అజంతా మెండిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజంతా మెండిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బాలపువాడుగే అజంతా విన్స్లో మెండిస్
పుట్టిన తేదీ (1985-03-11) 1985 మార్చి 11 (వయసు 39)
మొరటువా, శ్రీలంక
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్ స్పిన్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 109)2008 జూలై 23 - ఇండియా తో
చివరి టెస్టు2014 జూలై 24 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 134)2008 ఏప్రిల్ 10 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2015 డిసెంబరు 26 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.40
తొలి T20I (క్యాప్ 22)2008 అక్టోబరు 10 - జింబాబ్వే తో
చివరి T20I2014 మే 27 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–2019వయాంబా క్రికెట్ జట్టు
2006–2019Sri Lanka Army
2011సోమర్సెట్
2008–2009కోల్‌కతా నైట్‌రైడర్స్
2012Nagenahira Nagas
2013Pune Warriors
2014Lahore Qalandars
2014Sydney Thunder
2015Sylhet Super Stars
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20
మ్యాచ్‌లు 19 87 39
చేసిన పరుగులు 213 188 8
బ్యాటింగు సగటు 16.38 8.17 2.66
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 78 21* 4*
వేసిన బంతులు 4,730 4,154 885
వికెట్లు 70 152 66
బౌలింగు సగటు 34.77 21.86 14.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 3 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 6/117 6/13 6/8
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 15/– 6/–
మూలం: ESPNcricinfo, 2016 డిసెంబరు 26

బాలపువాడుగే అజంతా విన్స్లో మెండిస్ (జననం: 1985, మార్చి 11) శ్రీలంక మాజీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్‌లలో ఆడాడు, ఇతనిని "మిస్టరీ స్పిన్నర్" అని కూడా పిలుస్తారు. 2019 ఆగస్టులో ఇతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[1] 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

మెండిస్ 2008లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసి 39 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కూడా ఆడాడు. వన్డేల్లో 19 మ్యాచ్‌లతో వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

2008, జూలై 23న కొలంబోలో భారత్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో 8–132తో మ్యాచ్ గణాంకాలు చేశాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఎనిమిది వికెట్లు తీసిన తొలి శ్రీలంక బౌలర్‌గా నిలిచాడు. 2008 సెప్టెంబరులో దుబాయ్‌లో జరిగిన ఐసీసీ అవార్డుల వేడుకలో మెండిస్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.

2017 ఫిబ్రవరి వరకు ఇతను ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో ఆరు వికెట్లు తీసిన ఏకైక బౌలర్, 2012 సెప్టెంబరు 18న జింబాబ్వేపై శ్రీలంక తరపున 8 పరుగులకు 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు గణాంకాలను నమోదు చేస్తూ రెండుసార్లు ఆ ఫీట్ సాధించాడు. 2012 అక్టోబరు 26న అజంతా మెండిస్ శ్రీలంకలో అత్యున్నత పౌర గౌరవమైన బంటు శ్రీలంక ఆర్డర్‌ను అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2007-08 ప్రీమియర్ లీగ్‌లో పది సగటుతో 54 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[2][3] 2008 ఏప్రిల్ 10న వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు. ఈ మ్యాచ్ లో 10 ఓవర్లలో 39 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.[4] రెండవ వన్డేలో నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్ మ్యాచ్ గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.[5]

2008, జూలై 23న కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో భారత్ జరిగిర మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన ఐదవ ఓవర్‌లో రాహుల్ ద్రవిడ్‌ను అవుట్ చేసి మొదటి వికెట్‌ను సాధించాడు. అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, వివిఎస్ లక్ష్మణ్‌ల వికెట్లను కూడా తీసి 72 పరుగులకు 4 వికెట్లు తీశాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో 60 పరుగులకు 4 వికెట్లు తీశాడు. 1985–86లో పాకిస్తాన్‌పై మెండిస్ తన తొలి పది వికెట్లు సాధించాడు. సిరీస్‌లో 26 వికెట్లు (18.38)తో, మెండిస్ మూడు టెస్టుల సిరీస్‌లో అరంగేట్రం చేసిన బౌలర్‌గా అలెక్ బెడ్సర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.[6][7] ఇతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.

2008 అక్టోబరు 10న క్వాడ్రాంగ్యులర్ ట్వంటీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ సందర్భంగా, మెండిస్ శ్రీలంకకు 22వ టీ20 క్యాప్‌గా కెనడాలోని కింగ్ సిటీలో జింబాబ్వేపై తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులకు నాలుగు వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తరువాతి మ్యాచ్ లో కెనడాపై 17 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు-దేశాల సిరీస్ ఫైనల్‌లో 23 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. కేవలం మూడు మ్యాచ్ లలో 55 పరుగులకు 11 వికెట్లు పడగొట్టిన ఇతని అద్భుతమైన ఆటకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ajantha Mendis retires from all forms of cricket". ESPN Cricinfo. Retrieved 2023-08-27.
  2. "Jayasuriya faces axe for West Indies series". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  3. "Jayasuriya left out of West Indies ODIs". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  4. "We need to make a plan against Mendis: Bravo". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  5. "2nd ODI, Sri Lanka tour of West Indies at Port of Spain, Apr 12 2008". ESPNcricinfo. Retrieved 2023-08-27.
  6. Alter, Jamie (10 August 2008). "Tailenders' batting swung match – Sangakkara". ESPN Cricinfo.
  7. "Mendis beats a Bedser best". ESPNcricinfo. 13 August 2008. Archived from the original on 17 August 2008. Retrieved 2023-08-27.