అక్షాంశ రేఖాంశాలు: 15°33′43.200″N 78°56′31.200″E / 15.56200000°N 78.94200000°E / 15.56200000; 78.94200000

ఆకవీడు

వికీపీడియా నుండి
(అకవీడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆకవీడు
పటం
ఆకవీడు is located in ఆంధ్రప్రదేశ్
ఆకవీడు
ఆకవీడు
అక్షాంశ రేఖాంశాలు: 15°33′43.200″N 78°56′31.200″E / 15.56200000°N 78.94200000°E / 15.56200000; 78.94200000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
విస్తీర్ణం42.88 కి.మీ2 (16.56 చ. మై)
జనాభా
 (2011)[1]
5,744
 • జనసాంద్రత130/కి.మీ2 (350/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,917
 • స్త్రీలు2,827
 • లింగ నిష్పత్తి969
 • నివాసాలు1,443
ప్రాంతపు కోడ్+91 ( 08406 Edit this on Wikidata )
పిన్‌కోడ్523372
2011 జనగణన కోడ్591167


ఆకవీడు ప్రకాశం జిల్లా, రాచర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాచర్ల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1443 ఇళ్లతో, 5744 జనాభాతో 4288 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2917, ఆడవారి సంఖ్య 2827. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 852 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 168. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591167[2].

పేరువెనుక చరిత్ర

[మార్చు]

పూర్వము పెద్దవీడుకు చెందిన పెద్దినేయ అనే ఒక పశువులకాపరి పెద్దినేపాడు అనే గ్రామాన్ని స్థాపించాడు. అతనికి ఆకెమ్మ అనే సోదరి ఉండేది. ఆమె వేరొక స్థలములో నివాసము ఏర్పరచుకొనగా అక్కడ ఆకెవీడు అను పేరుతో ఒక గ్రామం అభివృద్ధి చెందినదని ఆకవీడు కైఫియతు గ్రామస్థాపన గురించి చెబుతున్నది.

సమీప గ్రామాలు

[మార్చు]

ఆరవీటికోట 2 కి మీ, కొత్తూరు 2 కి మీ, చిన్నగానిపల్లి 5 కి.మీ, అక్కపల్లి 6 కి.మీ, బొగోలు 8 కి.మీ, తురిమెళ్ళ 9 కి.మీ, యర్రబాలెం 10 కి.మీ.

మౌలిక వసతులు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రంథాలయం

[మార్చు]

ఈ గ్రామంలో ఒక శాఖా గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయానికి గ్రామస్థులైన సూరా రామకృష్ణారెడ్డి, విద్యుత్తు సౌకర్యం కలుగజేసినారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సూరా రామలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల తురిమెళ్ళలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గిద్దలూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నంద్యాలలోను, పాలీటెక్నిక్‌ గిద్దలూరులోను, మేనేజిమెంటు కళాశాల కంభంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గిద్దలూరులోను, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  • ఈ పాఠశాల విద్యార్థులు గత ఆరు సంవత్సరాలుగా బ్యాడ్ మింటన్, సీనియర్, జూనియర్ విభాగాలలో విజేతలుగా నిలుచుచున్నారు. ఇటీవల అల్లీనగర్ లో జరిగిన గిద్దలూరు జోనల్ పోటీలలో సీనియర్, జూనియర్ విభాగాలలో విజయం సాధించి షీల్డ్ సాధించారు.
  • ఈ పాఠశాలలో ఇటీవల స్వచ్ఛభారత్ పథకం స్ఫూర్తితో, 4 లక్షల రూపాయల వ్యయంతో, హెచ్.పి.సి.సంస్థ నిర్మించిన 2 మరుగుదొడ్లను, 2015, సెప్టెంబరు-12వ తేదీనాడు, పాఠశాలకు అప్పగించారు.
  • 2017, మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో, ఈ పాఠశాల విద్యార్థి ఎస్.రాజేశ్వరరెడ్డి, పదికి పది గ్రేడ్ మార్కులు సాధించాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గోకర్ణ మహాబలేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో 2015, మార్చి-4వ తేదీ, బుధవారం నాడు, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ నిర్వహించారు. శంకుప్రతిష్ఠ చేసి నవధాన్యాలు వేసి, భూమిపూజ నిర్వహించారు. పర్చుచూరి నాగేశ్వరరావు దంపతులు, విగ్రహ దాతలు.

శ్రీ కనక సురభేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ అభయంజనేయస్వామి ఆలయం - గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాలు, 2014, జూన్-19, గురువారం నాడు ప్రారంభమైనవి. ఆ రోజున గణపతి పూజ, దీక్షాహొమం, అఖండ దీపస్థాపన, అభిషేకాలు, జలాధివాసం మొదలగు పూజలు నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు, విగ్రహాలకు విశేషపూజలు నిర్వహించారు. వేదపండితులు యంత్రాలకు రుద్రాభిషేకం, నవగ్రహ వాస్తుహోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 21వ తేదీ, శనివారం నాడు, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గణపతి, గోమాతల విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు మహాస్నపనం, పంచామృతాభిషేకం, యంత్రరాజులకు విశేషపూజలు నిర్వహించి, అనంతరం, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి, అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టినారు.

శ్రీ రంగయ్యస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో వార్షిక జెండా ఉత్సవం 2017, ఫిబ్రవరి-19,20 తేదీలలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమారం ఉదయం గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి జెండాకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జండా వద్ద ఈ గ్రామవాస్లులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలయిన జి.కొత్తపల్లి, అనుములపల్లి మొదలగు గ్రామనుండి నుండి గూడా వచ్చిన భక్తులు జండా వద్ద విశేషపూజలు నిర్వహించారు. ఈ ఉత్స్వాన్ని పురస్కరించ్కుని, దాతల పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భజనలు, కోలాటాలు, గుండు పందెం, చిన్నారులకు పరుగుపందెం, బాలికలకు సూదిలో దారం ఎక్కించుట, పరుగు ప్పందెం, కుర్చీలాట మొదలగు పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. 21వతేదీ మంగళవారం వేకువఝామున గ్రామంలో స్వామివారి జెండా, వేదాల పెట్టె, పీరులతో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్థులు స్వామివారి జెండాకు కాయా కర్పూరం సపర్పించి పూజలు చేసారు. ఈ కార్యక్రమాలలో ఆకవీడు, జి.కొత్త్గపల్లె గ్రామస్థులతోపాటు పలు గ్రామాల భక్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం - ఈ ఆలయం గ్రామంలో నైరుతి దిక్కున ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరినది. పూజాధికాలు గూడా సక్రమంగా నిర్వహించుటలేదు. ఈ ఆలయంలోని ఆరదుగులకు పైగా ఎత్తయిన వీరభద్రస్వామివారి విగ్రహాన్ని, 2017, జూన్-8 రాత్రి, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టినారు.

ఆకవీడు గ్రామంలో కాటమరాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, గంగా భవాని అమ్మవారి దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమం, 2017, జూన్-16వతేదీ శుక్రవారం నుండి 18వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించారు. 16 న గణపతి పూజ, హోమాలు, మండపారాధన, 17 న గ్రామోత్సవం, 18 న యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, నిర్వహించారు. భక్తులకు 17, 18 తేదీలలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జిల్లాస్థాయిలో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఆకవీడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఆకవీడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఆకవీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 144 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1375 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 809 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 70 హెక్టార్లు
  • బంజరు భూమి: 139 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1749 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 851 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1037 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఆకవీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 1037 హెక్టార్లు
  • దొడ్డేటి చెరువు.
  • తురకవాని చెరువు.

ఉత్పత్తి

[మార్చు]

ఆకవీడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

కంది, సజ్జలు, ప్రత్తి, వరి, జొన్న

గణాంకాలు

[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,547. ఇందులో పురుషుల సంఖ్య 2,867, మహిళల సంఖ్య 2,680, గ్రామంలో నివాస గృహాలు 1,254 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4288 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకవీడు&oldid=4267156" నుండి వెలికితీశారు