Coordinates: 26°09′N 81°49′E / 26.15°N 81.82°E / 26.15; 81.82

అమేఠీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?అమేఠీ
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°09′N 81°49′E / 26.15°N 81.82°E / 26.15; 81.82
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 100 మీ (328 అడుగులు)
జిల్లా (లు) సుల్తాన్ పూర్ జిల్లా
జనాభా 12,808 (2001 నాటికి)
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్

• ++915368

అమేఠీ ఉత్తర ప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లాలో ఒక నగరపంచాయితీ. ఫైజాబాద్ డివిజను లోని అమేఠీ జిల్లాలో ఇదొక పెద్ద పట్టణం. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేఠీ తరచూ వార్తలలో వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, జవహర్‌లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో రాహుల్ గాంధీ కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో ఐఐఐటి ఉంది. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.

గతంలో అమేఠీని రాయ్‌పూర్-అమేఠీ అని పిలిచేవారు. అమేఠీ రాజు కోట రాయ్‌పూరులో ఉండేది. రాజు పూర్వీకులు రాయ్‌పూర్-ఫుల్వారీలో నివసించేవారు. అక్కడ పాతకోట ఇప్పటికీ ఉంది. పట్టణానికి దగ్గర్లో హనుమన్‌గఢీ అలయం ఉంది. అమేఠీలోని మసీదు, ఈ దేవాలయం రెండూ వంద సంవత్సరాల నాటివి. అమేఠీ నుండి 3 కి.మీ. దూరంలో మాలిక్ మహమ్మద్ జయాసీ అనే కవి సమాధి ఉంది.[1]

అమేఠీ లోక్‌సభ నియోజకవర్గానికి, అమేఠీ శాసనసభ నియోజక వర్గానికీ అమేఠీ పట్టణం కేంద్రం.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం అమేఠీ పట్టణ జనాభా 13,530. వారిలో పురుషులు 7,093, స్త్రీలు 6,437. ఆరేళ్ళ లోపు పిల్లలు 1,850. అక్షరాస్యత 51.1%. పురుషుల అక్షరాస్యత 55.6% కాగా, స్త్రీలలో 46.2%గా ఉంది. ఏడేళ్ళ పైబడ్డ వారిలో అక్షరాస్యత 64.7%. అమేఠీలో మొత్తం 2158 ఇళ్ళున్నాయి.[2] 2001 జనగణన ప్రకారం పట్టణ జనాభా 12,808.[3]

విద్యా సంస్థలు, ఇతర సంస్థలు[మార్చు]

పట్టణంలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఉంది. పెట్రోలియం టెక్నాలజీలో ఇంజనీరింగు విద్యను ఈ కళాశాల అందిస్తుంది. దీన్ని 2008 లో స్థాపించారు.

రవాణా[మార్చు]

అమేఠీ రైల్వే స్టేషను నుండి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకూ, బెంగళూరుకూ రవాణా సౌకర్యం ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మేథీ నుండి ఇతర నగరాలకు, ప్రాంతాలకూ తిరుగుతాయి. అలహాబాదు, అమేఠీకి 95 కి.మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం.

మూలాలు[మార్చు]

  1. "About Amethi". Archived from the original on 2019-09-04. Retrieved 2020-06-15.
  2. "Census of India: Amethi". www.censusindia.gov.in. Retrieved 15 November 2019.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=అమేఠీ&oldid=4055484" నుండి వెలికితీశారు