Jump to content

అందరి బంధువయ (పుస్తకం)

వికీపీడియా నుండి
అందరి బంధువయ
కృతికర్త: బి.వి. నరసింహారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సాహితీ సర్వస్వం
ప్రచురణ: దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్
విడుదల: 2013

అందరి బంధువయ పుస్తకం బాల సాహిత్యకారుడు బి.వి.నరసింహారావు సాహిత్య సర్వస్వం. ఆత్మకథ, కథలు, గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు, లేఖలు వంటి వివిధ ప్రక్రియల్లో ఆయన వెలువరించిన సాహిత్యమంతటినీ మూడు సంపుటాలుగా వెలువరించారు.

రచన నేపథ్యం

[మార్చు]

బాలసాహిత్యకారుడు బి.వి.నరసింహారావు వివిధ కథలు, గేయాలు, గేయనాటికలు, ఆత్మకథ, వ్యాసాలు, లేఖలు(చలానికి) వంటి ప్రక్రియల్లో సాహిత్యాన్ని సృష్టించారు. ఆ క్రమంలో తెలుగులో బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకు ఆయనను బాల బంధుగా గౌరవించారు. ఆయన శతజయంతి సందర్భంగా దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ సాహిత్యాన్ని అందరి బంధువయగా ప్రచురించారు. 1948లో తొలి రచన ప్రారంభించిన బి.వి.నరసింహారావు తాను 1994లో మరణించేవరకూ సాహిత్యసృష్టి చేస్తూనే వున్నారు.[1]

ఇతివృత్తాలు

[మార్చు]

అందరి బంధువయలో బి.వి.నరసింహారావు సమగ్ర సాహిత్యం ప్రచురించారు. దాదాపుగా ఆయన సాహిత్యం చాలావరకూ బాలల సాహిత్యమై ఉండగా, చలం లేఖలు, ఆత్మకథ వంటివి కూడా బాలల సాహిత్యాన్ని గురించే ఉంటాయి. ఉపాధ్యాయునిగా, విద్యాశాఖ అధికారిగా, నాట్యకారునిగా, సాహిత్యవేత్తగా పొందిన అనుభవాన్ని బాలలతో పంచుకోవాలని చేసిన ప్రయత్నాలే ఆయన సాహిత్యంలో కనిపిస్తాయి. పద విపంచి, ఆంధ్రపదావళి వంటి భాషా క్రీడలు, ఆధునిక యక్షప్రశ్నలు వంటి వైవిధ్యభరితమైన ప్రక్రియలతో పాటుగా కథలు, గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో బాలసాహిత్యాన్ని సృష్టిచేశారు. తన అనుభవాలను, సాహిత్యం పట్ల తన అభిప్రాయాలను ఆత్మకథ, లేఖలు వంటి ప్రక్రియల్లో వెల్లడించారు.[2]

ఉదాహరణలు

[మార్చు]
  • తప్పట్లోయ్ తాళాలోయ్ దేవుని గుళ్ళో బాజాలోయ్[3]
  • పిల్లలకే అల్లరి తెలుసు, పిల్లలదే మల్లెల మనసు[4]

మూలాలు

[మార్చు]
  1. అందరి బంధువయ:బి.వి.నరసింహారావు:దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ ప్రచురణ
  2. అందరి బంధువయ(సమీక్ష):కె.భావనాగమ్మ:తెలుగు వెలుగు:అక్టోబర్ 2013:పేజీ.94
  3. అందరి బంధువయ:బి.వి.నరసింహారావు:రెండవ సంపుటం:పేజీ.113
  4. అందరి బంధువయ:బి.వి.నరసింహారావు:రెండవ సంపుటం:పేజీ.91