అమృతకలశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతకలశం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
తారాగణం కవిత,
నరసింహ రాజు,
జె.వి. రమణమూర్తి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ బిందు మూవీస్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

సరిత అనే అందాల యువతి సంపన్నుల ఇంట పుట్టి పెరిగింది. ఆమె వారికి ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగింది. సరితకు రవి అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, పిమ్మట ప్రేమగా మారింది. ఒకనాడు ఒకరిలో ఒకరు లీనమైపోగా సరిత కడుపు పండింది. సరిత, రవి గుళ్లో ఒకరికొకరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటారు. రవి వాళ్ల ఊరు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగిరాలేదు. సరిత కుమిలిపోయింది. సరితను ఆమె బావ మనసారా ప్రేమించాడు. కాని ఆమె అతనికి దక్కలేదు. అయినా బావ సరిత పట్ల సానుభూతిగానే ఉన్నాడు. సరిత మగశిశువును ప్రసవించింది. సరిత తండ్రి ఆ శిశువును అనాథశరణాలయంలో ఉంచి వచ్చాడు. అనాథ శరణాలయం అధికారి ఆ శిశువును నారాయణరావు అనే మరో సంపన్నుడికి అప్పగిస్తాడు. నారాయణరావు ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. కథ అనేక మలుపులు తిరిగిన తర్వాత చివరి ఘట్టంలో ఆ బాలుడు ఒక దుర్మార్గుని చేతిలో గాయపడతాడు. అతడు బ్రతకడానికి రక్తం కావలసి వచ్చి సరిత రక్తదానం చేసి బిడ్డ ప్రాణాలు నిలబెట్టి తన ప్రాణాలు కోల్పోతుంది.[1]

పాటలు

[మార్చు]
  1. ఎదటికొస్తే నవ్వులు వెనక చూస్తె పువ్వులు ఎవరమ్మా- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  2. పడమర తూరుపు రెండే దిక్కులు వెలిగే సూర్యుడికి ప్రేమ పాశం - పి.సుశీల, వాణీ జయరామ్
  3. మంగళగిరి పానకాలు మసకేసే పూనకాలు మందులో ఏముందిరా - ఎస్.పి.శైలజ
  4. సిగ్గాయే సిగ్గాయేరా స్వామీ బుగ్గంతా ఎరుపాయేరా మానసచోరా నిను చేర - పి.సుశీల
  5. నీ యవ్వనం ఎప్పుడు ఆరని ఆవిరి నిప్పులు కురిసే తొలకరి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె

మూలాలు

[మార్చు]
  1. సి.ఎస్.బి. (17 July 1981). "చిత్రసమీక్ష: అమృతకళశం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 105. Retrieved 18 February 2018.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతకలశం&oldid=4210383" నుండి వెలికితీశారు