హుజూర్‌నగర్

వికీపీడియా నుండి
  ?హుజూర్‌నగర్ మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటములో హుజూర్‌నగర్ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో హుజూర్‌నగర్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°54′N 79°52′E / 16.895558, 79.872623
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము హుజూర్‌నగర్
జిల్లా(లు) నల్గొండ
గ్రామాలు 7
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
57,430 (2001)
• 29250
• 28170
• 61.90
• 72.91
• 50.50


హుజూర్‌నగర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. హుజూర్ నగర్‌కు పూర్వము పోచంచర్ల అనే పేరు ఉండేది. హుజూర్ అనే నవాబు దీన్ని పాలించడంవల్ల హూజూర్ నగర్ అని పేరు వచ్చింది. 1977 వరకు హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గముగా ఉండేది. అయితే 1977 నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని రద్దుచేశారు. కానీ తిరిగి 2007లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని 2009లో శాసనసభా ఎన్నికలకు పునరుద్ధరించారు.

హుజూర్ నగర్లో రామాలయము, ముత్యాలమ్మ గుడి, దుర్గ గుడి, షిర్డీ సాయిబాబా గుడి ఉన్నవి. పట్టణములో ప్రతి సంవత్సరమూ నిర్వహించే ముత్యాలమ్మ జాతర ప్రసిద్ధి చెందినది. హుజూర్ నగర్ సీతారామచంద్రస్వామి ఆలయము 900 సంవత్సరాల పురాతనమైనది. జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవలే కొందరు స్థానిక దాతల సహాయముతో పునరుద్ధరించారు.

హుజూర్ నగర్ పట్టణములో అనేక బియ్యపు మిల్లులున్నవి. పట్టణము చుట్టూ ప్రియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, నాగార్జునా సిమెంట్స్, అంజనీ సిమెంట్స్, మహా సిమెంట్స్, సువర్ణా సిమెంట్స్ మరియు కామాక్షీ సిమెంట్స్ అనేక చిన్నా పెద్ద సిమెంటు పరిశ్రమలు ఉన్నవి. పట్టణములో రెండు జాతీయ బ్యాంకులు : ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు మరియు ఒక సహకార కేంద్రీయ బ్యాంకు మరియు గ్రామీణ బ్యాంకు ఉన్నవి.

హూజూర్ నగరులో రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నవి. ఇవికాక రెండు ప్రైవేట్ కళాశాలలు (ప్రియదర్శిని కళాశాల మరియు చైతన్య కళాశాల) ఉన్నవి.

హుజూర్ నగరుకు రైలు సౌకర్యము లేదు. సమీప రైల్వే స్టేషను 33 కిలోమీటర్ల దూరములో మిర్యాలగూడలో ఉన్నది. హుజూర్ నగరుకు బస్సులో చేరుకొనవచ్చు.

మండలంలోని గ్రామాలు [మార్చు]


Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


near to huzurnagar, one Engineering college is held, namely, Madhira Institute of Technology and Sciences. The college is offering Engineering, B.Pharmacy, M.C.A and M.B.A courses.

Mr. E. ANIL KUMAR M.Com, M.B.A, native of Huzurnagar