Jump to content

వాడుకరి చర్చ:Bojja

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బొమ్మల పేర్లు, వాటి ఉపయోగం

[మార్చు]

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మలకు సరైన పేర్లను పెట్టండి. పేరు చదవంగానే అదేంబొమ్మ అర్థమయ్యేటట్లు పేర్లు పెట్టండి. ఇలా సంఖ్యలతో పేర్లను పెడితే ఆ బొమ్మ గురించి ఎవరికీ అర్థంకాదు. దయచేసి పేర్లను మార్చడానికి కొంత ఓపిక చేసుకోండి. బొమ్మకు 250.png అనే పేరు పెడితే అదేంటో ఎందుకుందో ఎవరికైనా అర్థమవుతుందా... ఒక సారి ఆలోచించండి. ఇక నుండి అప్లోడు చేసేముందు అర్థవంతమైన పేర్లను పెడతారని ఆశిస్తున్నాను. అలాగే మీరు సృష్తిస్తున్న వ్యాసాలలో సమాచారం కంటే ఎక్కువగా బయటి లింకులూ బొమ్మలూ ఉంటున్నాయి. విజ్ఞాన సర్వస్వం అంటే సమాచారం అంతా ఇక్కడే లభ్యమవుతుందని అర్థం. అందుకు బొమ్మలను చేర్చడం కంటే ముఖ్యమైనది విషయాన్ని గురించి తెలిపే సమగ్రమైన సమాచారం. మీరు బొమ్మలను చేర్చడం కంటే ముందు దానిపై దృష్టి పెట్టడం మంచిదని నా ఉద్దేశం, బొమ్మలు అప్పటికే ఉన్న సమాచారాన్ని మరింత విపులంగా వివరించడానికి మాత్రమే అనే సంగతి కూడా గుర్తుంచుకోండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:00, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచార

[మార్చు]

నేను ఫోటోకి పేరు మార్చకపోవటానికి కారణం, ఎగుమతి చేసిన ఫోటో దొరికిన సైట్,మూలం లో ఉన్న పేరే ఉండాలేమో అనే ఉద్దేశం.పేరు మారిస్తే అబ్యంతర పెడతారని అనుమానం.నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచారం ఇస్తుందని.ముందు అర్ధవంతమయిన చిత్రాలు కూర్చి వాటికి మరింత సమాచారం నాతో పాటు మిగతా వారు చేరుస్తారని ఒక ఆలోచన.వ్యాసం అత్యంత వివరంగా,విజ్ఞానంగా ఉండాలనే నాలుగు పేజీలుగా విభజించి వ్రాయటానికి కారణం.ముఖ్యంగా ఇది (ఫోటోషాప్) ఫోటోలు వాటి ఎడిటింగ్ గొడవ కాబట్టి ఫోటోలు ఎక్కువగా ఉంటాయి ప్రదీప్ గారు.ఉదా : ఈ సైట్ ఒక్క సారి చూడండి(http://inpics.net/tutorials/elements5/create2.html) అన్ని ఫోటోలతోనే ఫోటో షాప్ గురించి నేర్పిస్తున్నారు. రాజకీయాలు,సినిమాలు మొదలగు వాటి గురించి ఆయితే ఎంత కావాలంటే అంత వ్రాయవచ్చు.నిజంగా ఫోటోషాప్ గురించి పూర్తి వివరంగా వ్రాస్తే వంద పేజీలకు ఎక్కువ అవుతుంది కావున, మొత్తం సమయం దీని మీద వెచ్చించకుండా త్వరగా ఈ వ్యాసాన్ని ముగించి ఫోటోగ్రఫీ మీదకి వెళ్ళాలని నా ప్రయత్నం. వ్యాసం ఇంకా పూర్తి అవ్వలేదు కావున, పరవాలేదు ఈ వ్యాసం ఇంక చాలు అనుకున్నపుడు చివరిగా అవసరం లేని ఫోటోలు, లింకులు, సమాచారం వుంటే తీసివేయండి.
ఒక మంచి విషయం >>> మీరు చాల త్వరగా ప్రతిస్పందిస్తారు. ఈ సమాధానానికి మీ అభిప్రాయాని తెలుపండి.
PS:ఇక ఇప్పటి నుండి అర్ధవంత మయిన పేర్లు పెడతాను.vasu bojja 08:41, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలను ఎక్కడి నుండీ సేకరించామో తెలిపి, వాటి కాపీహక్కుల వివరాలు తెలిపితే సరిపోతుంది. ఆ తరువాత అప్లోడు చేస్తున్నప్పుడు ఏ పేరు పెట్టినా పరవాలేదు, దీని అర్థం బొమ్మను గురించి వివరించ గలిగే పేర్లు. ఇప్పుడు ఫొటోషాపు ఉదాహరణను తీసుకుందాము. మీరిచ్చిన లింకులో ఉన్న సమాచారాన్ని పరిశీలించాను. అందులో వారు చాలా బాగా వివరించారు. అయితే మనం వికీపీడియా ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుపడానికి లేదా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ ఆ విషయాన్ని నేర్పడానికి వికీపీడియా వేదిక కాదు. అంటే అప్పుడు ఫొటోషాపు అనే పేజీలో ఆ సాఫ్టువేరు ఎలా పుట్టింది, దాని చరిత్ర, అందులో వారు ఉపయోగించిన రకరకాల సాంకేతికాల గురించి పరిచయం చేయడం. ఆ సాఫ్టువేరును తయారు చేసిన అడోబీ సంస్థను పరిచయం చేయడం లాంటివి. ఫొటోషాపు పేజీలో అటువంటి వివరాలు కొంత వరకూ ఉన్నాయి, అంత వరకూ బాగానే ఉంది. కానీ వ్యాసం మిగతా భాగంలో ఫొటోషాపును ఎట్లా వాడాలో కూడా వివరించడం మొదలయ్యింది, ఇలా ఆ సాఫ్టువేరును ఎలా వాడాలో వివరించడం అనవసరం. వంద మాటలను ఒక్క బొమ్మ ద్వారా చెప్పేయవచ్చని నేను కూడా ఒప్పుకుంటాను, మరి ఈ బొమ్మను ఏ వంద మాటలకు బదులుగా చేర్చారు? నాకు తెలిసి ఇది "వెర్షను 8లో స్ప్లాషు ఫొటోషాపు స్క్రీను ఇలా ఉండేది" అనే మాటలను మాత్రమే చెబుతుంది, వేరే ఇంకేమయినా చెబుతుందా?... __మాకినేని ప్రదీపు (+/-మా) 13:49, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు నేను చేసింది ప్రతిదీ తప్పులాగా అనిపిస్తుంది. మీరు ఉదహరించిన ఫోటో ఏమి సూచిస్తుంది అని వె

[మార్చు]

మీకు నేను చేసింది ప్రతిదీ తప్పులాగా అనిపిస్తుంది.మీరు ఉదహరించిన ఫోటో ఏమి సూచిస్తుంది అని వెటకారంగా అడుగుతున్నారు? అభివృద్ది చేసినవారి పేర్లు(అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారని తెలుస్తుంది),వెర్షన్ పేరు,తయారి సంవత్సరము మొదలుకుని ప్రారంభంనుండి ఇప్పటి వరకువున్న వేర్శన్ల ఫోటోలు అన్ని ఒకచోట వరుసగా ఇస్తే ఉపయోగకరంగా వుంటుందని(ఫోటోషాప్ అభివృద్ది పరిణామ క్రమం తెలుస్తుందని) ఆలోచన.నేనేమి ఫోటోషాప్ నేర్పే పని చేయటము లేదు(నేను ఫోటోషాప్ నేర్పించాలంటే నా స్వంత సైట్ తో చేయగలను కదా!).మీరు చెప్పినట్టు చేస్తే, ఫోటోషాప్ రెండు పేరాలలో క్లుప్తంగా చెప్పవచ్చు.ఇంత శ్రమతో నాలుగు పేజీలతో వివరించాల్సిన అవసరం లేదు.నేనేమి ప్రతిఫలం ఆశించి ఇన్ని ఫోటోలు,సమాచారం,లింకులు సేకరించి ఈ వ్యాసం వ్రాయటం లేదు.మీకు నేనోదో చెత్త ప్రోగు చేసి ఈ వ్యాసాన్ని నింపుతున్నట్టుగా ఉంది.అందరకి నచ్చిన ఈ వ్యాసం మీకు ఎందుకో చిరాకు కలిగిస్తుంది.నాకు కొంచెము మనసు భాద కలిగించింది,మీ ఉత్తరం. మీ ఇష్టం,మీరు కావాలంటే ఈ వ్యాసాన్ని ఒకే పేజీకి కుదించి వేయండి.లేక నేను వ్రాసే పద్దతి బాగోలేదు అనుకుంటే (తెవికి ప్రమాణాలలో) చెబితే వ్రాయటం మానేస్తాను.నేనేమి మిమ్మల్ని తూలనాడటం లేదు. కేవలం, ఇంత శ్రమకోర్చి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఒక్కరే చిరాకుగా చూస్తుంటే బాధతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.vasu bojja 07:24, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శాంతించండి. అన్ని వ్యాసాలు ఒకే రకంగా మూస పోసినట్లుండనవుసరం లేదు. ఇదొక రకం. వాసూ! ఫొటోషాప్ వ్యాసం తెలుగు వికీలో సాధారణ ప్రమాణాలకంటే ఉన్నతంగా ఉండబట్టే అందులో ఉన్న కొద్దిపాటి లోపాలూ ప్రదీప్‌కు స్పష్టంగా కనిపించాయి. అది ఒక వ్యాఖ్యగా భావించండి. మరొక విషయం. ఇది మీ వ్యాసం గాని, మరొకరి వ్యాసం కాని కాదు. రేపు మరొకరు దీని స్వరూపాన్ని పూర్తిగా మార్చేయవచ్చును. లేదా ఇతర సబ్జెక్టులపై ఈ తరహా వ్యాసాలు ఈ వ్యాసం స్ఫూర్తితో డెవలప్ చేయనచ్చును. వేచి చూద్దాం. అన్నట్టు మీ వ్యాసం చదివినాక ఆసక్తి పెరిగి ఈ మధ్య ఫొటోషాప్ నేర్చుకోవడం మొదలు పెట్టాను! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:56, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఫొటోగ్రఫీ, వాటి అనుబంద వ్యాసాలపైచేసిన కృషిని నేను తక్కువంచనా వేయటంలేదు. మీరు కష్టపడి ఇన్నిన్ని బొమ్మలను వికీపీడియాలో ఎక్కిస్తున్నారు. వాటిలో చాలా బొమ్మలను "FAIR USE" అని చెప్పేసి అప్లోడు చేస్తున్నారు, అంటే ఆ బొమ్మలన్నిటి కాపీహక్కులు ఇంకొకరి దగ్గర ఉన్నాయి, వారు ఆ బొమ్మలను ఇతరలు ఉచితంగా వాడుకోవడానికి అనుమతించలేదని అర్థం చేసుకోవాలి. బొమ్మను తయారు చేసినవారు కాబట్టి వారి హక్కులను మనం గౌరవించాలి. ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం FAIR USE అని చెప్పేసి ఆ బొమ్మలను వాడుకోవడమంటే అలా ఆ బొమ్మలను తయారు చేసిన వారిని పరిహసించడమ్మన్నమాటే. నాకు ఈ అభిప్రాయం ఉండటం వలన FAIR USE బొమ్మలన్నిటినీ వికీపీడియా నుండీ ఎప్పుడో ఒకప్పుడు తొలగించాలని కూడా నమ్ముతుంటాను. అంటే రేపొద్దున వాటన్నిటినీ కాపీహక్కు సమస్యల వలన తొలగించాల్సి వస్తే బొమ్మల మీద ఆధారపడుతూ రాసిన చాలా సమాచారానికి అర్థంలేకుండా పోతుంది! అందుకనే బొమ్మల మీద ఆధారపడుతూ వ్యాసాలను రాసే బదులుగా వ్యాసాలను మొదటగా రాసి, ఆ తరువాత వాటికి బొమ్మలు చేరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటేనే చేర్చమని నేను చెబుతున్నాను. ఏదయినా బొమ్మను "FAIR USE"గా వాడేముందు ఆ బొమ్మ నిజంగానే అవసరమా కాదా అనే విషయాన్ని బాగా ఆలోచించాలి. చివరిగా FAIR USE అని చెప్పి బొమ్మలను ఉపయోగించడాన్ని నిరుస్తాహపరచడంలో ఇదంతా ఒక భాగమని మీరు గుర్తించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:18, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు మీరు ఫోటోషాప్ నేర్చుకున్తున్నందుకు అభినందనలు. మీ సమాధానానికి కృతజ్ఞతలు.

[మార్చు]

కాసుబాబు గారు మీరు ఫోటోషాప్ నేర్చుకున్తున్నందుకు అభినందనలు.
మీ సమాధానానికి కృతజ్ఞతలు.
నేను కోరేదికూడా అందరు తలో చేయి వేసి ఈ వ్యాసాన్ని (అలాగే మిగతావి కూడా) అభివృద్ది చేయాలని.నేను నాపేరు గురించి ఏమి ఆశించటం లేదు కాబట్టే ఇక్కడ వ్రాస్తున్నాను.ప్రదీప్ గారు క్లుప్తంగా వ్రాస్తే చాలన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు.అలాగయితే ఇంత శ్రమ ఎందుకనేది నా భాద.విజ్ఞానాత్మకంగా,వివరంగా ఉండాలంటారు అలా వ్రాస్తే(ప్రయత్నిస్తే) వంకలు పెడతారు.మరి ఈ పేజీ ఉదాహరణకి చూడండిలింకు .ఇంత వివరంగా అవసరమా అని అనుకుంటే, మరి ఈ పేజీ వ్యాసకర్తలు ఫోటోగ్రఫీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి ఇంత వివరంగా వ్రాయాల్సిన అవసరముందా!!! ఇంక వివరంగా ఫోటోగ్రఫీ పోర్టల్ అవసరముందా అంటే ఏమిచేపుతాం?నేను ఫోటోలు ఎక్కువ ఉంచడానికి కారణం ఇది ఫోటోలు వాటి ఎడిటింగ్ గురించి కావటం.vasu bojja 08:36, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా.

[మార్చు]

చర్చ ఫోటోషాప్ లో ఫోటోలు ఉంచటం గురించి(ఫొటోగ్రఫీ, వాటి అనుబంద వ్యాసాల గురించి కాదు),నేను ఎగుమతి చేసిన ఫోటోలు 95 శాతం ఇంగ్లీష్ వికీపీడియా నుంచి తీసుకుని ఎగుమతి చేసినవే.మీరు(ప్రదీప్ )ఫోటోషాప్ వ్యాసంలో ఉంచిన అర్థవంతమయిన అన్ని ఫోటోలని తొలగించి మీకు ఇష్టమయిన పద్దతిలో వ్యాసం కుదించి వేశారు.ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా. vasu bojja 13:29, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెనర్లు

[మార్చు]

వాసుగారూ మీఅభినందనలకు నెనర్లు.మీ అభినందన నన్ను నాపనిలో ఉత్సాహంగా ముందుకు సాగేలా చేస్తుంది.ఉద్యానవనాలు అని వ్రాయాలనే ఉంటుంది మరీ గ్రాంధికం అనుకుంటారని అలా వ్రాస్తుంటాను.మీరు కూడా వ్యాసాలు అందించండి మేమంతా చదువుకుంటాము.
--t.sujatha 10:14, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

[మార్చు]

వాసూ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అభిమానానికి

[మార్చు]

వాసుగారూ అభిమానానికి కృతజ్ఞతలు. --t.sujatha 14:46, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:35, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రఘు ఫోటో

[మార్చు]

రఘు ఫోటో మరోటి సంపాదించినందుకు అభినందలు. సదుపాయానికి కూడా అది ఎక్కడినుండి తెచ్చారు, దాని కాపీహక్కులు ఎవరికి ఉన్నాయి అన్న విషయం తెలియజేయజేస్తూ {{Non-free fair use in}} మూస తగిలించాలి. --వైజాసత్య 21:22, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)

[మార్చు]

నేను రఘు గారి ఫోటో(http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html) నుండి సేకరించాను. మీరు తెలియపరచినట్టు నేను సోర్సు ఇవ్వటం మరచినట్టు ఉన్నాను.తెలియ పరచినందుకు కృతజ్ఞతలు. నాకు అర్థం కాని విషయం రఘు గారి వ్యక్తిగత విషయాలు (ఎవరి ద్వారా వి.ఎస్.ఆర్ స్వామి గారి దగ్గర చేరింది) ఎలా తెలుసుకున్నారు.తెవికి లో మీ కృషి చూస్తుంటే మీ కింత ఓపికా,శక్తి ఎలా వొచ్చాయో అని ఆచర్య మేస్తుంది.మీ కృషి కి అభినందనలు. నేను ఎం.వి.రఘు గారి దగ్గర పనిచేశాను.ఆయన అవార్డ్ ఫోటోలు,వర్కింగ్ స్టిల్ల్స్,కామేరామన్ గా చేసిన సినిమాల వివరాలు వ్యక్తీ గతంగా సేకరించి అప్లోడ్ చేస్తే సోర్సు ఎలా ఇవ్వాలో సందేహం.తీర్చగలరు. వ్యక్తిగతంగా సేకరించాను అని తెలిపితే వుంచుతారా?! లేక కాపీ హక్కుల గొడవ కారణముతో తీసేస్తార!? కొందరు ఘనులు వున్నారు తెసేసేదానికి.అందుకే సందేహం వాసు. bojja 13:42, 2 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు పైన ఇచ్చిన లింకులోని ఇంటర్యూలో రఘుగారు స్వయంగా చిత్రరంగములో ఎలా ప్రవేశించారో చెప్పారు. నేను అదే చేర్చాను తప్ప నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు. మీరు రఘుగారు స్వయంగా తెలుసుకాబట్టి స్వయంగా సంపాదించిన ఫోటోలు పెడితే సదుపయోగం ద్వారా తెచ్చుకున్నవి తీసెయ్యవచ్చు. మూలాలని నమ్మశక్యం కానీ విషయాలకు, వివాదాస్పదమైన విషయాలకు మరీ గుచ్చి అడుగుతారు. కానీ మీరు రఘుగారి గురించి వ్రాసే మామూలు సమాచారానికి అంత ఖచ్చితంగా మూలాలు అక్కర్లేదు కానీ మీరు వ్రాసిన వాటికి వీలైతే వాటిని బలపరుస్తూ ఎక్కడైనా తర్వాత సమాచారం కనిపిస్తే దాన్నే మూలంగా ఉదహరించవచ్చు. ఫోటోలకు ఎలాగు వ్యక్తిగతంగా సేకరించినట్టు అప్లోడ్ చేస్తారు. సమాచారానికి అలా వ్రాయవలసిన అవసరం లేదు. సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి. --వైజాసత్య 00:31, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చాల వివరంగా సమాధాన మిచ్చినందుకు మరొక్క సారి ధన్యవాదాలు :-)

[మార్చు]

చాల వివరంగా సమాధాన మిచ్చినందుకు మరొక్క సారి ధన్యవాదాలు ! వాసు. bojja 06:33, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమాచారపెట్టె వ్యక్తి మూసలో wife=పద్మావతి అని ఇస్తే ఎందుకు క

[మార్చు]

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమాచారపెట్టె వ్యక్తి మూసలో wife=పద్మావతి అని ఇస్తే ఎందుకు కనిపించటం లేదు???
ఇదే సమస్య చాల వ్యాసాలలో జరిగింది.
ఉద:ఎం.వి.రఘు కూడా!!!
ఎవరయినా సరిదిద్దగలరు.
ధన్యవాదాలు.వాసు. bojja 13:37, 11 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

wife బదులు spouse అని ఉండాలి. మూస:సమాచారపెట్టె వ్యక్తి చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:12, 11 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)

[మార్చు]

సందేహం నివృత్తి చేసినందుకు, సరిదిద్దినందుకు కాసుబాబు గారికి కృతజ్ఞతలు. పనుల వొత్తిడి వల్ల కాస్త ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి:( వాసు. bojja 06:32, 13 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల మూస

[మార్చు]

బొజ్జా గారు మూస:మల్టీమీడియా సభ్యుడు నచ్చితే మీ సభ్యపేజీలో వాడుకోండి. δευ దేవా 10:02, 21 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారికి కృతజ్ఞతలు :)

[మార్చు]

మీ సూచన ఉపయోగకరంగా వుంది.తప్పక వాడుకుంటాను.
కృతజ్ఞతలు :)
వాసు. bojja 10:38, 21 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు మెడల్

[మార్చు]
తెలుగు మెడల్
దాదాపు 1500 మార్పులు చేసి, తెలుగు వికీపీడియాకు మల్టీమీడియా వ్యాసాలను పరిచయం చేసిన వీరికి ఈ మెడల్ సముచితం.δευ దేవా 09:31, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారికి కృతజ్ఞతలు :)

[మార్చు]

దేవా గారికి కృతజ్ఞతలు :)వాసు. bojja 10:10, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

న్యూయార్క్

[మార్చు]

ఇతర భాషా లింకులు

[మార్చు]

బొజ్జా గారు! మీరు కొన్ని సందర్భాలలో ఆంగ్ల వికీ లింకు వ్యాసాలలో చేరుస్తున్నారు. మీరు చేర్చే విధానం కంటే సులువైన ఇంకో విధానం వికీలో ఉంది. ఇతర భాషలకు లింకుల చిట్కాను చూడండి. మీకు తెలవదేమోనని చెపుతున్నాను, తెలిస్తే ఇగ్నోర్ చెయ్యండి. δευ దేవా 05:56, 20 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Fair Use బొమ్మలు

[మార్చు]

వాసుగారూ! (1) Fair Use బొమ్మలు కంటే, వీలయినంతలో, ఉచిత లైసెన్సు బొమ్మలు వాడడం మంచిది. ఉదాహరణకు మహర్షి మహేష్ యోగి కి కామన్స్‌లో Image:MaharishiMaheshYogi-04.jpg అనే GFDL బొమ్ముంది. అలాంటప్పుడు మరొక "non-free fair use" బొమ్మ, షుమారు అలాంటిదే, అప్‌లోడ్ చేయడం అనవుసరం (2) మీ చర్చా పేజీ బాగా పొడవయ్యింది. పాత చర్చలు నిక్షిప్తం చేయండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:15, 21 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సుజాత గారు అభినందనలు !!!

[మార్చు]

సుజాత గారు, మీరు వ్రాసిన, చేసినదానితో పోల్చుకుంటే నా వంతు .%, మీరు చాల చక్కగా న్యూయార్క్ వ్యాసం వ్రాసినందుకు అభినందనలు !!! వాసు. bojja 13:28, 21 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారు కృతజ్ఞతలు :)

[మార్చు]

దేవా గారు మీ సూచన ఉపయోగకరంగా వుంది. కృతజ్ఞతలు వాసు. bojja 13:31, 21 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబు గారు మీ సూచన విలువయినది, కృతజ్ఞతలు :)

[మార్చు]

కాసుబాబు గారు మీ సూచన విలువయినది.నేను కామన్స్లో వెతకకపొవటము నా తప్పే.ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త వహిస్తాను. కృతజ్ఞతలు :)వాసు. bojja 13:33, 21 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

స్వామీ వివేకానంద

[మార్చు]

వాసు గారూ! స్వామీ వివేకానంద వ్యాసం కోసం ఫోటో ఒకటి సంపాదించి వ్యాసంలో చేర్చగలరా? రవిచంద్ర(చర్చ) 04:24, 1 ఆగష్టు 2008 (UTC)

బొమ్మ సారాంశం

[మార్చు]

వాసు గారూ! బొమ్మ:Mv Raghu chiru.jpg లో "Telugu Film Personalities - (L to R) Hari Prasad , M V Raghu, Chiranjeevi, Subhaleka Sudhakar" అని వ్రాశాను. కరక్టేనా? ఒక మారు చూడండి. దీనిని {{ఈ వారం బొమ్మ పరిగణన}} లో పెట్టాను గనుక ఈ వివరాలు ఉంటే బాగుంటుంది. మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మలకు వ్యాఖ్యలు ఆంగ్లంలో కూడా (తెలుగుకు అదనంగా) వ్రాయడం మంచిది. ఎందుకంటే ఇవి ఇతర వికీలలో వాడే అవకాశం ఉంది. కామన్స్‌కు ఎవరైనా అప్‌లోడ్ చేయవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:14, 1 ఆగష్టు 2008 (UTC)

శుభలేఖ సుధాకర్ కాదండి, సుధాకర్ మాత్రమే ! మీ సూచన పాటిస్తాను :)

[మార్చు]
శుభలేఖ సుధాకర్ కాదండి, సుధాకర్ మాత్రమే. శుభలేఖ సుధాకర్ అంటే శుభలేఖ సినిమాలో నటించిన సన్నగా ఉన్న వ్యక్తి(ఈయన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు సైలజ ని పెళ్ళాడిన వ్యక్తి). మీరు సూచించిన ఫోటోకి మరిన్ని వివరాలు జోడించాను. వాసు. bojja 12:28, 1 ఆగష్టు 2008 (UTC)
(1) అవును. పొరపాటుగా వ్రాశాను. (2) వివేకానంద స్వామి ఫొటోలు కామన్స్‌లోంచి వ్యాసానికి జత చేశాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:02, 1 ఆగష్టు 2008 (UTC)

రవిచంద్ర గారు తప్పకుండా ప్రయత్నిస్తాను  :)

[మార్చు]
రవిచంద్ర గారు తప్పకుండా ప్రయత్నిస్తాను వాసు. bojja 12:31, 1 ఆగష్టు 2008 (UTC)

నకలుహక్కుల వుల్లంఘన?

[మార్చు]
[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as దస్త్రం:Chiru padmabusan award receiving.jpg, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://im.sify.com/entertainment/movies/images/dec2007/1632.jpg, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at [[[:మూస:Fullurl:Talk:దస్త్రం:Chiru padmabusan award receiving.jpg/Temp]] this temporary page]. Leave a note at [[Talk:దస్త్రం:Chiru padmabusan award receiving.jpg]] saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! ..--అర్జున 11:17, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as దస్త్రం:Chiru Doctorate receiving AU.jpg, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2006110708900100.htm&date=2006/11/07/&prd=th&, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at [[[:మూస:Fullurl:Talk:దస్త్రం:Chiru Doctorate receiving AU.jpg/Temp]] this temporary page]. Leave a note at [[Talk:దస్త్రం:Chiru Doctorate receiving AU.jpg]] saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున 11:27, 5 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:29, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:01, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

వాసూ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:40, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
బొజ్జా వాసు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో ఫొటోగ్రఫీకి సంబంధించిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి

[మార్చు]

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా vasu bojja గారి కీ నా మనవి.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@వాడుకరి:Bojja గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

Bojja 20080307 File:Burn.gif
Bojja 20080303 File:Gnome-applications-utilities.png
Bojja 20080221 File:ASC_manual_9th_edition.jpg
Bojja 20080221 File:Reflections_book.jpg
Bojja 20080221 File:Gimp_side_by_side_apple_aperture_on_Mac_osx.jpg
Bojja 20080221 File:Professinal_cinematography.jpg
Bojja 20080221 File:Cinemaworkshop.jpg
Bojja 20080221 File:Image_control.jpg
Bojja 20080221 File:Gimp_windows_screenshot.jpg
Bojja 20080221 File:Linux_fullscreen.jpg
Bojja 20080221 File:Student_cinimatographer.jpg
Bojja 20080220 File:Arri_logo.gif
Bojja 20080220 File:Arricamst.jpg
Bojja 20080216 File:100px-Crystal_Clear_app_mouse.png

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:27, 12 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@Bojja గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@Bojja గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:54, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]