అమ్మోనియం పెర్సల్ఫేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మోనియం పెర్సల్ఫేట్
Structural formulas of two ammonium cations and one peroxydisulfate anion
Ball-and-stick models of two ammonium cations and one peroxydisulfate anion
Solid sample of ammonium persulfate, as a white powder
పేర్లు
ఇతర పేర్లు
Ammonium peroxydisulfate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7727-54-0]
పబ్ కెమ్ 62648
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-786-5
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య SE0350000
SMILES O=S(=O)([O-])OOS([O-])(=O)=O.[NH4+].[NH4+]
  • InChI=1/2H3N.H2O8S2/c;;1-9(2,3)7-8-10(4,5)6/h2*1H3;(H,1,2,3)(H,4,5,6)

ధర్మములు
(NH4)2S2O8
మోలార్ ద్రవ్యరాశి 228.18 g/mol
స్వరూపం white to yellowish crystals
సాంద్రత 1.98 g/cm3
ద్రవీభవన స్థానం 120 °C (248 °F; 393 K) decomposes
80 g/100 mL (25 °C)
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R8, R22, R36/37/38, మూస:R42/43
S-పదబంధాలు (S2), మూస:S22, మూస:S24, S26, S37
Lethal dose or concentration (LD, LC):
689 mg/kg, oral (rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium persulfate
Potassium persulfate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం పెర్సల్ఫేట్ (Ammonium persulfate) అనునది ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఇది ఒక ఆకర్బన సమ్మెళనపదార్థం.ఈ సమ్మేళనం యొక్క రసాయనిక ఫార్ములా (NH4)2S2O8. ఈ సంయోగ పదార్థాన్ని అమ్మోనియం పెరాక్సి డై సల్ఫేట్ ( Ammonium peroxydisulfate) అనికూడా అంటారు

భౌతిక ధర్మాలు

[మార్చు]

అమ్మోనియం పెర్సల్ఫేట్ రంగులేని (తెల్లని) స్పటిక ఘన పదార్థం.కొన్ని సందార్భాలలో పసుపుగా కనిపించును.నీటిలో బాగా కరుగుతుంది. అమ్మోనియం పెర్సల్ఫేట్‌ శక్తివంతమైన ఆక్సీకరణ కారకం. అమ్మోనియం పెర్సల్ఫేట్ యొక్క అణుభారం 228.18గ్రాములు/మోల్. ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 1.98గ్రాములు/సెం.మీ3 ద్రవీభవన స్థానం 120  °C, ఈ ఉష్ణోగ్రతవద్ద ఈ సమ్మేళన పదార్థం వియోగం చెందును. 20°Cవద్ద నీటిలో ఈ సంయోగ పదార్థం 100 మీ.లీ.80 గ్రాములు కరుగును.

రసాయన చర్యలు

[మార్చు]

అమ్మోనియం పెర్సల్ఫేట్ ను నీటిలో కరిగించినపుడు ఉష్ణగ్రాహక/ తాపచూషక (endothermic) చర్య వలన ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఉత్పత్తి

[మార్చు]

ఎక్కువ ప్రవాహ సాంద్రత కలిగిన సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉన్న గాఢ అమ్మోనియం సల్ఫేట్‌నువిద్యుద్విశ్లేషణ (electrolysis) చేసి అమ్మోనియం పెర్సల్ఫేట్‌ను తయారు చేయుదురు. ఈ ఉత్పత్తి విధానాన్ని మొదటగా హెచ్.మార్షల్ (H. Marshall) కనుగోన్నాడు.

ఉపయోగాలు

[మార్చు]

అమ్మోనియం పెర్సల్ఫేట్ ఒక ఆక్సీకరణి (oxidizer ), ధాత్వంశం (Radical) యొక్క వనరుగా పనిచేస్తుంది.రాడికల్/ ధాత్వంశం అనగా ఒంటరి/జంటగాలేని వేలన్సీ ఎలక్ట్రాన్ లను కలిగిన ఒక అణువు లేదా పరమాణువు, లేదా అయాను.అమ్మోనియం పెర్సల్ఫేట్ ను పలు వ్యాపార ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

ఆల్కినుల పాలిమెరైజేసన్ (polymerization) చర్యలో అమ్మోనియం పెర్సల్ఫేట్ను ధాత్వంశం ప్రారంభకం (radical initiator) గా ఉపయోగిస్తారు. స్టేరెన్ బ్యుట డైన్ రబ్బరు (styrene-butadiene rubber), అమ్మోనియం పెర్సల్ఫేట్ పాలి టెట్రాఫ్లోరోఈథైలిన్ (polytetra fluoroethylene) లతయారిలో అమ్మోనియం పెర్సల్ఫేట్నుఉపయోగిస్తారు. ద్రావణంలో అమ్మోనియం పెర్సల్ఫేట్ డైఅనియాన్ విడిపోయి రాడికల్ లను విడుదల చేయును.

[O3SO-OSO3]2− ↔ 2 [.SO4]

ఈ సల్ఫేట్ రాడికల్ ఆల్కిన్ తో కలిసి సల్ఫేట్ ఎస్టార్ (sulfate ester) రాడికల్ ను ఏర్పరచును.

అమ్మోనియం పెర్సల్ఫేట్ డైఅనియాన్, టెట్రా మిథైల్ ఇథైలిన్ డై అమైండ్ తో కలిసి ఆక్క్రిల్ అమైడ్ పాలిమరైజేజనులో ఉత్పేరకంగా పనిచేసి పాలిఆక్రిలమైడ్ (polyacrylamide) జెల్ ఏర్పడుటకు దోహదపడును. అమ్మోనియం పెర్సల్ఫేట్ కు ఉన్న శక్తివంతమైన ఆక్సీకరణ గుణం కారణంగా దీనిని ప్రింటెడ్ సర్కూట్ బోర్డులమీద రాగిని అతికించుటకు ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణముకు ప్రత్నామ్యాయంగా ఉపయోగిస్తారు. సా.శ.1909లోనే ఈ విధానాన్ని ఆవిష్కరణ చేశారు. జాన్ విలియం టుర్రన్టైన్ అమ్మోనియం పెర్ సల్ఫేట్స జలద్రావణాన్ని కాపరును సర్కూట్ బోర్డు మీద అతికించాడు. అమ్మోనియం పెర్సల్ఫేట్ ను వెస్టర్న్ బ్లాట్ జెల్, కేశవిరంజన ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. కర్బన రసాయన శాస్త్రంలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.

భద్రత

[మార్చు]

గాలిలో కలిసిన, మోసుకురాబడిన అమ్మోనియం పెర్సల్ఫేట్ ధూ ళి ప్రకోపింప జేసే (irritating) గుణాన్నికలిగి ఉంది.పెర్సల్ఫెటేడ్ లవణాలు ఉబ్బసరోగ సంబంధలక్షణాలను ప్రకోపింప చేయును.

మూలాలు

[మార్చు]