అమ్మోనియం పెర్క్లోరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మోనియం పెర్క్లోరేట్
Ammonium perchlorate
Unit cell of the crystal structure
పేర్లు
IUPAC నామము
Ammonium perchlorate
ఇతర పేర్లు
AP
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7790-98-9]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-235-1
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య SC7520000
SMILES [O-]Cl(=O)(=O)=O.[NH4+]
ధర్మములు
NH4ClO4
మోలార్ ద్రవ్యరాశి 117.49 g/mol
స్వరూపం White Crystalline [1]
సాంద్రత 1.95 g/cm3
ద్రవీభవన స్థానం Exothermic decomposition before melting at >200 °C[2]
11.56 g/100 mL (0 °C)
20.85 g/100 mL (20 °C)
57.01 g/100 mL (100 °C)
ద్రావణీయత Soluble in Methanol
partially soluble in Acetone
insoluble in Ether
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic (< 513 K)
Cubic (> 513 K)
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R9, మూస:R44
S-పదబంధాలు (S2), మూస:S14, S16, మూస:S27, మూస:S36/37
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
240 °C (464 °F; 513 K)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Potassium perchlorate
Sodium perchlorate
Lithium perchlorate
సంబంధిత సమ్మేళనాలు
Perchloric acid
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం పెర్క్లోరేట్ (Ammonium perchlorate ) ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఇదిఒక ఆకర్బన రసాయన సమ్మేళన పదార్థం. రసాయనిక ఫార్ములాNH4ClO4

భౌతిక ధర్మాలు[మార్చు]

అమ్మోనియం పెర్క్లోరేట్ తెల్లని స్పటికాకార ఘనపదార్థం. పెర్క్లోరిక్ ఆమ్లం, అమ్మోనియాల రసాయనిక సంయోగం వలన ఈ సమ్మేళన పదార్థం ఏర్పడినది. అమ్మోనియం పెర్క్లోరేట్ ఒక శక్తి వంతమైన ఆక్సికరణి. అమ్మోనియం పెర్క్లోరేట్ యొక్క అణుభారం 117.49 గ్రాములు/మోల్.ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 1.95 గ్రాములు/సెం.మీ3.నీటి లోను, మిథనాల్ లోను కరుగుతుంది. అయితే ఈథర్ లో కరుగదు. అర్థోరొమ్బిక్ అణుసౌష్టవం కలిగియున్నది.

రసాయన చర్యలు[మార్చు]

అణువియోగం[మార్చు]

చాలా అమ్మోనియం లవణాలవలె అమ్మోనియం పెర్క్లోరేట్ కుడా ద్రవీభవనము చెందుటకు ముందే వియోగం చెందును.కొద్దిగా వేడి చెయ్యగానే క్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్,, నీరుగా అమ్మోనియం పెర్క్లోరేట్ వియోగం చెందును.

2 NH4ClO4 → Cl2 + N2 + 2 O2 + 4 H2O

ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేసినఅమ్మోనియం పెర్క్లోరేట్ విస్పోటన చెందును.అమ్మోనియం పెర్క్లోరేట్ సమ్మేళనం, తరగతి 4కి చెందిన ఆక్సీకరణి.

ఉత్పత్తి[మార్చు]

అమ్మోనియా, పెర్‌క్లోరిక్ ఆమ్లంల (perchloric acid) మధ్య రసాయనిక చర్య వలన అమ్మోనియం పెర్క్లోరేట్ ఉత్పత్తి అగును.పారిశ్రామిక అవసరాల నిమిత్తం కూడా ఈ విధానంలోనే ఉత్పతి చెయ్యుదురు. అమ్మోనియం లవణాలను సోడియం పెర్క్లోరేట్ తో రసాయన చర్య జరిపించడం వలన కూడా అమ్మోనియం పెర్క్లోరేట్ ఉత్పత్తి చెయ్యవచ్చును .అమ్మోనియం పెర్క్లోరేట్ రంగులేని స్పటికాలుగా ఘనిభవించును.

వినియోగం[మార్చు]

అమ్మోనియం పెర్క్లోరేట్ ను ప్రాధాన్యంగా ఘన ఇంధన ప్రొపెల్లెంట్/ చోదకము (propellant) తయారీలో ఉపయోగిస్తారు.

అమ్మోనియా పెర్క్లోరేట్ ను పొడిగా చేసిన అల్యూమినియం వంటి ఇంధనం లేదా ఎలాస్టమేరిక్‌వంటి బంధకాలతో మిశ్రమం చేసినప్పుడు స్వయంగా, మామూలు వాతావరణ వత్తిడి వద్ద దహనం చెందును.

దశాబ్దాలుగా ఘన రాకెట్ చోదకాలలో, స్పేస్ లాంచ్‌లలో, స్పేస్ సెటిల్ సాలిడ్ రాకెట్ బుస్టార్‌లలో ఆక్సీకర ణిగా వినియోగిస్తున్నారు. కొన్నిరకాల బాణసంచా వస్తువులలో కూడా అమ్మోనియా పెర్క్లోరేట్‌ను వినియోగిస్తున్నారు.

విషస్వభావం[మార్చు]

అమ్మోనియం పెర్క్లోరేట్ కొద్దిగా తగుమాత్రపు విషగుణాన్ని కలిగిఉన్నది.అమ్మోనియం పెర్క్లోరేట్ యొక్క LD2-4గ్రాములు/కిలో. జీర్ణవవస్థ నుండి శీఘ్రంగా తొలగింపబడును.అయితే దీర్ఘకాలిక ప్రభావానికి, అతితక్కువ మోతాదులో గురైనప్పటికి వివిధ థైరాయిడ్ సమస్యలకు లోను అయినట్లు తెలుస్తున్నది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.sigmaaldrich.com/MSDS/MSDS/DisplayMSDSPage.do?country=AE&language=en&productNumber=208507&brand=SIAL&PageToGoToURL=http%3A%2F%2Fwww.sigmaaldrich.com%2Fcatalog%2Fproduct%2Fsial%2F208507%3Flang%3Den Page 3, 9.1 (a)
  2. Liu, L.; Li, F.; Tan, L.; Ming, L.; Yi, Y. (2004), "Effects of Nanometer Ni, Cu, Al and NiCu Powders on the Thermal Decomposition of Ammonium Perchlorate", Propellants, Explosives, Pyrotechnics, 29: 34–38, doi:10.1002/prep.200400026
  3. https://www.sciencelab.com/msds.php?msdsId=9922929