Jump to content

అభిషేక్

వికీపీడియా నుండి
అభిషేక్
జననం
అభిషేక్ కుమార్

వృత్తినటుడు

అభిషేక్ ఒక తెలుగు సినీ నటుడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అభిషేక్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్. తండ్రి చనిపోవడంతో డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి 1999లో హైదరాబాదుకు వచ్చాడు.[2] 2012 డిసెంబరులో అభిషేక్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. అభిషేక్, జి. శ్రీనివాసులు అనే వ్యక్తితో స్కోడా కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు తమ రోజువారీ చెకప్ లో భాగంగా కారును చెక్ చేయగా అందులో 10 ప్యాకెట్ల కొకైన్ దొరికింది. పోలీసుకు ప్రశ్నించగా తాను, నటుడు రవితేజ సోదరులైన రఘు, భరత్ లతో కలిసి 2010 నుంచి డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.[2][3]

కెరీర్

[మార్చు]

అభిషేక్ 2003 లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. తర్వాత అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రానికి రీమేక్ అయిన నేను చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించాడు. డేంజర్ సినిమాలో కూడా నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. శశిరేఖా పరిణయం సినిమాలో హీరో తరుణ్కి తమ్ముడి పాత్రలో నటించాడు.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఫిల్మీబీట్ లో అభిషేక్ ప్రొఫైలు". filmibeat.com. filmibeat.com. Retrieved 18 November 2016.
  2. 2.0 2.1 విలేఖరి. "Actor arrested; 10 grams of cocaine seized". thehindu.com. ది హిందూ. Retrieved 18 November 2016.
  3. కోనేరు, వినీత్ కుమార్. "Telugu actor caught with cocaine". deccanchronicle.com. దక్కన్ క్రానికల్. Retrieved 18 November 2016.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=అభిషేక్&oldid=4056022" నుండి వెలికితీశారు