వొంగిమళ్ళ
వొంగిమళ్ళ, వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామము. వీరబల్లి మండల కేంద్రానికి ఉత్తర సరిహద్దు అయిన మాండవ్య నదికి ఉత్తర భాగము వంగిమళ్ళ గ్రామం. ఈ ప్రాంతంలో పాలకొండలు పశ్చిమానికి వంగడంవల్ల ఈ గ్రామానికి వొంగిమళ్ల అని పేరు వచ్చింది. గ్రామము పాలకొండల అడుగున గంగనవాగుకు ఎడమవైపున ఉన్నది. మాండవ్య నది వంపులు తిరిగిన గండిలో ప్రవేశించి గడికోట వైపు ప్రవహించడానికి ఒక కిలోమీటరు ముందు గంగనవాగు అందులో కలుస్తుంది. వొంగిమళ్ల రాయచోటి నుండి వీరబల్లె రోడ్డు ద్వారా 18 కిలోమీటర్ల దూరములో ఉన్నది. గ్రామములో ఒక సహకార సంఘమున్నది.
వొంగిమళ్లలో అనేక గుళ్లు ఉన్నాయి. వాటిలో ఊరికి ఉత్తరం వైపు పాలకొండల దగ్గర ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం అన్నింటికంటే పెద్దది. ఆలయం ముందున్న మంటపంలో 8 స్థంబాలపై కళాత్మకమైన విష్ణువున దేవతల విగ్రహములు చెక్కబడి ఉన్నవి. గుడి ముందు విజయనగర కాలము నాటి (శా.1466 లేదా క్రీ.శ 1544) శిలాశాసనం ఉంది.
వొంగిమళ్ల దగ్గర కుగ్రామమైన రాచపల్లెలో అరిణమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉన్నది. ఈ దేవత విగ్రహం భయంకరరూపంతో 9 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్నది. దేవత కళ్లు నారింజల పరిమాణములో, శరీరం తలలతో భీభత్సంగా ఉంది. ఇది దేవరాయల కాలం (శా.1336) నాటి ఆలయమని భావిస్తున్నారు.
[మార్చు] పల్లెలు
టెంకాయచెట్లపల్లె
దుగ్గనపల్లె
నాగిరెడ్డిగారిపల్లె
పెద్దమాదిగపల్లె
[మార్చు] మూలాలు
- Madras District Gazetteers : District Gazetteer Cuddapah By C.F. Brackenbury.
|
|
|
|---|---|
| బండ్లపల్లె (నిర్జన గ్రామము) · మాట్లి · గడికోట · ఒద్దివీడు · పెద్దివీడు · సానిపాయ · సోమవరం · వీరబల్లె · వొంగిమళ్ళ · పాలెంపలం · యడబల్లె (నిర్జన గ్రామము) · గురప్పగారి పల్లె |