పాల్వంచ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?పాల్వంచ మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పాల్వంచ |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 18 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
99,597 (2001) • 51267 • 48330 • 65.38 • 74.76 • 55.33 |
పాల్వంచ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం పాల్వంచ. కొత్తగూడెం - భద్రాచలం రహదారిపై, కొత్తగూడెం కు 12 కి మీ ల దూరంలో ఉన్న పాలంచ కొత్తగూడెం శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మంలోక్‌సభ నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది.
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
- AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్) విద్యుత్ కేంద్రం(KTPS)
- స్పాంజి ఐరన్ ఇండియా లిమిటెడ్ (SIIL)
- నవభారత్ ఫెర్రో అల్లాయిస్ లిమిటెడ్ మొదలైనవి.
ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉన్నది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు”
విషయ సూచిక |
[మార్చు] రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది.
[మార్చు] విద్యా సంస్థలు
• జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (KTPS)
• జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPPS)
• ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt. Jr. College)
• ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt. Degree College)
ఇవి కాక మరెన్నో ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా వివరణ ఇస్తాను.
[మార్చు] చూడదగ్గ ప్రదేశాలు
కిన్నెరసాని నది: పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది కిన్నెరసాని. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.
పెద్దమ్మ తల్లి గుడి:
పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ గుడి కి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి ఆదివారం వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదం గా భావిస్తారు. జంతు (కోడి, మేక) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి క్రుపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్రాసం.
[మార్చు] ప్రత్యేకతలు
వెంకటేశ్వర స్వామి దేవాలయం: నవభారత్ సంస్థచే నవభారత్ కొండపై నిర్మించబడిన ఈ గుడి ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ గుడి ఇస్లామిక్, గోతిక్ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
రాధాకృష్ణ దేవాలయం: KTPS కాలనీలో ఉన్నది. కళ్యాణ మండపం కూడా కలిగిఉంది.
విద్యుత్ కళా భారతి ఆటస్థలం: ఖమ్మం జిల్లలో కెల్లా పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందినదో తెలియరాలేదు కానీ, క్రికెట్ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్ ఆట అభివృద్దికి దోహదం చేసింది. K.T.P.S: పాల్వంచ లో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పాల్వంచ
పాల్వంచ అనునది పాత పాల్వంచ మరియు కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమరు 1,20,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉన్నది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
|
|||||||
|
|
|
|---|---|
| ఎలుపుగొండ · బోడగట్ · ఎల్లుపేట్ · షాబాద్ · ఎల్లంపల్లి (టేక్మల్) · హసన్మొహమ్మద్పల్లి · అచాన్నపల్లి · ఎల్కుర్తి · కోరంపల్లి · ఏక్లాస్పూర్ (టేక్మల్) · టేక్మల్ · తంప్లూర్ · కడ్లూర్ · బోదమట్పల్లి · బర్దీపూర్ · దడాయిపల్లి · మల్కాపుర్ · పాల్వంచ · ధన్నారం · కుసంగి |