కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొత్తగూడెం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో కొత్తగూడెం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో కొత్తగూడెం మండలం యొక్క స్థానము
కొత్తగూడెం is located in Telangana
కొత్తగూడెం
తెలంగాణ పటములో కొత్తగూడెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°32′31″N 80°36′43″E / 17.541915°N 80.611954°E / 17.541915; 80.611954
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,84,415
 - పురుషులు 92,611
 - స్త్రీలు 91,804
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.94%
 - పురుషులు 76.45%
 - స్త్రీలు 59.41%
పిన్ కోడ్ 507101

కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల ఒక చిన్న పట్టణము. పిన్ కోడ్: 507101. ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచ లు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలవు.

రవాణా సదుపాయాలు[మార్చు]

కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంటనర ప్రయాణము. పాల్వంచ పట్టణము మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణములో చెప్పోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరము అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణములో కలదు. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా కలదు.

భౌద్ధం ఆనవాళ్ళు[మార్చు]

కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.

మండలంలోని పట్టణాలు[మార్చు]

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

ramavaram

వెలుపలి లింకులు[మార్చు]