Jump to content

అరికరేవుల సునందా శాస్త్రి

వికీపీడియా నుండి
అరికరేవుల సునందా శాస్త్రి
సునందా శాస్త్రి
జననంఅరికరేవుల సునందా శాస్త్రి
పేటేరు, గుంటూరు జిల్లా
ప్రసిద్ధికర్ణాటక సంగీతకారిణి,వైణికురాలు

అరికరేవుల సునందా శాస్తి కర్ణాటక సంగీతంలో విద్వాంసురాలు. ప్రసిద్ధ వైణికురాలు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలో సంగీత కారుల కుటుంబానికి చెందిన శ్రీహరి రావు, సుశీల దంపతులకు జన్మించారు. ఆమె మద్రాసుకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించారు. 1954, 1955 సంవత్సరాలలో ఆమె వోకల్, వీణ వాద్యాలలో మద్రాసు టెక్నికల్ బోర్డు వారినుండి డిప్లొమా పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదే సమయంలో ఆమె ఆల్ ఇండియా రేడియోలో సెమీ-క్లాసికల్, లైట్ మ్యూజిక్ లలో తన సంగీతాన్నందించారు. ఆమె తెలుసు సినిమాకు నేపథ్యగాయకురాలిగా కూడా పనిచేసారు. ఆమె "కుంకుమరేఖ", "చివరకు మిగిలేది", "కలిమిలేములు", "పచ్చని సంసారం", నరాంతకుడు వంటి చిత్రాలకు పాటలను పాడటమే కాకుండా హిందీ సినిమా "చోరీ చోరీ" (రాజ్ కపూర్ సినిమా) కు వీణలో తిల్లాన రికార్డింగులో కూడా పనిచేసారు. ఆమె ఆ సినిమాలో వీణా వాద్యంతో కనిపిస్తారు. ఆమె తండ్రి 1960 లో ఆమెను హైదరాబాదుకు తీసుకువెళ్ళిన మూలంగా ఆమె నేపథ్య గాయకురాలిగా కెరీర్ కు తెరపడింది. కానీ ఆమె తన సంగీతంతో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి అలరించారు.

ఆమెకు అనేక బిరుదులు, సత్కారాలు వచ్చాయి. ఆమెకు మధురగాయని అనే బిరుదు వచ్చింది. ఆమె ఎ.యు.స్కూలు ఆఫ్ పైన్ ఆర్ట్స్ లో వోకల్ ఉపాధ్యాయురాలిగా 13 సంవత్సరాలు పనిచేసారు. అదే విధంగా 10 సంవత్సరాలు ఎ.యు. ఉన్నత పాఠశాలలో 1977 వరకు పనిచేసారు.

యితర లింకులు

[మార్చు]