అమ్మోనియం సల్ఫైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మోనియం సల్ఫైట్
Ball-and-stick ninja of two ammonium cations and one sulfite anion
పేర్లు
IUPAC నామము
Ammonium sulfite
ఇతర పేర్లు
Ammonium sulphite, Diammonium sulfite, Diammonium sulfonate, Sulfurous acid, Diammonium salt, Sulfurous acid, ammonium salt(1:2)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [17026-44-7]
SMILES [H][N+]([H])([H])[H].[H][N+]([H])([H])[H].O=S([O-])[O-]
ధర్మములు
(NH4)2SO3
మోలార్ ద్రవ్యరాశి 116.14 g/mol
స్వరూపం colourless[1]
hygroscopic

Crystals[2]

ద్రవీభవన స్థానం 65 °C (149 °F; 338 K) decomposes[1]
35 g/100 mL[1]

32.4g/100mL at 0 degrees Celsius[3]

60.4g/100mL at 100 degrees Celsius[3]

ద్రావణీయత Insoluble in acetone and alcohol[2]
వక్రీభవన గుణకం (nD) 1.515.[3]
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium Sulfite Potassium Sulfite
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం సల్ఫైట్ ఒక రసాయనిక సమ్మేళనం. అమ్మోనియం సల్ఫైట్ సమ్మేళనం సల్ఫ్యురస్ ఆమ్లం యొక్క అమ్మోనియం లవణం. ఈ సమ్మేళన పదార్థాన్ని డై అమ్మోనియం సల్ఫైట్ అనియు, డై అమ్మోనియం సల్ఫోనేట్ అనియు, డై అమ్మోనియం లవణం అనియుకూడా అంటారు.

భౌతిక లక్షణాలు

[మార్చు]

అమ్మోనియం సల్ఫైట్ ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్థం. రంగులేని స్పటికాలుగా ఉండును. రసాయన ఫార్ములా (NH4)2SO3. తేమ/చెమ్మనుపీల్చుకోను ( hygroscopic) గుణం కలిగి ఉంది. ఈ సమ్మేళనం యొక్క అణు భారం 116.14 గ్రాములు/మోల్.ఈ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవస్థానం 65 °C, ఈ ఉష్ణోగ్రతవద్ద ఇది వియోగం చెందును. అమ్మోనియం సల్ఫైట్ నీటిలో కరుగుతుంది. ఆల్కహాల్, అసిటోన్ ద్రవాలలో కరుగదు. నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది, అందులో కరుగు అమ్మోనియం సల్ఫైట్ యొక్క ఘనపరిమాణం పెరుగును. వక్రీభవన సూచిక 1.515. అమ్మోనియం సల్ఫైట్ యొక్క విశిష్ట గురుత్వం 1.41.

రసాయన ధర్మాలు

[మార్చు]

అమ్మోనియం సల్ఫైట్ ఒక క్షయికరణ కారకం (reducing agent) [4].అమ్మోనియం సల్ఫైట్‌ను 65 °C మించి వేడి చేసిన సల్ఫర్ డై ఆక్సైడ్, నత్రజని యొక్క ఆక్సైడ్‌లుగా వియోగం చెందును.

ఉత్పత్తి

[మార్చు]

సజల సల్ఫర్ డై ఆక్సైడ్, అమ్మోనియా రసాయన చర్య వలన అమ్మోనియం సల్ఫైట్ ఏర్పడును.

2NH3 + SO2 + H2O → (NH4)2SO3

వినియోగం

[మార్చు]

అమ్మోనియం సల్ఫైట్‌ను సౌందర్యద్రవ్యాలలో (cosmetics) కేశాలను సరళంగా ఉంచు, లేదా వంకీలుగా చెయ్యు కేశ పోషక సాధనాలలో ఉపయోగిస్తారు.[5] గతంలో సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి చేయు కేశ సౌందర్య వస్తువులలో, ప్రస్తుతం సోడియం హైడ్రాక్సైడ్‌కు బదులుగా అమ్మోనియం సల్ఫైట్‌ను ఉపయోగిస్తున్నారు.

పోటోగ్రఫీలో అమ్మోనియం సల్ఫైట్‌ను క్షయికరణ కారకం (reducing agent) గా వాడెదరు.పోటోగ్రఫిలో నెగటివ్ ఫిల్మ్‌ను డెవలప్ చెయ్యుటకు అమ్మోనియం సల్ఫైట్ ఉపయోగిస్తారు.

బ్లాస్ట్ ఫర్నేష్ (కొలిమి) లలో ఉపయోగించు ఇటుకలలో అమ్మోనియం సల్ఫైట్ను కలుపుతారు.కోల్డ్ మెటల్ వర్కింగ్ లో ఉపయోగించు కందెనలలలో అమ్మోనియం సల్ఫైట్ ఉపయోగిస్తారు.ఇవి లోహాల సంపర్కం చలనం వలన ఏర్పడు ఘర్షణ తగ్గించి, ఉత్పత్తి అగు వేడిని తొలగించును.అమ్మోనియం సల్ఫైట్‌ను వాయువుల స్క్రబ్బర్ పరికారాలలో స్కబ్బర్ గా ఉపయోగిస్తారు.[6]

ప్రమాదం

[మార్చు]

అమ్మోనియం సల్ఫైట్ మనుషులపై విష ప్రభావం చూపును. కడుపులోకి/జీర్ణవ్యవస్థలోకి వెళ్ళిన ప్రమాదం.చర్మానికితగిలిన, కళ్ళకు సోకినా ప్రమాదమే.తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Chemical Entity Data Page
  2. 2.0 2.1 2.2 [Material Safety Data Sheet: Ammonium sulfite MSDS. http://www.sciencelab.com/msds.php?msdsId=9922932 (accessed Oct 19, 2011)]
  3. 3.0 3.1 3.2 ["Ammonium Sulphite - PubChem Public Chemical Database." The PubChem Project. Web. 26 Oct. 2011. <http://pubchem.ncbi.nlm.nih.gov/summary/summary.cgi?sid=167823>.]
  4. Chemical Book
  5. [Europe. European Commission. Health and Consumers. Cosmetics - CosIng [Cosmetics Directive (v.1)]. European Commission. Web. 26 Oct. 2011. <http://ec.europa.eu/consumers/cosmetics/cosing/index.cfm?fuseaction=search.details&id=31900>.]
  6. ["Stack gas cleanup by ammonia injection", Chem. Eng. News, 1972, 50 (37), pp. 54–56]