విడియాల చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విడియాల చంద్రశేఖరరావు
జననం1930
మరణంఏప్రిల్ 17, 1985
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, నాటక, నవలా రచయిత, వ్యాసకర్త
తల్లిదండ్రులుకోటిలింగం, నాగకోటేశ్వరమ్మ

విడియాల చంద్రశేఖరరావు(1930 - ఏప్రిల్ 17, 1985) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక, నవలా రచయిత, వ్యాసకర్త.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

చంద్రశేఖరరావు 1930లో కోటిలింగం, నాగకోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణాజిల్లా డోకిపర్రు జన్మించాడు. బందరు, తెనాలి లో చదువుకున్నాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

బాల్యం నుంచి చంద్రశేఖరరావుకు సాహిత్యం, కళలు అంటే ఇష్టం ఉండేది. తెనాలిలో చదివేరోజుల్లో మాధవపెద్ది వెంకట్రామయ్య ప్రోత్సాహంతో నటనా విభాగంలో కొద్దికాలం కృషి చేశాడు. భూలోకంలో యమలోకం నాటకంలోని యముడు పాత్రతో మంచి గర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థల కళాకారుల జీవిత విశేషాలను పరిశోధించి నాటకరంగం శీర్షిక పేరుతో వివిధ పత్రికలలో వ్యాసాలు రాశాడు. చంద్రశేఖరరావు చేసిన ఈ కృషిని గుర్తించి ఆనాటి విద్యాశాఖామంత్రి మండలి వెంకటకృష్ణారావు 'వ్యాసరచనా ప్రవీణ' బిరుదునిచ్చి సత్కరించాడు. బందరు లో జీవిత బీమా ఉద్యోగ మిత్రులతో కలసి లలిత కళా సమితి అనే సంస్థను స్థాపించి పోటీలు నిర్వహించాడు. కళారంగ సేవ చేస్తున్న చంద్రశేఖరరావు ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా నియమించింది.

రచించినవి[మార్చు]

  1. వదిన
  2. ఇంటిదీపం
  3. పంగనామాలు
  4. త్రిశంకుస్వర్గం
  5. కాకారాయుళ్ళు
  6. వెండితెర (రేడియో నాటకం)
  7. మూగబమ్మ (రేడియో నాటకం)

మరణం[మార్చు]

జీవిత బీమా సంస్థలో పనిచేసిన చంద్రశేఖరరావు 1985, ఏప్రిల్ 17 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.302.