని క్రైస్తవులు పవిత్రగ్రంథంగా,పరిశుద్ద దేవుని వాక్కుగా,జీవ గ్రంథంగా,తమ జీవితాలకు మార్గదర్శిగా, వారి జీవితాలను సరిదిద్దే గ్రంథంగా భావిస్తారు..
  • ఇందులోని మొత్తము 66 పుస్తకాలను40మంది ప్రవక్తలు పరిశుద్దాత్మ ద్వారా ప్రేరెపించబడి రాశారు.
  • మొదటి భాగం పాతనిబంధన క్రీస్తు పుట్టుకకి ముందు జరిగిన విషయాలున్నాయి.ఇందులో 39 పుస్తకాలున్నాయి. రెండవ భాగం క్రొత్తనిబంధనలో క్రీస్తు జననానంతరం జరిగిన విషయాలున్నాయి.ఇందులో27 పుస్తకాలు ఉన్నాయి.
                                           పాతనిబంధన గ్రంథము
  • పుస్తకముల పేర్లు వాటి వివరణ
సంఖ్యా       పుస్తకము                                                                అధ్యాయములు
  • 1) ఆదికాండము 50
  • 2) నిర్గమకాండము 40
  • 3) లేవియకాండము 27
  • 4) సంఖ్యాకాండము 36
  • 5) ద్వితీయోపదేశకాండము 34
  • 6) యెహొషువ 24
  • 7) న్యాయాధిపతులు 21
  • 8) రూతు 4
  • 9) 1సమూయేలు గ్రంథము 31
  • 10) 2సమూయేలు గ్రంథము 24
  • 11) 1 రాజులు గ్రంధము 22
  • 12) 2 రాజులు గ్రంథము 25
  • 13) 1 దినవృత్తాంతములు గ్రంథము 29
  • 14) 2 దినవృత్తాంతములు గ్రంథము 36
  • 15) ఎజ్రా 10
  • 16) నెహెమ్యా 13
  • 17) ఎస్తేరు 10
  • 18) యోబు గ్రంథము 42
  • 19) కీర్తనల గ్రంథము 150
  • 20) సామెతలు 31
  • 21) ప్రసంగి 12
  • 22) పరమగీతము 8
  • 23) యెషయా గ్రంథము 66
  • 24) యిర్మీయా 52

‍*25) విలాపవాక్యములు 5

  • 26) యెహెజ్కేలు 48
  • 27) దానియేలు 12
  • 28) హొషేయ 14
  • 29) యోవేలు 3
  • 30) ఆమోసు 9
  • 31) ఓబద్యా 1
  • 32) యోనా 4
  • 33) మీకా 7
  • 34) నహూము 3
  • 35) హబక్కూకు 3
  • 36) జెఫన్యా 3
  • 37) హగ్గయి 2
  • 38) జెకర్యా 14
  • 39) మలాకీ 4

                                                ఆదికాండము
  • 1వ అధ్యాయము:
  • 1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను!*2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను;చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను;*3దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుందెను! *4దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను!వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను;దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను!*5దేవుడు వెలుగునకు పగలనియు,చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమయెను.
  • 6మరియు దేవుడు-జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను!*7దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను!8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమయాను.
  • 9దేవుడు-ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను!*10దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను,జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను,అది మంచిదని దేవుడు చూచెను!*11దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను!*12భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను!*13అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను!
  • 14దేవుడు-పగటిని రాత్రిని వేరు పరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు,అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు,!*15భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను: ఆ ప్రకారమాయెను!*16దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను,అనగా పగటిని ఎలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.!*17-18భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశవిశాలమందు వాటినుంచెను;*అది మంచిదని దేవుడు చూచెను!
  • 19అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
  • 20దేవుడు-జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్దిగా పుట్టించును గాకనియు,పక్షులు భూమి పైని ఆకాశవిశాలములో ఎగురునుగాకనియు పలికెను!*21దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్దిగా పుట్టించిన మహ మత్స్యములను,జీవము కలిగి చలించు వాటినన్నిటిని,దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను.అది మంచిది అని దేవుడు చూచెను!*22దేవుడు-మీరు ఫలించి అభివృద్దిపొంది సముద్రజలములలో నిండియుండుడనియు,పక్షులు భూమి మీద విస్తరించు గాకనియు,వాటిని ఆశీర్వదించెను!*23అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
  • 24దేవుడు-వాటివాటి జాతి ప్రకారము జీవముగల వాటిని,అనగా వాటి వాటి జాతి ప్రకారాము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించు గాకని పలికెను;ఆ ప్రకారమాయెను!
  • 25దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను,ఆ యా జాతుల ప్రకరాము పశువులను,ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను.అది మంచిదని దేవుడు చూచెను!
  • 26దేవుడు-మన స్వరూపమందు మన పొలికె చొప్పున నరులను చేయుదుము;వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను!*27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను;దేవుని స్వరూపమందు వాని సృజించెను;స్త్రినిగాను,పురుషునిగాను వారిని సృజించెను!*28దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా-మీరు ఫలించి అభివృద్దిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి;సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్ర్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను!*29దేవుడు- ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను;అవి మీకాహరమగును!*30భూమి మీదనుండు జంతువులన్నితికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్ర్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహరమగుననియు పలికెను.ఆ ప్రకారమాయెను!*31దేవుడు తాను చేనినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగనుండెను.*అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయెను!
పేజీకి సంభందించిన లింకులు