Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

అమీ సాటర్త్‌వైట్

వికీపీడియా నుండి
అమీ సాటర్త్‌వైట్
అమీ సాటర్త్‌వైట్ (2010)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమీ ఎల్లా సాటర్త్‌వైట్
పుట్టిన తేదీ (1986-10-07) 1986 అక్టోబరు 7 (వయసు 38)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం; కుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులులీ తహుహు (భార్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 106)2007 21 July - Australia తో
చివరి వన్‌డే2022 26 March - Pakistan తో
తొలి T20I (క్యాప్ 18)2007 19 July - Australia తో
చివరి T20I2021 9 September - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2022/23Canterbury
2014/15–2015/16Tasmania
2015/16–2016/17Hobart Hurricanes
2016–2018Lancashire Thunder
2017Lancashire
2017/18–2018/19Melbourne Renegades
2018/19Tasmania
2020/21Melbourne Renegades
2022Manchester Originals
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20
మ్యాచ్‌లు 145 111 323 314
చేసిన పరుగులు 4,639 1,784 10,244 6,957
బ్యాటింగు సగటు 38.33 21.49 41.47 29.35
100లు/50లు 7/27 0/1 15/66 1/30
అత్యుత్తమ స్కోరు 137* 71* 137* 114
వేసిన బంతులు 1,930 513 8,052 3,163
వికెట్లు 50 26 215 161
బౌలింగు సగటు 29.72 23.42 26.43 21.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 1 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/13 6/17 5/27 6/17
క్యాచ్‌లు/స్టంపింగులు 56/– 36/– 139/– 128/–
మూలం: CricketArchive, 6 March 2023

అమీ ఎల్లా సాటర్త్‌వైట్ (జననం 1986, అక్టోబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా ఎడమచేతి వాటం బ్యాటింగ్ లో, కుడిచేతి మీడియం లేదా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో రాణించాడు. 2007 - 2022 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 145 వన్ డే ఇంటర్నేషనల్స్, 111 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ, టాస్మానియా, హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, లంకాషైర్ థండర్, లాంక్షైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

2017, ఫిబ్రవరి 26న, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, మహిళా వన్డేలలో మొదటి క్రీడాకారిణిగా, వన్డేలలో కుమార సంగక్కర తర్వాత వరుసగా నాలుగు సెంచరీలు సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది.[2] 2017 డిసెంబరులో, ప్రారంభ ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[3][4] 2018 సెప్టెంబరులో, సుజీ బేట్స్ న్యూజీలాండ్ కెప్టెన్సీ నుండి వైదొలగడంతో, ఆ స్థానంలో సాటర్త్‌వైట్ ఎంపికయింది.[5]

2020 జూలైలో, న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ నియమితురాలయింద, సోఫీ డివైన్ పూర్తి సమయం ఆధారంగా జట్టు కెప్టెన్‌గా నియమితురాలయింది. 2020 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన న్యూజీలాండ్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, సాటర్త్‌వైట్ తన 100వ మహిళా టీ20లో ఆడింది. 2022 మే లో, సాటర్త్‌వైట్ అంతర్జాతీయ క్రికెట్ నుండి, 2023 ఫిబ్రవరిలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

సాటర్త్‌వైట్ 2007, జూలై 19న ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. రెండు రోజుల తర్వాత ఆస్ట్రేలియాపై తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[6]

అంతర్జాతీయ వన్డే సెంచరీలు

[మార్చు]
అమీ సాటర్త్‌వైట్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు[7]
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థులు నగర దేశం వేదిక సంవత్సరం
1 109 47  ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సిడ్నీ, ఆస్ట్రేలియా ఉత్తర సిడ్నీ ఓవల్ 2012[8]
2 103 54  ఇంగ్లాండు భారతదేశం ముంబై, భారతదేశం బ్రబౌర్న్ స్టేడియం 2013[9]
3 137 * 89  పాకిస్తాన్ న్యూజీలాండ్ లింకన్, న్యూజిలాండ్ బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ 2016[10]
4 115* 90  పాకిస్తాన్ న్యూజీలాండ్ లింకన్, న్యూజిలాండ్ బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ 2016[11]
5 123 92  పాకిస్తాన్ న్యూజీలాండ్నెల్సన్, న్యూజిలాండ్ సాక్స్టన్ ఓవల్ 2016[12]
6 102* 93  ఆస్ట్రేలియా న్యూజీలాండ్ఆక్లాండ్, న్యూజిలాండ్ ఈడెన్ పార్క్ ఔటర్ ఓవల్ 2017[13]
7 119* 125  ఇంగ్లాండు న్యూజీలాండ్డునెడిన్, న్యూజిలాండ్ యూనివర్శిటీ ఓవల్ 2021[14]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2017 మార్చిలో, తన తోటి అంతర్జాతీయ క్రికెటర్ లీ తహుహుని వివాహం చేసుకుంది.[15] 2020 జనవరి 13న, సాటర్త్‌వైట్ గ్రేస్ మేరీ సాటర్త్‌వైట్ అనే కుమార్తెకు జన్మనిచ్చింది.[16]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Amy Satterthwaite". CricketArchive. Retrieved 6 March 2023.
  2. "White Fern seeks to outdo Kumar". Cricket Australia. Retrieved 27 February 2017.
  3. "Ellyse Perry declared ICC's Women's Cricketer of the Year". ESPN Cricinfo. Retrieved 21 December 2017.
  4. "Amy Satterthwaite named ICC Women's ODI Player of the Year". NZ Herald. Retrieved 22 December 2017.
  5. "Amy Satterthwaite replaced Suzie Bates as White Ferns captain". International Cricket Council. Retrieved 12 September 2018.
  6. అమీ సాటర్త్‌వైట్ at ESPNcricinfo
  7. "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Amy Satterthwaite". Cricinfo. Retrieved 2 November 2021.
  8. "Full Scorecard of NZ Women vs AUS Women 2nd Match 2012/13 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  9. "Full Scorecard of ENG Women vs NZ Women 21st Match, Super Six 2012/13 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  10. "Full Scorecard of NZ Women vs PAK Women 2nd ODI 2016/17 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  11. "Full Scorecard of PAK Women vs NZ Women 3rd ODI 2014-2016/17 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  12. "Full Scorecard of PAK Women vs NZ Women 5th ODI 2014-2016/17 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  13. "Full Scorecard of AUS Women vs NZ Women 1st ODI 2016/17 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  14. "Full Scorecard of ENG Women vs NZ Women 3rd ODI 2020/21 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 November 2021.
  15. Johannsen, Dana (20 May 2018). "Amy Satterthwaite and Lea Tahuhu – a cricketing partnership worthy of attention". Stuff.co.nz. Retrieved 22 May 2018.
  16. "White Ferns couple Amy Satterthwaite and Lea Tahuhu welcome baby Grace Marie". Stuff (in ఇంగ్లీష్). 16 January 2020. Retrieved 17 January 2020.

బాహ్య లింకులు

[మార్చు]