బెర్ముడా ట్రయాంగిల్
వికీపీడియా నుండి
| బర్ముడా ట్రయాంగిల్ | |
|---|---|
| వర్గీకరణ | |
| Grouping: | సహజాతీత స్థలాలు (Paranormal places) |
| వివరణ | |
| ఇతర పేర్లు: | డెవిల్స్ ట్రయాంగిల్ (Devil's Triangle) |
| దేశం: | అంతర్జాతీయ జలాలు |
| స్థితి: | Urban legend |
బెర్ముడా ట్రయాంగిల్ (ఆంగ్లము:Bermuda Triangle, లేదా Devil's Triangle), వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కధలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.
సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. [1] ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.[2][3][4]
విషయ సూచిక |
[మార్చు] బెర్ముడా త్రికోణం పరిధి, హద్దులు
"బెర్ముడా త్రికోణం" అని ప్రసిద్ధమైనా గాని ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయితా ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరిబియన్ దీవి మరియు అజోరెస్‌కు తూర్ప భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం - వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణం శీర్షాలు షుమారుగా - ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్, పోర్టోరికో మరియు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి.
ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరిబియన్ దీవులకు చెందిన ఓడలు, మరియు విమానాలు ఇక్కడ తరచు కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని (ocean current) ప్రవహిస్తుంటుంది. దీని 5 లేదా 6 నాట్‌ల(knots) ప్రవాహ వేగం కొన్ని ఓడలు అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చును. అంతే కాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి, మళ్ళీ సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచిక్కకుండా మాయమై ఉండవచ్చును. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందకముందు.[5]
[మార్చు] బెర్ముడా త్రికోణం కధ మొదలు
ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని తన అక్టోబర్ 11, 1492 లాగ్ బుక్‌లో వ్రాసాడు.[6] అయితే ఈ దృశ్యాన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూచిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకొనే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు.
1950 సెప్టెంబరు 16న E.V.W. Jones వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమయన ఊహాగానాలకు, లెక్క లేననన్ని పరిశోధనలకు ఆద్యం. [7] తరువాత రెండేళ్ళకు ఫేట్ అనే పత్రికలో "Sea Mystery At Our Back Door" [8], అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత వ్రాసాడు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన ఐదు అవెంజర్ బాంబర్ విమానాలు - అన్నింటినీ కలిపి Flight 19 అంటారు - అదృశ్యమవ్వడాన్ని వర్ణించాడు. తరువాత Flight 19 ఘటన ఒక్కటే వివరంగా American Legion అనే పత్రిక ఏప్రిల్ 1962 సంచికలో వచ్చింది. [9] ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్నమాటలు - "మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. మేము ఎక్కడున్నామో తెలవడంలేదు". తరువాత ఇదే ఘటన గురించి Vincent Gaddis అనే రచయిత ఫిబ్రవరి 1964లో Argosy పత్రికలో వ్రాసిన వ్యాసం ఈ ఘటనకు మిస్టరీ రూపాన్ని ప్రసిద్ధం చేసింది. ఈ రచనలోనే "The Deadly Bermuda Triangle"[10] అనే ఆకర్షణీయమైన పేరు వాడాడు. ఇదే రచయిత మరుసటి యేడాది Invisible Horizons అనే పుస్తకంలో ఇక్కడి ఘటనల గురించి మరింత వివరంగా వ్రాశాడు.[11] తరువాత ఈ మిస్టరీ గురించి అనేక రచనలు వెలువడ్డాయి. John Wallace Spencer (Limbo of the Lost, 1969) [12]; Charles Berlitz (The Bermuda Triangle, 1974)[13]; Richard Winer (The Devil's Triangle, 1974) [14] లాంటివి. ఈ రచనలన్నింటిలోనూ Eckert ప్రతిపాదించి అసహజ, అలౌకికమైన మిస్టరీ బాణీని కొనసాగించారు.[15]
- కుశ్చే వివరణ
అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుశ్చే అనే పరిశోధకుడు అప్పటివరకూ ఉన్న వివిధ రచనలను పరిశీలించి, 1975లో The Bermuda Triangle Mystery: Solved అనే పుస్తకం ప్రచురించాడు.[16]. ఇందులో అప్పటివరకూ ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాలు చేశాడు. అతని పరిశీలనల ప్రకారం
- ఈ బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగినవని చెబుతున్న అదృశ్యఘటనలు చాలా వరకు అతిశయోక్తులతోను లేదా అసంపూర్ణ పరిశోధనతోను లేదా అస్పష్ట సమాచారంతోను తెలుపబడ్డాయి.
- కొన్ని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పబడ్డాయి.
- తుఫానులు తరచు వచ్చే ఇలాంటి ఇతర రద్దీ రవాణా సముద్ర ప్రాంతాలలో జరిగే ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి ఎక్కువేమీ కాదు.
మొత్తానికి కుశ్చే ఇలా తేల్చాడు - బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన. అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాఛితంగా గాని లేదా ఉద్దేశ్య పూర్వకంగా గాని ఇది ఒక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారు.[16] §Epilogue, p. 277
- మరి కొన్ని అభిప్రాయాలు
నౌకా యానంతోనూ, సముద్ర ప్రయాణాలతోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, అ.సం.రా. తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏమీకాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాలవంటివే ఇక్కడా జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించిన సంచలనాత్మకమైన కధనాలు చాలా వరకు నిరాధారమైనవి అని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది.[17] [18] ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమాదంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదేహం మాత్రం కాఫీ కప్పును పట్టుకొన్న భంగిమలో ఓడలో మిగిలి ఉందని ఒక "త్రికోణం రచయిత" వ్రాసాడు. కాని నిజానికి దాదాపు అందరు మరణించినవారి శరీరాలను తీరభద్రతా సంస్థ వెలికి తీసింది.[12], 1973 edition
పత్రికలు, పుస్తకాలు అధికంగా "సంచలనం కలిగించే" విషయాలపై మొగ్గు చూపుతారని, అందువల్లనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనలకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం.(NOVA / Horizon - episode The Case of the Bermuda Triangle 1976-06-27) - ఇతర సముద్ర ప్రాంతాలలోనూ, తుఫానులలోనూ ఓడలు మరియు విమానాలు ఎలా పనిచేస్తాయో, ఎలా విఫలమౌతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతున్నది. [19] ఎర్నస్ట్ ట్రావెస్[20] బ్యారీ సింగర్ [21] వంటి హేతువాద పరిశోధకులు కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఈ త్రికోణం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద నగరాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు కలిపి ఏటా లక్షలలో వాహనాల రాకపోకలకు కేంద్రంగా ఉన్నాయి.
[మార్చు] ప్రకృతి సహజ వివరణలు
(Natural explanations)
- మిథేన్ హైడ్రేటులు (Methane clathrate)
భూబాగాల అంచున ఉండే మహా సముద్రాల మెరక ప్రాంతాల (continental shelves)లో కొన్ని చోట్ల పెద్దపెట్టున మిథేన్ హైడ్రేటుల నిల్వలు ఉన్నాయి. వీటినుండి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను తగ్గించేస్తాయి. కనుక అక్కడ ఓడలు తేలియాడే గుణం (ప్లవన శక్తి) తగ్గుతుంది. ప్రయోగశాలలలో నమూనా ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చునని తెలుస్తున్నది. [22] 1981లో అ.సం.రా. జియొలాజికల్ సర్వే వారు అమెరికా తీరప్రాంతాలలో ఉన్న మిథేన్ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు.[23]. అయితే వారి వెబ్ సైటులో ఉన్న సమాచారం ప్రకారం "బెర్ముడా త్రికోణం" అనబడుతన్న ప్రాంతంలో పెద్దయెత్తున మిథేన్ వాయువు విడుదలైన దాఖలాలు ఏమీ లేవు.[24]
- దిక్సూచి చలనాలు
బెర్ముడా త్రికోణంలో జరిగిన అనేక ఘటనలలో దిక్సూచి పని చేయకపోవడం లేదా అనూహ్యంగా ప్రవర్తించడం గురించి ప్రస్తావనలున్నాయి. ఇక్కడేదో ప్రత్యేకమైన లేదా బలమైన అయస్కాంత శక్తి ఉండవచ్చునని ఊహలున్నాయి కాని అటువంటి ఆధారాలు ఇంతవరకూ ఏవీ బయటపడలేదు. అంతే కాకుండా భూమిమీద వివిధ ప్రాంతాలలో భౌగోళిక ఉత్తర ధృవం మరియు అయస్కాంత ఉత్తర ధృవం ఒకటి కాదు. కనుక ఇలాంటి పెద్ద ప్రాంతంలో ఓడలు ప్రయాణించేటపుడు దిక్సూచి సూచకాలలో తేడాలు రావడం అసహజం కాదు.
- తుఫానులు
అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో బలమైన తుఫానులు తరచు సంభవిస్తుంటాయి. వీటికారణంగా ఎంతో జననష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 1502లో en:Francisco de Bobadilla నాయకత్వంలోని స్పానిష్ ఫ్లీటు మునిగిపోవడం చరిత్రలో తుఫాను కారణంగా నమోదయిన మొదటి నౌకాభంగం. బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలు ప్రధాన కారణం తుఫానులు కావచ్చును.
- గల్ఫ్ అంతర్వాహిని
గల్ఫ్ స్ట్రీమ్ ఆనేది మెక్సికో సింధుశాఖ నుండి ఫ్లోరిడా జలసంధి మీదుగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒజ సముద్ర అంతర్వాహిని. అనగా ఇది సముద్రంలో ఒక నది లాంటిది. ఇది తన ప్రవాహంలో తేలే వస్తువులను లాగుకువెళ్ళిపోవడం సహజం. కనుక ఇక్కడ పడిపోయిన ఓడలు లేదా విమానాలు అక్కడ ఉండకుండా మరెక్కడో సుదూర ప్రాంతాలలో బయట పడడం అసహజం కాదు. 1967 డిసెంబరు 22న జరిగిన ప్రమాదంలో Witchcraft అనే cabin cruiser ఒకచోటునిండి సమాచారం పంపింది కాని రక్షణాబలగం వారి పడం అక్కడికి వెళ్ళేసరికి ఆ పడవ అక్కడలేదు.
- అసాధారణమైన అలలు
ప్రశాంతమైన సముద్రంలో కూడా ఒకోమారు అసాధారణంగా పెద్దవైన అలలు (rogue waves) హఠాత్తుగా సంభవిస్తుంటాయి. 1982లో అలాంటి ఒక మహాతరంగం కారణంగా Newfoundland సమీపంలోని సముద్రంలో Ocean Ranger అనబడే అప్పటి అతిపెద్ద ఆయిల్ ప్లాట్‌ఫారమ్ వూరికే తిరగబడిపోయింది. అయితే బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఇలాంటి మహాతరంగాలు రావడం గురించిన ఆధారాలు లేవు. అందునా వాటి కారణంగా అయితే విమాన ప్రమాదాలకు వివరణ ఇవ్వడం సాధ్యం కాదు.
[మార్చు] మానవ చర్యలు
- వ్యక్తుల పొరపాట్లు
తమ విధుల నిర్వహణలో వ్యక్తులు తెలిసి గాని, తెలియక గాని తప్పిదాలు చేయడం సహజం. అందునా విపత్కర పరిస్థితులలో ఇలాంటి చర్యలు జరిగే అవకాశం మరింత ఎక్కువ. ఇలాంటి తప్పిదాలే బెర్ముడా ట్రయాంగిల్‌లో జరిగిన అనేక ఘటనలకు కారణాలు కావచ్చునని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఉదాహరణకు 1972లో V.A. Fogg అనే ట్యాంకర్ విధ్వంసానికి కారణం - తేలికగా నిప్పు అంటుకొనే బెంజీన్ మరకలను తుడవడానికి తీసుకోవాలసిన జాగ్రత్త గురించి ఆ పని చేసే వ్యక్తికి తగినంత శిక్షణ ఉండకపోవడమే. అలాగే 1958 జనవరి 1న హార్వే కొనొవర్ అనే వ్యాపారవేత్త మొండిగా వ్యవహరించి ఫ్లారిడా వద్ద తన sailing yacht ను తుఫాను మధ్యలోకి తీసుకువెళ్ళినందువల్ల దానిని కోల్పోయాడు. చాలా కేసులలో ధ్వంసమైన నౌకల లేదా విమానాల శకలాలు లభించనందువలన నిర్దిష్టమైన ఆధారాలు లభించడంలేదని పలు అధికారిక నివేదికలలో చెప్పబడింది.
- దురుద్దేశ పూర్వకమైన చర్యలు
యుద్ధం, పైరసీ (సముద్రపు దోపిడి), దోపిడి వంటి కారణాల వల్ల కూడా కొన్ని అదృశ్య ఘటనలు జరిగి ఉండవచ్చును. ప్రపంచ యుద్ధాలలో జలాంతర్గాముల దాడి ద్వారా, లేదా సముద్రంపై ఓడల దాడి ద్వారా అనేక నావలు నాశనం చేయబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులలో కూడా నమోదు కాలేదు కనుక ఇదమిత్థంగా నిర్ధారంచడం సాధ్యం కాలేదు. ఉదాహరణకు 1918లో USS Cyclops అనే యుద్ధ నౌక, తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో Proteus మరియు Nereus అనే నౌకలు జలాంతర్గాముల దాడులవల్ల అదృశ్యమయ్యాయని అభిప్రాయం ఉంది కాని జర్మనీ రికార్డులలో ఈ విషయం నిర్ధారం కావడంలేదు.
15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు సముద్రాలలో పైరసీ చర్యలు తరచు జరుగుతూ ఉండేవి. వీటికి తోడు మాదక ద్రవ్యాల రవాణా చేసే ముఠాలు కూడా కొన్ని పడవల అదృశ్యానికి కారణం కావచ్చును. కరిబియన్ సముద్ర ప్రాంతంలో 1560 నుండి 1760 కాలంలో పైరసీ అధికంగా ఉండేది. ఎడ్వర్డ్ టీచ్ (Edward Teach Blackbeard), జీన్ లాఫిట్ (Jean Lafitte) వంటి పైరేటులు ఈ ప్రాంతంలో ప్రసిద్ధులు. లాఫిట్ కూడా ఈ బెర్ముడా త్రికోణం ఘటనలోనే మరణించాడని ఒక అభిప్రాం ఉంది.
సముద్రం మీద దోపిడి చేసే పైరేటులే కాకుండా తీర ప్రాంతంలో మాటు వేసి, ఓడలను తప్పు దారి మళ్ళించి, వాటిని దోపిడి చేసే ముఠాలు ఉన్నాయి. వీరు సంపదలను దోచుకొని ఓడలో జనాలను చంపివేసేవారు. వీరిని బాంకర్స్ లేదా రెక్కర్స్ (Bankers or wreckers) అంటారు. తీరంనుండి లైటుల ద్వారా ఓడలను తప్పుదారి పట్టించడం వీరవలంబించే పద్ధతులలో ఒకటి. Nags Head, North Carolina తీరంలో ఒక గుర్రానికి లాంతరు కట్టి, దాని నడక ద్వారా ఓడలను భ్రమింపజేసే విధానం ప్రసిద్ధం.
[మార్చు] ప్రజాబాహుళ్యంలో ఉన్న నమ్మకాలు
(Popular theories) బెర్ముడా త్రికోణం గురించి చాలా సాహిత్యం (కాల్పనికము, పరిశోధనాత్మకమూ కూడాను) వెలువడింది. జనప్రియమైన రచనలలో అలౌకిక, అసాధారణ శక్తుల ప్రభావంవల్ల ఇక్కడి ఘటనలు జరుగుతున్నాయనేది బాగా ప్రచారం పొందిన భావం. ఒకప్పుడు గొప్పగా ప్రభవించి, తరువాత అంతరించిన అట్లాంటిస్ (Atlantis) అనే భూఖండపు నాగరికత సాంకేతిక పరిజ్ఞానపు అవశేషాలు బెర్ముడా త్రికోణంలో ఇంకా పనిచేస్తున్నాయని, వాటి ప్రభావం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక ప్రచారం. అట్లాంటిస్ నాగరికత సిద్ధాంతానికి అనుబంధమైన మరొక ప్రచారం గాధ ఏమంటే - బహామా దీవుల సమీపంలో, బెర్ముడా త్రికోణ పరిధిలో బిమిని అనే దీవి ఉంది. ఈ దీవి సమీపంలో వృత్తాకారంలో ఉన్న శిలల అమరికకు బిమిని రోడ్ అని పేరు. ఈ "రోడ్డు" ఒకప్పటి అట్లాంటిస్ నాగరికతకు చెందిన ఒక రోడ్డు లేదా గోడ లేదా మరొక కట్టడం అని అభిప్రాయం. కాని ఇది సహజమైన రాతి అమరికయేనని భూగర్భ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.[25]
ప్రచారంలో ఉన్న మరొక భావం - గ్రహాంతర వాసులు తమ తమ రోదసి వాహనాలలో ఇక్కడికి వస్తున్నారని. వారి వాహనాలు యు.ఎఫ్.ఓ.లు (UFO)గా వివిధ రచనలలోను, సినిమాలలోను ప్రసిద్ధమయ్యాయి. గ్రహాంతర వాసుల ఇక్కడి మనుషులను, జంతువులను, పూర్తి ఓడలను కూడా ఎత్తుకుపోతున్నారనేది ఇలాంటి కధనాలలో ముఖ్యాంశం. ఈ రకమైన కధనే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్(Steven Spielberg) తన సినిమా Close Encounters of the Third Kindలో ఉపయోగించాడు.
అసహజ, అసాధారణ శక్తుల గురించి అనేక పుస్తకాలు వ్రాసిన ఛార్లెస్ బెర్లిజ్ అనే రచయిత తన బాణీలో ఇక్కడ ఏవేవో అనిర్వచనీయ, అసాధారణ శక్తులున్నాయని వ్రాసాడు. [13]
[మార్చు] ప్రసిద్ధ ఘటనలు
బెర్ముడా త్రికోణం ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగినట్లుగా భావింపబడుతుంది, వాటిలో కొన్ని సంఘటనలు బాగా ప్రసిద్ధమయ్యాయి.List of Bermuda Triangle incidents
- ఫ్లైట్ 19 (Flight 19)
"ఫ్లైట్ 19" (Flight 19) అనేది అమెరికా నౌకా దళానికి చెందిన "టి.బి.ఎమ్. అవెంజర్ బాంబురు విమానాల"(TBM Avenger) శిక్షణా ప్రయాణం. ఇది డిసెంబరు 5, 1945న అట్లాంటిక్ అసముద్రంలో అదృశ్యమయ్యింది. అప్పుడు దిక్సూచి (కంపాస్) సరిగా పనిచేయలేదని, వాతావరణం ప్రశాంతంగా ఉందని, ప్రమాదానికి కారణాలు తెలియడంలేదని, శిక్షణా పైలట్ లెఫ్టినెంట్ ఛార్లెస్ కారొల్ టాయ్‌లర్ (Charles Carroll Taylor) అనుభవజ్ఞుడైన నాయకుడని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాలపై వివిధ సందేహాలున్నాయి.[26] కొన్ని ముఖ్యమైన వివరాలు లభించలేదు. ఉదాహరణకు ఆ పైలట్ ఇంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెండు మార్లు దారి తప్పిన సందర్భాలు ఉన్నాయి. అతనికి ఈ ప్రాంతం సుపరిచితం కాదు. సంభాషణల రిపోర్టులో దిక్సూచి సమస్యల గురించిన ప్రస్తావన లేదు.[26]
- మేరీ సెలెస్టి
1872లో " మేరీ సెలెస్టి" (Mary Celeste) అనే పేరుగల ఓడ పోర్చుగల్ తీరప్రాంతంలో వదలివేయబడింది. అంటే దీనికీ, బెర్ముడా త్రికోణానికీ ఏమీ సంబంధం లేదు. ఈ ఘటన ఆధారంగంగా ప్రఖ్యాత డిటెక్టివ్ నవలారచయిత అర్థర్ కోనాన్ డోయల్(Arthur Conan Doyle) Marie Celeste అనే చిన్నకధ వ్రాశాడు. ఇక పోతే Mari Celeste అనే ఇలాంటి పేరే ఉన్న ఒక ఓడ సెప్టరంబరు 13, 1864న[27] బెర్ముడా తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ చివరి ఘటన మాత్రం బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగింది కాని, మొదటి ఘటన(1872)ను, దానిపైన ఆధారపడి వ్రాసిన కల్పిత కధలోని విషయాలను ఈ 1864లో జరిగిన ఓడ ప్రమాదంతో కలగలిపి వర్ణించడం జరుగుతుంది.
- ఎల్లెన్ ఆస్టిన్
వివిధ కధనాల ప్రకారం ఎల్లెన్ ఆస్టిన్ (Ellen Austin) అనే నౌకకు 1881లో ఒక వదలివేయబడిన నౌక తారసపడింది. ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని (prize crew) ఉంచి న్యూయార్క్‌కు తోడ్కొనిపోవాలని ప్రయత్నించారు. ఆ అజ్ఞాత నౌక మధ్యలో అదృశ్యమయ్యింది. మళ్ళీ కనిపించేసరికి అందులో సిబ్బంది ఎవరూ లేరు. మళ్ళీ ఒకమారు అదృశ్యమై తరువాత ఇంకొక సిబ్బందితో కనిపించిందట. లాయడ్స్ వారి రికార్డులు (Lloyd's of London records) పరిశీలిస్తే Meta అనే నౌకను 1854లో నిర్మించారు. 1880లో ఆMeta పేరు Ellen Austinగా మార్చారు. ఆ నౌకకు సంబంధించిన ఏ విధమైన మరణాలు (లేదా అదృశ్యమైన సిబ్బంది) నమోదు కాలేదు. అజ్ఞాత నౌకలో ఉంచిన సిబ్బంది అదృశ్యమైతే అవి "ఎల్లెన్ ఆస్టిన్" నౌకా సిబ్బంది మరణాలుగా నమోదు కావాల్సి ఉంది.[28]
- యు.ఎస్.ఎస్. "సైక్లోప్స్"
అమెరికా నౌకాదళం చరిత్రలో యుద్ధం లేకుండా ఎక్కువ మంది సైనికులు మరణించిన ఘటన యు.ఎస్.ఎస్. "సైక్లోప్స్" (USS Cyclops) అదృశ్యమవ్వడం. మార్చి4, 1918న బార్బడోస్‌లో బయలుదేరిన ఈ యుద్ధనౌక, 309 మంది సిబ్బందితో సహా అంతులేకుండా అదృశ్యమైంది. స్పష్టమైన కారణం ఏమీ కనిపించడంలేదు. తుఫానులు, శత్రువుల దాడి, మునిగిపోవడం వంటి అనేక కారణాలను పరిశోధకులు ఊహిస్తున్నారు.[29][30]
- థియొడోసియా బర్ ఆల్‌స్టన్
థియొడోసియా బర్ ఆల్‌స్టన్ (Theodosia Burr Alston, మాజీ అమెరికా ఉపరాష్ట్రపతి Aaron Burr కుమార్తె. ఆమె అదృశ్యం కావడానికి బెర్ముడా త్రికోణపు ఘటనలతో సంబంధం కలిపి చెబుతుంటారు [31]. ఆమె Patriot అనే నౌకలో ప్రయాణికురాలు. Charleston నుండి న్యూయార్క్ నగరానికి డిసెంబరు 30, 1812న బయలుదేరింది. తరువాత ఆమె జాడ తెలియరాలేదు. యుద్ధం, పైరేటులు వంటి ఎన్నో విషయాలుఆమె అదృశ్యమవ్వడానికి కారణాలుగా చెబుతుంటారు.
- స్ప్రే
1909లో జోషువా స్లోకమ్ అనే అనుభవజ్ఞుడైన కెప్టెన్ స్ప్రే అనే గట్టి తెరచాప పడవ (sailing vessel)లో కరిబియన్ నుండి వెనిజ్వెలాకు ప్రయాణమయ్యాడు. ఆ నౌక అదృశ్యమైంది. ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అదృశ్యమయ్యే సమయంలో ఆ నౌక బెర్ముడా త్రికోణం ప్రాంతలో ఉందనుకోవడానికి కూడా ఆధారాలు లేవు. ఏదైనా తిమింగలాన్ని ఢీకొనడం వల్ల గాని, లేక స్టీమర్ తాకిడి వల్ల గాని ఆ పడవ ధ్వంసం అయి ఉండవచ్చునని భావించారు. అసహజమైన కారణాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు.
- కారొల్ ఎ.డీరింగ్
కారొల్ ఎ.డీరింగ్ అనేది 1919లో నిర్మింపబడిన ఐదు తెరచాప స్తంభాల బలమైన నావ. (A five-masted schooner). ఇది జనవరి 31, 1921న డయమండ్ షోల్స్ (Diamond Shoals, Cape Hatteras, North Carolina) వద్ద వదిలివేయబడ్డ నావగా దర్శనమిచ్చింది. అప్పటి పైరసీ లేదా స్మగులింగ్ చర్యలకు సంబంధించిన విషయాలు ఈ నావను వదలి వేయడానికి కారణాలు కావచ్చును. S.S. Hewitt అనే మరొక నావ కూడా షుమారు ఇదే సమయంలో అదృశ్యమైంది. డీరింగ్ అదృశ్యమైన సమయంలో డీరింగ్ ప్రయాణించిన మార్గంలోనే మరొక నావ వెళ్ళినట్లు, ఆ రెండవ నావ lightship సంకేతాలను అసలు పట్టించుకోకుండా ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. ఆ రెండవ నావయే Hewitt కావచ్చును. డీరింగ్ అదృశ్యానికి, దీనికి కొంత సంబంధం ఉండి ఉండవచ్చును.[32]
- డోగ్లాస్ డి.సి.3
డిసెంబరు 28, 1948న , NC16002 అనే నెంబరు గల ఒక en:Douglas DC-3 విమానం సాన్ యోన్ నుండి మియామీకి (from San Juan, Puerto Rico, to Miami) ప్రయాణిస్తుండగా అదృశ్యమయ్యింది. విమానం శకలాలు గాని, అందులో ప్రయాణిస్తున్న 32 మంది మృత దేహాలు గాని ఏమీ లభించలేదు. విమానం అదృశ్యమవ్వడానికి కారణాలు తెలియరాలేదు. పౌర విమానయాన బోర్డు (Civil Aeronautics Board) పరిశోధనలో తెలిసిన ఒక చిన్న విషయం - ప్రయాణానికి ముందు విమానం బ్యాటరీల చార్జింగ్ తక్కువలో ఉంది. కాని పైలట్ నిర్ణయానుసారం వాటిని రీచార్జి చేయకుండానే విమానంలో పెట్టారు. అయితే ఇందు కారణంగా విమానం కూలిపోయే అవకాశాలు కనిపించడంలేదు. ఏమయినా ఈ బ్యాటరీలకు సంబంధించిన సమాచారం త్రికోణం రచయితల పుస్తకాలలో పెద్దగా ప్రస్తావించబడలేదు.[33]
- స్టార్ టైగర్ మరియు స్టార్ ఎరియెల్
స్టార్ టైగర్ మరియు స్టార్ ఎరియెల్ అనేవి Avro Tudor IV మోడల్‌కు చెందిన విమానాలు. వీటిలో స్టార్ టైగర్ 1948 జనవరి 30న అజోరెస్ నుండి బెర్ముడాకు వెళుతుండగా అదృశ్యమయ్యింది. స్టార్ ఎరియెల్ 1949 జనవరి 17న బెర్ముడా నుండి జమైకాకు వెళుతుండగా అదృశ్యమయ్యింది. విమానం సిబ్బంది నుండి ఎటువంటి ప్రమాద హెచ్చరికలు రాలేదు. అదృశ్యమవడానికి కొద్దిసేపు ముందు పైలట్లనుండి వచ్చిన సందేశాల ప్రకారం అంతా నార్మల్‌గానే ఉంది. రెండు ఘటనలకూ కారణాల గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైలట్లు చివరి క్షణంలో పరికరాలను గమనించడంలో అశ్రద్ధ చూపి ఉండవచ్చుననే ఊహ మరి కొన్ని ఇతర ప్రమాదాల విశ్లేషణ ద్వారా కలుగుతుంది కాని అందుకు ఆధారం లేదు. స్టార్ టైగర్ కేవలం 2000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నందున పడిపోవడానికి ముందు ప్రమాద హెచ్చరిక పంపేందుకు చాలినంత సమయం ఉండి ఉండకపోవచ్చును కూడాను.[34]
- కె.సి.135 స్ట్రాటోంకర్
ఆగష్టు 28, 1963న అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు KC-135 Stratotanker విమానాలు ఢీకొని అట్లాంటిక్‌లో కూలిపోయాయి. త్రికోణం రచయితల కధనాల ప్రకారం ఈ రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొనలేదు. 160 మైళ్ళ దూరంలో ఉన్న రెండు వేరు వేరు స్థలాలలో ఈ రెండు విమానాలు (మరొక రెండు గుర్తు తెలియని వస్తువులతో?) ఢీకొన్నాయి.[14][13][10]) కాని కుశ్చే పరిశోధన ప్రాకరం "రెండవ ప్రమాద స్థలం" అని చెప్పబడే చోటు కేవలం ఒక పాత తెప్ప చుట్టూ పోగుపడిన సముద్రపు మొక్కలు, తుక్కు మాత్రమే ( seaweed and driftwood tangled in an old buoy)[16]
- ఎస్.ఎస్. మెరైన్ సల్ఫర్ క్వీన్
"ఎస్.ఎస్. మెరైన్ సల్ఫర్ క్వీన్" (SS Marine Sulphur Queen) అనే T2 ట్యాంకరు చమురు రవాణాకు వాడబడేది. దానిని సల్ఫర్ రవఅణాకు అనుగుణంగా మర్చారు. 1963 ఫిబ్రవరి 4 తరువాత దీని జాడ తెలియరాలేదు. Florida Keys వద్ద ఇది అదృశ్యమైనపుడు అందులో 39 మంది సిబ్బంది ఉన్నారు. 1964 "ఆర్గొసీ" పత్రికలో Vincent Gaddis వ్రాసిన వ్యాసంలో ఈ ఘటన "అజ్ఞాతంలోకి పయనమైన నౌక" అని వ్రాయబడింది.[10]. కాని తీర భద్రతా దళం (Coast Guard) రిపోర్టు ప్రకారం ఈ ట్యాంకరును సరుగా మెయింటెయిన్ చెయ్యలేదు. ఇది సముద్ర ప్రయాణాలకు అనుమతించబడ కూడనిది.[35][36]
- రైఫుకు మారు
1921లో గాని లేదా కొద్ది సంవత్సరాల తరువాత గాని "రైఫుకు మారు" (Raifuku Maru) లేదా "రైకుకె మారు" (Raikuke Maru) అనే జపాన్ నౌక ప్రయాణికులతో సహా మునిగి పోయింది. మునిగిపోయే ముందు ఎదో "కత్తి లాంటి ప్రమాదం" తమమీద పడుతుందని సందేశం ఇచ్చినట్లు పలు త్రికోణ కధనాలలో వ్రాశారు. ("Danger like dagger now. Come quick!", or "It's like a dagger, come quick!") - ఈ "dagger" (కత్తి) ఏమిటనే విషయం మీద చాలా ఊహలున్నాయి. ఉదాహరణకు అది ఒక నీటి బుగ్గ కావచ్చునని. నిజానికి ఆ నౌక "త్రికోణం" ప్రాంతంలో లేనేలేదు. దాని ప్రమాద సంకేతంలో "dagger" అన్న పదం కూడా లేదు. 1925 ఏప్రిల్ 21న బోస్టన్‌లో బయలుదేరిన ఈ నౌక జర్మనీ లోని హాంబర్గ్ వైపు ప్రయాణిస్తుంది. ఇది ఒక తుఫాన్‌లో చిక్కుకొని ఉత్తర అట్లాంటిక్‌లో మునిగిపోయింది. మునిగిపోయే ముందు ఆ నౌక ఇచ్చిన సందేశం "Now very danger. Come quick." దగ్గరలో ఉన్న RMS Homeric అనే నౌక ఈ "రైఫుకు మారు"ను రక్షించడానికి ప్రయత్నించింది కాని విఫలమయ్యింది.[37]
- కన్నమెరా
కన్నమెరా-4 (Connemara IV) అనే విహార నౌక 1955 సెప్టెంబరు 26న బర్ముడాకు దక్షిణాన అట్లాంటిక్‌లో తేలియాడుతూ కనిపించింది. అందులో మనుషులెవరూ లేరు. కధనాల ప్రకారం మూడు తుఫానులు వచ్చినా ఈ నావ నిలిచిందని, కాని అందులోని సిబ్బంది మాయమయ్యారని. [13][14]). నిజానికి అ సమయంలో ఆ స్థలంలో వచ్చిన ఒకే ఒక తుఫాను పేరు "Edith". తరువాత పరిశోధనలో నిశ్చయంగా తేలిందేమంటే "Edith" తుఫాను వచ్చినపుడు "కన్నమెరా" రేవులోనే కట్టివేసి ఉంది. తుఫాను కారణంగా దాని కట్లు తెగిపోయి అది సముద్రంలోకి నెట్టబడింది.
[మార్చు] త్రికోణం రచయితలు
"బెర్ముడా త్రికోణం"లో జరిగినవని చెప్పబడే ఘటనలను వర్ణించిన ముఖ్యమైన పుస్తకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- Gian J. Quasar (2003). Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery, (Reprinted in paperback (2005) ISBN 0-07-145217-6), International Marine / Ragged Mountain Press. ISBN 0-07-142640-X.
- [13] Charles Berlitz (1974). The Bermuda Triangle, 1st, Doubleday. ISBN 0-385-04114-4.
- [16] Lawrence David Kusche (1975). The Bermuda Triangle Mystery Solved. ISBN 0-87975-971-2.
- [12] John Wallace Spencer (1969). Limbo Of The Lost. ISBN 0-686-10658-X.
- David Group (1984). The Evidence for the Bermuda Triangle. ISBN 0-85030-413-X.
- [27] Daniel Berg (2000). Bermuda Shipwrecks. ISBN 0-9616167-4-1.
- [14] Richard Winer (1974). The Devil's Triangle. ISBN 0553106880.
- Richard Winer (1975). The Devil's Triangle 2. ISBN 0553024647.
- [31] Adi-Kent Thomas Jeffrey (1975). The Bermuda Triangle. ISBN 0446599611.
మరి కొన్ని సంబంధిత రచనల కోసం ఆంగ్ల వికీలో Bermuda Triangle source page చూడవచ్చును.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు, వనరులు
- మూలాలు
- ↑ కాఖ్రాన్-స్మిత్, మెరిలిన్ (2003). "Bermuda Triangle: dichotomy, mythology, and amnesia". జర్నల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ 54.
- ↑ పరిచయం. Bermuda Triangle .org.
- ↑ విమాన దుర్ఘటనలు. Bermuda Triangle .org.
- ↑ తప్పిపోయిన నౌకలు. Bermuda Triangle .org.
- ↑ Bermuda Triangle. strangegr.
- ↑ Excerpts from Christopher Columbus' Log.
- ↑ మూస:Cite newspaper
- ↑ George X. Sand (October 1952). "Sea Mystery At Our Back Door". Fate.
- ↑ Allen W. Eckert (April 1962). "The Lost Patrol". American Legion.
- ↑ 10.0 10.1 10.2 Vincent Gaddis (February 1964). "The Deadly Bermuda Triangle". Argosy: p. 28–29, 116–118..
- ↑ Vincent Gaddis (1965). Invisible Horizons.
- ↑ 12.0 12.1 12.2 John Wallace Spencer (1969). Limbo Of The Lost. ISBN 0-686-10658-X.
- ↑ 13.0 13.1 13.2 13.3 13.4 Charles Berlitz (1974). The Bermuda Triangle, 1st, Doubleday. ISBN 0-385-04114-4.
- ↑ 14.0 14.1 14.2 14.3 Richard Winer (1974). The Devil's Triangle. ISBN 0553106880.
- ↑ (March , 2004) "Strange fish: the scientifiction of Charles F. Berlitz, 1913-2003". Skeptic.
- ↑ 16.0 16.1 16.2 16.3 Lawrence David Kusche (1975). The Bermuda Triangle Mystery Solved. ISBN 0-87975-971-2.
- ↑ Office of Investigations and Analysis.
- ↑ V A Fogg (PDF). USCG.
- ↑ మూస:Cite episode
- ↑ Taves, Ernest (1978). " ". The Skeptical Inquirer 111 (1): p.75–76.
- ↑ Singer, Barry (1979). " ". The Humanist XXXIX (3): p.44–45.
- ↑ Methane Bubble. Monash Univ..
- ↑ Gas Hydrate at the USGS. Woods Hole (1981).
- ↑ Gas Hydrate at the USGS, Bermuda Triangle. Woods Hole.
- ↑ (January 2004) "A Geologist's Adventures with Bimini Beachrock and Atlantis True Believers". Skeptical Inquirer.
- ↑ 26.0 26.1 The Disappearance of Flight 19. Bermuda Triangle .org.
- ↑ 27.0 27.1 Daniel Berg (2000). Bermuda Shipwrecks. ISBN 0-9616167-4-1.
- ↑ Ellen Austin. Bermuda Triangle .org.
- ↑ Bermuda triangle. D Merrill.
- ↑ Myths and Folklore of Bermuda. Bermuda Cruises.
- ↑ 31.0 31.1 Adi-Kent Thomas Jeffrey (1975). The Bermuda Triangle. ISBN 0446599611.
- ↑ Carroll A Deering. Graveyard of the Atlantic.
- ↑ Airborne Transport, Miami, December 1948 (PDF). Aviation Safety.
- ↑ The Tudors. Bermuda Triangle .org.
- ↑ Marine Sulphur Queen (PDF). USCG.
- ↑ The Queen with the Weak Back. TIME.
- ↑ మూస:Cite episode
- పత్రికలలో వార్తలు
చాలా త్రికోణం ఘటనలకు సంబంధించిన వార్తా కధనాల సేకరణ .pdf ఫార్మాట్‌లో Proquest నుండి లభిస్తుంది. New York Times, Washington Post, Atlanta Constitution వంటి అనేక పత్రికలనుండి సేకరణలు ఈ సైటులో లభిస్తాయి. ఈ వెబ్‌సైటులోని సమాచారం కావాలంటే ముందుగా (ఏదైనా లైబ్రరీ, కాలేజి, విశ్వవిద్యాలయం వంటి సంస్థలకు అనుబంధంగా) రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వస్తుంది.
- "Great Hunt On For 27 Navy Fliers Missing In Six Planes Off Florida," New York Times, December 7, 1945.
- "Wide Hunt For 27 Men In Six Navy Planes," Washington Post, December 7, 1945.
- "Fire Signals Seen In Area Of Lost Men," Washington Post, December 9, 1945.
- "Japanese Ships Sinks With A Crew Of 38; Liners Unable To Aid," New York Times, April 22, 1925.
- "Passengers Differ On Homeric Effort To Save Sinking Ship," New York Times, April 23, 1925.
- "Homeric Captain Upheld By Skippers," New York Times, April 24, 1925.
- "Liner Is Battered In Rescue Attempt," New York Times, April 25, 1925.
- SS Cotopaxi
- "Lloyd's posts Cotopaxi As "Missing," New York Times, January 7, 1926.
- "Efforts To Locate Missing Ship Fail," Washington Post, December 6, 1925.
- "Lighthouse Keepers Seek Missing Ship," Washington Post, December 7, 1925.
- "53 On Missing Craft Are Reported Saved," Washington Post, December 13, 1925.
- "Cold High Winds Do $25,000 Damage," Washington Post, March 11, 1918.
- "Collier Overdue A Month," New York Times, April 15, 1918.
- "More Ships Hunt For Missing Cyclops," New York Times, April 16, 1918.
- "Haven't Given Up Hope For Cyclops," New York Times, April 17, 1918.
- "Collier Cyclops Is Lost; 293 Persons On Board; Enemy Blow Suspected," Washington Post, April 15, 1918.
- "U.S. Consul Gottschalk Coming To Enter The War," Washington Post, April 15, 1918.
- "Cyclops Skipper Teuton, 'Tis Said," Washington Post, April 16, 1918.
- "Fate Of Ship Baffles," Washington Post, April 16, 1918.
- "Steamer Met Gale On Cyclops' Course," Washington Post, April 19, 1918.
- "Piracy Suspected In Disappearance Of 3 American Ships," New York Times, June 21, 1921.
- "Bath Owners Skeptical," New York Times, June 22, 1921. piera antonella
- "Deering Skipper's Wife Caused Investigation," New York Tines, June 22, 1921.
- "More Ships Added To Mystery List," New York Times, June 22, 1921.
- "Hunt On For Pirates," Washington Post, June 21, 1921
- "Comb Seas For Ships," Washington Post, June 22, 1921.
- "Port Of Missing Ships Claims 3000 Yearly," Washington Post, July 10, 1921.
- Wreckers
- "'Wreckreation' Was The Name Of The Game That Flourished 100 Years Ago," New York Times, March 30, 1969.
- S.S. Suduffco
- "To Search For Missing Freighter," New York Times, April 11, 1926.
- "Abandon Hope For Ship," New York Times, April 28, 1926.
- "Hope Wanes in Sea Search For 28 Aboard Lost Airliner," New York Times, January 31, 1948.
- "72 Planes Search Sea For Airliner," New York Times, January 19, 1949.
- DC-3 Airliner NC16002 disappearance
- "30-Passenger Airliner Disappears In Flight From San Juan To Miami," New York Times, December 29,1948.
- "Check Cuba Report Of Missing Airliner," New York Times, December 30, 1948.
- "Airliner Hunt Extended," New York Times, December 31, 1948.
- Harvey Conover and Revonoc
- "Search Continuing For Conover Yawl," New York Times, January 8, 1958.
- "Yacht Search Goes On," New York Times, January 9, 1958.
- "Yacht Search Pressed," New York Times, January 10, 1958.
- "Conover Search Called Off," New York Times, January 15, 1958.
- KC-135 Stratotankers
- "Second Area Of Debris Found In Hunt For Jets," New York Times, August 31, 1963.
- "Hunt For Tanker Jets Halted," New York Times, September 3, 1963.
- "Planes Debris Found In Jet Tanker Hunt," Washington Post, August 30, 1963.
- B-52 Bomber (Pogo 22)
- "U.S.-Canada Test Of Air Defence A Success," New York Times, October 16, 1961.
- "Hunt For Lost B-52 Bomber Pushed In New Area," New York Times, October 17, 1961.
- "Bomber Hunt Pressed," New York Times, October 18, 1961.
- "Bomber Search Continuing," New York Times, October 19, 1961.
- "Hunt For Bomber Ends," New York Times, October 20, 1961.
- Charter vessel Sno'Boy
- "Plane Hunting Boat Sights Body In Sea," New York Times, July 7, 1963.
- "Search Abandoned For 40 On Vessel Lost In Caribbean," New York Times, July 11, 1963.
- "Search Continues For Vessel With 55 Aboard In Caribbean," Washington Post, July 6, 1963.
- "Body Found In Search For Fishing Boat," Washington Post, July 7, 1963.
- "Tanker Lost In Atlantic; 39 Aboard," Washington Post, February 9, 1963.
- "Debris Sighted In Plane Search For Tanker Missing Off Florida," New York Times, February 11, 1963.
- "2.5 Million Is Asked In Sea Disaster," Washington Post, February 19, 1963.
- "Vanishing Of Ship Ruled A Mystery," New York Times, April 14, 1964.
- "Families Of 39 Lost At Sea Begin $20-Million Suit Here," New York Times, June 4, 1969.
- "10-Year Rift Over Lost Ship Near End," New York Times, February 4, 1973.
- SS Sylvia L. Ossa
- "Ship And 37 Vanish In Bermuda Triangle On Voyage To U.S.," New York Times, October 18, 1976.
- "Ship Missing In Bermuda Triangle Now Presumed To Be Lost At Sea," New York Times, October 19, 1976.
- "Distress Signal Heard From American Sailor Missing For 17 Days," New York Times, October 31, 1976.
- వెబ్ లింకులు
- Text of Feb, 1964 Argosy Magazine article by Vincent Gaddis
- United States Coast Guard database of selected reports and inquiries
- Website of historian & Bermuda Triangle researcher Gian Quasar
- U.S. Navy Historical Center Bermuda Triangle FAQ
- U.S. Navy Historical Center (Selective Bibliography)
- The Bermuda Triangle: Startling New Secrets, Sci Fi Channel documentary (November 2005)
- Navy Historical Center: The Loss Of Flight 19
- on losses of heavy ships at sea
- Bermuda Shipwrecks
- Association of Underwater Explorers shipwreck listings page
- Dictionary of American Naval Fighting Ships
- పుస్తకాలు
(Most of the works listed here are largely out of print. Copies may be obtained at your local library, or bought used at bookstores, or through E-Bay or Amazon.com. It should be noted that these books are often the only source material for some of the incidents which have taken place within the Triangle.)
- Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery by Gian J. Quasar, International Marine/Ragged Mountain Press (2003) ISBN 0-07-142640-X; contains list of missing craft as researched in official records. (Reprinted in paperback (2005) ISBN 0-07-145217-6).
- The Bermuda Triangle, Charles Berlitz (ISBN 0-385-04114-4): Appears to be currently out of print; however, there are many other books available covering the same material, frequently the same stories.
- The Bermuda Triangle Mystery Solved (1975). Lawrence David Kusche (ISBN 0-87975-971-2)
- Limbo Of The Lost, John Wallace Spencer (ISBN 0-686-10658-X)
- The Evidence for the Bermuda Triangle, (1984), David Group (ISBN 0-85030-413-X)
- The Final Flight, (2006), Tony Blackman (ISBN 0-9553856-0-1) It should be noted that this book is a work of fiction.
- Bermuda Shipwrecks, (2000), Daniel Berg(ISBN 0-9616167-4-1)
- The Devil's Triangle, (1974), Richard Winer (ISBN 0553106880); this particular book sold well over a million copies by the end of its first year; to date there have been at least 17 printings.
- The Devil's Triangle 2 (1975), Richard Winer (ISBN 0553024647)
- From the Devil's Triangle to the Devil's Jaw (1977), Richard Winer (ISBN 0553108603)
- Ghost Ships: True Stories of Nautical Nightmares, Hauntings, and Disasters (2000), Richard Winer (ISBN 0425175480)
- The Bermuda Triangle (1975) by Adi-Kent Thomas Jeffrey (ISBN 0446599611)
[మార్చు] బయటి లింకులు
- మూస:Coord/display/title,inline[ఆధారం కోరబడినది] Geo-links for Bermuda Triangle
- Database of selected reports and inquiries. United States Coast Guard.
- Gian Quasar. Author's website. Bermuda Triangle .org.
- Bermuda Triangle FAQ. US Navy Historical Center.
- Selective Bibliography. US Navy Historical Center.
- The Loss Of Flight 19. US Navy Historical Center.
- Shipwreck listings page. Association of Underwater Explorers.
- Dictionary of American Naval Fighting Ships. US Navy Historical Center.