Coordinates: 16°01′54″N 79°36′15″E / 16.031748°N 79.604071°E / 16.031748; 79.604071

అందుగులపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందుగులపాడు
—  రెవెన్యూ గ్రామం  —
అందుగులపాడు is located in Andhra Pradesh
అందుగులపాడు
అందుగులపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°01′54″N 79°36′15″E / 16.031748°N 79.604071°E / 16.031748; 79.604071
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం వినుకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,878
 - పురుషులు 1,436
 - స్త్రీలు 1,442
 - గృహాల సంఖ్య 719
పిన్ కోడ్ 522647
ఎస్.టి.డి కోడ్ 08646

అందుగులపాడు పల్నాడు జిల్లా, వినుకొండ మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన వినుకొండ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 719 ఇళ్లతో, 2878 జనాభాతో 1749 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1436, ఆడవారి సంఖ్య 1442. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 399 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 56. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590072.[1]

చరిత్ర[మార్చు]

పూర్వం ఈ గ్రామం ఇప్పుడున్న చోట వుండేది కాదు. ఇప్పుడు గుండ్లకమ్మ నది వడ్డున ఉంది. కానీ పూర్వం ఇది ఇప్పుడున్న చోటునుండి ఒక కిలోమీటరు దూరాన ఉత్తరంగా వున్న నాయునిపాలెం అనే గ్రామం ఉన్న చోట వుండేది. నాయినిపాలెం ఇప్పుడు పంటపొలంగా మారిపోయింది. అక్కడి నుండి గ్రామ ప్రజలంతా ఇప్పుడున్న చోటుకి వచ్చేయడంతో ఆ ప్రదేశం జనాభా నివసించని ప్రదేశంగా మిగిలిపోయింది.దానికి కారణం నీటి వసతి లేకపోవటం అయ్యివుండొచ్చు.ఎందుకంటే నాయిని పాలెం పొలం దగ్గర ఊరు వున్నపుడు అక్కడ ఒక వాగు వుండేది. అదే అక్కడి ప్రజలకు జీవనాదారం. అది ఇపుడు వుంది కానీ, అంతగా పెద్దదికాదు. సంవత్సరమంతా ఆ వాగులో నీల్లు ప్రవహించవు. అందుకే గ్రామం అక్కడి నుండి ఇప్పుడున్న చోటుకి వచ్చి వుండి ఉండవచ్చు.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

1377-1404 తిప్పన అను మహా వీరుడు ఒకరు హరి హర రాయలు దగ్గర భాండాగారాధ్యక్షుడుగాఉన్నాడు, అదిమాత్రమేకాక అతను అప్పటి వినుకొండ దుర్గాధ్యక్షుడుకూడా. ఇతను సత్యవ్రతుడు, సత్కీర్తి వడసినవాడు., వీధి భాగవతము, పురాణఇతిహాసముల పారాయనమును ఎంతగానో ఇష్టపడేవాడు. ప్రజలకు ఇతిహాసములను పారాయణము చేయు అట్టి కళాకారులను ఎంతగానో ప్రోత్సహించాడుకూడాను. అలా ఊరూరా తిరిగి పురాణ ఇతిహాసములను పారాయణము చేయు ఒక బృందము ఈ తిప్పనను వారి కళానైపుణ్యముతో ఎంతగానో ఆకట్టుకునింది. వారి కళా నైపుణ్యముతో తనను ఎంతగానో ఆకట్టుకున్న అట్టి బృందము ఎప్పుడు తన పక్కనే ఉండదలచిన తిప్పన తాను దుర్గాధ్యక్షునిగా ఉన్న వినుకొండ పట్టణమునకు ఆ బృందమును ఆహ్వానించాడు. ఆ బృందమును పురాణ ఇతిహాసాలను పారాయనము చేయుటకు ఊరూరూ తిరగక ఈ వినుకొండ దుర్గమునకు చేరువలో ఉండి తనను ఆనందింపచేయవలసినదిగా కోరాడు. అందుకు ఆ బృందం సరే అనడంతో వినుకొండ పట్టణమునకు చేరువలో ఉన్న నాయినిపాలెం వద్ద గల వేలాది ఎకరాల బంజరు భూములను వారి మనుగడకోసం రాసిఇచ్జినాడు. అచటనే వారు నివసించుకుటకు గృహములను ఇచ్చాడు. ఆ తరువాత ఆ వేలాది ఎకరాల బంజరు భూములను సాగుచేయుటకు ఎందరో రైతులను కూలీలను నిమించుకున్నారు వారు . దాంతో అప్పటివరకు బంజరు భూమిగా ఉన్న నాయినిపాలెం కొద్దిపాటి రైతు కుటుంబాల ఇళ్లతో నివాసయోగ్యమైన ప్రాంతముగా మారిపోయింది. అలా వారికి లభించిన ఆ భూములను సాగుచేయుటకు ముందుగా నియమించిన రైతుకుటుంబాలు సూరాబత్తిని అనే ఇంటిపేరు గలవారని చెప్పుకుంటుంటారు. కాల క్రమేణా కొద్దిపాటి రైతుకుటుంబాలతో అచట ఒక చిన్న గూడెం ఏర్పాటయింది. అదే ఇప్పటి అందుగులపాడు.

ఆ బృందము ఇతిహాసపారాయణం చేయుటకు అందెలు కట్టుకుని ఊరూరూ ఊరేగడంవలనో లేక అందెలు కట్టుకుని ఎగిరేవారు కావడమువలనోతెలియధుగాని ఆ బృందాన్ని అందేగుల వారు అని పిలడం జరిగింది. వారు నివసించిన ఆ ప్రాంతాన్ని అందేగులవారిపాడుగా పిలువబడింది. కాల క్రమేణా ఆ పేరు అందేగులవారిపాడు కాస్త అందేగులపాడుగా, అందుగులపాడుగా మారింది. ఈ విధముగా గ్రామానికి అందుగులపాడు అనే పేరు వచ్చి ఉండొచ్చు అని అక్కడివారి నమ్మకం.

పూర్వం ఇది వున్నచోట దీన్ని అందుగులపాడు అని పిలిచే వాళ్ళు. పూర్వకాలంలో ఈ గ్రామంలో అందుగులపాటి అనే ఇంటిపేరుగల బ్రాహ్మణులు వుండేవారు. (ప్రస్తుతం ఇప్పటికి వున్నారు) వారి ఇంటిపేరు మీదుగా ఆ గ్రామానికి అందుగులపాడు అని పేరు వచ్చింది. కాలక్రమేణా అక్కడున్న కొందరు ప్రజలు అక్కడినుండి దక్షిణంగా ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గుండ్లకమ్మ నది ఒడ్డున నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పడిన కొద్దిపాటి ఇళ్లతోనే ఒక చిన్న ఊరు అయింది. అది కొత్తగా ఏర్పాటు అయినందు వలన దాన్ని కొత్తపాలెం అన్నారు. తరువాత పరిస్థితుల వలన (అంటే కొత్తగా ఏర్పడిన చోట నీటివసతి బాగా వుండటం వలన) అక్కడినుండి అందరు ఈ కొత్తగా ఏర్పడిన చోటుకి వచ్చేసారు. దాంతో అక్కడ ఊరు కనుమరుగై పోయింది. ఇక్కడ ఊరు బాగా అభివృద్ధి చెందింది.ఆవిధంగా అందుగులపాడు గ్రామం కొత్తపాలెంగా వాడుకలోకి వచ్చింది.

నాయునిపాలెంలో వున్న అందుగులపాడు నుండి కొత్తగా ఏర్పడి ఇప్పడున్న కొత్తపాలెంనకు ముందుగా వచ్చింది సూరాబత్తిని అనే ఇంటిపేరు గలవాల్లని అంటుంటారు. ఆ తరువాతే మిగిలిన గ్రామస్తులందరూ వచ్చి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని వుంటారు అని అంటారు అక్కడి వాళ్లు. అది నిజం కాకపోలేదు. ఎందుకంటే గ్రామంలో సురాబత్తినవారి ఇల్లే నదికి దగ్గరగా వుంటాయి, ఆ తరువాతే మిగిలిన వారి కుటుంబాల వారి ఇండ్లు వుంటాయి.

సమీప గ్రామాలు[మార్చు]

శివాపురం 5 కి.మీ, కొప్పుకొండ 6 కి.మీ, చింతలచెరువు 7 కి.మీ, మూర్తజాపురం 7 కి.మీ, ఐనవోలు 9 కి.మీ

గ్రామ పంచాయితీ[మార్చు]

2013 ఆగష్టు 8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చల్లా పద్మ, 8 2 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది.

విద్య[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి వినుకొండలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వినుకొండలోను, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు వినుకొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వినుకొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

అందుగులపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార సౌకర్యం[మార్చు]

అందుగులపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఎస్.బి.ఐ.వ్యాసార లావాదేవీలు మినీ బ్రాంచి ఉంది.

ఆరోగ్యం, పోషణ,[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

వినోద సౌకర్యాలు[మార్చు]

సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

అందుగులపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 325 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 569 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 36 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 121 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 141 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 38 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 54 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 463 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 188 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 329 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

అందుగులపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 101 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 97 హెక్టార్లు
  • చెరువులు: 2 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 129 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

అందుగులపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మిరప

ఆలయాలు[మార్చు]

పాతపాటి పోలేరమ్మ దేవాలయం: ఇక వూరికి తూర్పున పాతపాటి పోలేరమ్మ దేవాలయం ఉంది. అది ఆ మండలంలోనే చాల ప్రఖ్యాతి చెందినది. ప్రతి సంత్సరం మే నెల చివరివారంలో అమ్మవారికి జరిపే తిరుణాల చాల అద్భుతంగా వుంటుంది. వేలాదిగా భక్తులు వస్తారు. సూరాబత్తిని అనే ఇంటిపీరుగల వాళ్ళు ముందుగ 15 రోజులు ముందు అమ్మవారికి పూజలు జరిపి జాతర ప్రారంబిస్తారు. అలా నెలరోజులపాటు జరిగే ఈ జాతర ఆ గ్రామంలో వున్న దుష్ట శక్తులని తొలగించి వారికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందని అక్కడివాళ్ల నమ్మకం. అందుకోసం అక్కడివాళ్లు అమ్మవారికి మేకలను, గొర్రెలను కోళ్ళను బలిస్తారు. పూర్వం అతీత శక్తులు కోసం నరబలులు కుడా ఇచ్చేవారని కాలక్రమేనా మానవుడు నాగరికతకు అలవడటంతో వాటిని ఆపుచేసారని చెప్తుంటారు. ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో జరిగే అమ్మవారి జాతర అక్కడి ప్రజలు చాల ఘనంగా జరుపుకుంటారు. విద్యుత్ దీపకాంతులతో వెలిగే పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే ప్రభలను కట్టి, అప్సరసలతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.

పురాతన శివాలయం: అక్కడ ఒక శివాలయం ఉంది. అది చాల పురాతనమయినది. పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టి వుంటుంది. గుడి చిన్నదే అయినా చాల ఏళ్ళనాటిది అవడం వలన చాల బావుంటుంది.ఆ పక్కనే ఒక కోనేరు కూడా వుండేదట,కాని అది కాల క్రమేణా కనుమరుగయి పోయింది. అక్కడున్న వాగులో నీరు పూర్తిగా ఇంకిపోతే కనపడుతుందని అక్కడ నివసించిన పెద్దవారు చెప్పుతుంటారు.

పండుగలు ఉత్సవాలు[మార్చు]

అంతే కాదు, ఉగాది, శ్రీరామ నవమి, దీపావళి, దసరా, సంక్రాంతి వంటి ఎన్నో పండుగలను వీరు ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి వీరి ప్రదాన పండుగ, ఆరోజు ఎన్నో ఎళ్ళ క్రితం ఆ వుారి మద్య నిర్మించిన రామాలయంలో నుండి సీత రామ లక్ష్మణ, హనుమంత విగ్రహాలను బయటికి తీసుకుని వచ్చి అందరు గ్రామస్తుల మద్య ఒక మండపంలో వివాహ మహోత్సవం ఏర్పాటు చేసి సీతారామకళ్యాణం జరుపుతారు.

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 2735, పురుషుల సంఖ్య 1383, మహిళలు 1352, నివాసగృహాలు 619, విస్తీర్ణం 1749 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".