మల్లావఝ్జల సదాశివ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లావఝ్జల సదాశివ్
జననంమల్లావఝ్జల సదాశివ్
సెప్టెంబర్ 2, 1943
India ముర్మూర్, రామగుండం, పెద్దపల్లి
మరణంనవంబర్ 25, 2005
గోదావరిఖని, తెలంగాణ
నివాస ప్రాంతంగోదావరిఖని, తెలంగాణ
వృత్తికవి,
గేయరచయిత,
సాహితీవేత్త & సామాజికవేత్త.

మల్లావఝ్జల సదాశివ్ ( సెప్టెంబర్ 2, 1943 - నవంబర్ 25, 2005) ఉపాధ్యాయుడు, కవి, గేయరచయిత, సాహితీవేత్త, సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలో తన గళంతో, కలంతో ఎంతో మందిని చైతన్యవంతుల్ని చేశారు. ఎన్నో పత్రికలకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. మహనది అనే పత్రికను కూడా స్థాపించారు. సాంస్కృతిక ఉద్యమాన్ని విస్తృతంగా విస్తరించడం కోసం చేతన సాహితి సాంస్కృతిక సమాఖ్యను ప్రారంభించారు. 20 ఏళ్ళ పాటు ఎన్నో విప్లవ, అభ్యుదయ గీతాలెన్నింటికో ఊపిరి పోశారు.

బాల్యం

[మార్చు]

ఈయన 1943, సెప్టెంబర్ 2 రోజున ఆనాటి కరీంనగర్ జిల్లాలోని రామగుండం మండలం ముర్మూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట కృష్ణయ్య, తల్లి లక్ష్మీ నర్సమ్మ. వీరిది బ్రాహ్మణ కుటుంబం. వృతిరీత్యా ఉపాధ్యాయుడు. చిన్నపటి నుండే సాహిత్యం పై మక్కువ పెంచుకున్నాడు.

కుటుంబ నేపధ్యం

[మార్చు]

మల్లావఝ్జల సదాశివ్ కు ఏడుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.

జీవిత ప్రస్థానం

[మార్చు]

తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వెనుకాడుతున్న సందర్భంలో నిర్బంధాన్ని ధిక్కరించి నీటి పంపిణీలో జరుగుతున్న అన్యాయాన్ని పాటతో రూపమిచ్చి తన తెగువను ప్రదర్శించిన కవి. బడి పంతుల్నే అయినా .. ఇడుముల్లో ఇరుక్కుల్లో ఉన్న ... సామానున్ని మాత్రం కాదు .. సంపూర్ణ మానవున్ని... జాతి భవితకు కారకున్ని... సామాజిక ఆర్థిక అసమానతలకు, పీడన దోపిడీకి, కుల వ్యవస్థకి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారుడు. ఆ క్రమంలో ప్రభుత్వ నిర్బంధాలను, అనేకనేక దాడులను, పోలీస్ కేసులను భరించి పోరాడిన ఉద్యమకారుడు. ప్రజలని చైతన్య వంతున్ని చేయడం కోసం అనేక సామాజిక సంస్థలను ఏర్పాటు చేసి వాటి ధ్వారా కులాధిపత్యాన్ని, మతపరమైన అసమానతలను, స్ర్రీలపై కొనసాగుతున్న పురుషాధిపత్య ధోరణికి రాష్ట్ర స్థాయిలో అనేక సభలను నిర్వహించి ఎంతో మందిని చైతన్యవంతున్ని చేసారు. ఒక వైపు ఉపాధ్యాయుడిగా ఉంటూనే రామగిరి అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించేవారు. మహానది అనే పత్రికను కూడా ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నారు. 90 వ దశకంలో జిల్లాలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కార్యక్రమం, అక్షర ఉజ్వల కోసం ఎన్నో పాటలు రాసి తన కంచు కంఠంతో ఆలపించి కీలక భూమికను పోషించారు. ఎంతో మంది కవులు, జానపద కళాకారులను ప్రోత్సహించారు. మలి దశ ఉద్యమంలో ఆయన పాటతో ఒక చుక్కానిలా ముందుకు సాగారు.

రచనలు

[మార్చు]
  • తలపున పారుతుంది గోదారి , నీ చేను, నీ చేలాకా ఎడారి.. రైతన్న నీ బతుకు అమాస, ఎన్టీపిసి చూస్తంది తమాషా..
  • బడి పంతుల్నే అయినా .. ఇడుముల్లో ఇరుక్కుల్లో ఉన్న ... సామానున్ని మాత్రం కాదు .. సంపూర్ణ మానవున్ని... జాతి భవితకు కారకున్ని...
  • ఏమున దక్కో ఈ ఊళ్ళ మనకింక ఏముందక్క .. ఇల్లు సర్దుకున్న, ముల్లె సర్దుకున్న ఎల్లిపోతావున్న....
  • జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి కప్పిన చేతులివి...
  • పారాణి ఆరలేదు చెల్లాలా .. అప్పుడే నూరేళ్లు నిండాయా చెల్లాలా?...

మరణం

[మార్చు]

ఇతను నవంబర్ 25, 2005 న మరణించారు.[1]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఇతను రాసిన అనేక పాటలను ఎర్రకుంకుమ పేరుతో ఆడియో క్యాసెట్లు, పుస్తకాలు, కవితలను సైరన్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. 2007 నుంచి ప్రతి ఏడాది సదాశివ స్మారక అవార్డును సాంస్కృతిక రంగంలో రాణించిన వారికీ అందజేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ మ్యాగజైన్. "పీడిత ప్రజల పక్షపాతి సదాశివుడు". magazine.telangana.gov.in. Retrieved 31 July 2017.

[1]

  1. నమస్తే తెలంగాణ 25 నవంబర్ 2016