Coordinates: 16°22′19″N 77°46′25″E / 16.371988°N 77.773482°E / 16.371988; 77.773482

అమరచింత మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరచింత మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, అమరచింత మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, అమరచింత మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, అమరచింత మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°22′19″N 77°46′25″E / 16.371988°N 77.773482°E / 16.371988; 77.773482
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం అమరచింత
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 107 km² (41.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 28,434
 - పురుషులు 14,155
 - స్త్రీలు 14,279
పిన్‌కోడ్ 509131


అమరచింత, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 47 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. అమరచింత, ఈ మండలానికి కేంద్రం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అమరచింత గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని ఆత్మకూరు మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (1+13) పద్నాలుగు గ్రామాలుతో, అమరచింత నూతన మండల కేంధ్రంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 107 చ.కి.మీ. కాగా, జనాభా 28,434. జనాభాలో పురుషులు 14,155 కాగా, స్త్రీల సంఖ్య 14,279. మండలంలో 6,111 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అమరచింత
  2. మస్తీపూర్
  3. పామిరెడ్డిపల్లి
  4. కంకన్‌వానిపల్లి
  5. సింగంపేట
  6. నందిమళ్ళ
  7. చింతరెడ్డిపల్లి
  8. మిట్టనందిమల్ల
  9. ఎర్లదిన్నె
  10. చంద్రఘడ్
  11. ధర్మాపూర్
  12. నాగల్‌కడుమూర్
  13. కిస్టంపల్లి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.