పర్సా సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్సా సత్యనారాయణ
పర్సా సత్యనారాయణ

పర్సా సత్యనారాయణ


వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 2, 1924
కంభంపాడు, గుంటూరు జిల్లా
మరణం మే 22, 2015
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా

పర్సా సత్యనారాయణ (జూన్ 2, 1924 - మే 22, 2015) కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వెంకటసుబ్బమ్మ, వెంకమరాజు దంపతులకు గుంటూరు జిల్లా, కంభంపాడులో జూన్ 2, 1924 న జన్మించారు. పదో ఏడు వచ్చే వరకు సోంత ఊర్లోనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 1943 లో స్థిరపడ్డారు. తర్వాత తెనాలి ప్రాంతంలోని నందివెలుగులో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్లారు.

ఉద్యమ జీవితం[మార్చు]

19 సంవత్సరాల వయస్సులోనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తొలి నాళ్లలోనే నైజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరుకు సిద్ధం కావడమే కాకుండా పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరు సలిపిన నేతగా పేరొందారు. కార్మికుల జీవితాలలో వెలుగు నింప డానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నాడు. ఈక్రమంలోనే సింగ రేణి కార్మికులెదుర్కొంటున్న సమస్య లపై సమర శంఖం పూరించడానికి ఆయన ఆద్యు డిగా నిలిచారు. ఇందుకుగాను పర్సా సింగరేణి కాల రీస్ ఎంపాయిస్ యూనియన్ ను స్దాపించారు. గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటా లను ఈ యూనియన్ ద్వారా నిర్వహించారు.[2][3]

ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిజాంకు వ్యతిరే కంగా పోరాడుతున్న క్రమంలో అరెస్టయిన పర్సా 2 సార్లు ఔరంగాబాద్ జైలు గోడలు దూకి తప్పిం చుకున్నాడు. దీంతో పర్సా సత్యనా రాయణ ఉద్యమ కదలికలపై ప్రత్యే క నిఘా పెట్టిన నైజాం సర్కార్ ఆయనను డేంజరస్ ప్రిజనర్‌గా ప్రక టించింది. సాధారణంగా ఖైదీలను ఉంచే చెర సాలలో కాకుండా ఆయనను 6 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తున్న చీకటి చెరసాలలో నెలల తరబడి బంధించింది.

కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన నాటి నుండి కార్మిక శ్రేయస్సు కోసం పాటుబడిన పర్సా 1970 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ర్ట అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచే శారు.[4] అలాగే సిఐటియు అఖిల భారత కమిటీ ఉపా ధ్యక్షుడిగా పనిచేసిన పర్సా దేశంలోని కార్మికచట్టాలు కార్మికులకు ఉపయోగపడేలా ఉద్యమాలు నిర్వహించారు.[5]

రాజకీయ జీవితం[మార్చు]

సిపిఎం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న అతను 1962లో పాల్వంచ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఏగా గెలుపొందారు.

వివిధ సేవలు[మార్చు]

  1. 1984లో ఖమ్మం లోక్‌సభా స్థానం నుండి జలగం వెంగళరా వుపై పోటీచేసి ఓడిపోయారు.[6] సుదీర్ఘకాలం కమ్యూ నిస్ట్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన పర్సా కార్మిక పక్షపాతిగానే గుర్తింపు పొందారు.
  2. సిఐటియు ఆవిర్భావం నుండి ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
  3. 1962లో పాల్వంచ ఎమ్మెల్యేగా పనిచేశారు.[7]
  4. 1984లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేశారు.
  5. సింగరేణి కార్మికుల సమస్యలపై ఉద్యమాల నిర్మాణంలో పర్సా కీలక పాత్ర పోషించారు.[8]

మరణం[మార్చు]

తీవ్ర అనారోగ్యంతో బాధపడిన పర్సా సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులోని కుమార్తె ఇంటివద్ద 2015, మే 22వ తేదీన తుది శ్వాస విడిచారు.[9]

మూలాలు[మార్చు]

  1. A mess on May Day- hindu article on May 2, 2007
  2. Guests Of Honour At The 18th Congress [permanent dead link]
  3. A Very Brief History of Trade Unions in the erstwhile Hyderabad State
  4. "People's Democracy-(Weekly Organ of the Communist Party of India (Marxist)". Archived from the original on 2016-03-05. Retrieved 2015-05-25.
  5. "CITU AP State Conference Held". Archived from the original on 2015-03-30. Retrieved 2015-05-25.
  6. janam sakshti.org[permanent dead link]
  7. "ఎమ్మెల్యేగా ఎన్నిక వివరాలు-ఎలక్టన్స్ ఇండియా.కాం నుండి". Archived from the original on 2018-04-14. Retrieved 2015-05-25.
  8. Condolence: comrade Parsa Satyanarayana[permanent dead link]
  9. "parsa satyanarayana no more". Archived from the original on 2015-05-24. Retrieved 2015-05-25.

ఇతర లింకులు[మార్చు]