అరుణ్ నెహ్రూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ నెహ్రూ
జననం
అరుణ్ కుమార్ నెహ్రూ

(1944-04-24)1944 ఏప్రిల్ 24
లక్నో, యునైటెడ్ ప్రావిన్సెస్ (1937-50), బ్రిటిష్ ఇండియా
మరణం2013 జూలై 25(2013-07-25) (వయసు 69)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయవేత్త, కాలమిస్ట్
జీవిత భాగస్వామిసుభద్ర నెహ్రూ[1]
పిల్లలు2
బంధువులుఉమా నెహ్రూ (అమ్మమ్మ)
నెహ్రూ-గాంధీ కుటుంబం

అరుణ్ కుమార్ నెహ్రూ (1944 ఏప్రిల్ 24 - 2013 జులై 25) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కాలమిస్ట్. ఆయన జనతా దళ్ నాయకుడిగా బిల్హౌర్ నుండి 9వ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు, ఆయన భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెట్ పై రాయ్ బరేలీ నుండి 7వ, 8వ లోక్సభలో సభ్యుడిగా ఉన్నాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అరుణ్ నెహ్రూ 1944 ఏప్రిల్ 24న జన్మించారు.[3] ఆయన తండ్రి ఆనంద్ కుమార్ నెహ్రూ, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవాడు.[3] అతను లక్నోలో లా మార్టినియర్ బాయ్స్ కళాశాల, లక్నో క్రిస్టియన్ కళాశాలలోనూ చదువుకున్నాడు.[4] 1967లో సుభద్రను వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలను కలిగి ఉన్నారు. ఆయనకు ముగ్గురు మనుమలు ఉన్నారు. అఖిల మదన్, యశ్ మదన్, విక్రం టిక్కూ. [3] ఆయన 2013 జూలై 25న గుర్గావ్ లో మరణించాడు.[5]

కెరీర్

[మార్చు]

రాజకీయాల్లోకి రాకముందు 17 సంవత్సరాలు వ్యాపారవేత్తగా ఉన్నాడు. ప్రధాని ఇందిరా గాంధీ వృత్తిని మార్చమని అతనిని ఒప్పించిన సమయంలో అతను పెయింట్ సంస్థ జెన్సన్ అండ్ నికోల్సన్ అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] అయితే, సంజయ్ గాంధీ మరణం తరువాత ఆయన ప్రాముఖ్యత సంతరించుకున్నాడు. వ్యాపార సమాజం ఆయనను నిర్ణయాత్మక వ్యక్తిగా పరిగణించి, ఆయనను "వన్-విండో క్లియరెన్స్" అని కూడా పిలిచింది. 1981లో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, అరుణ్ నెహ్రూ ఆయనకు కీలక సలహాదారు అయ్యాడు.[6]

భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన 7వ లోక్‌సభలో, 8వ లోక్‌సభలో రాయ్ బరేలీ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఆయన కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రిగా డిసెంబరు 1984 నుండి సెప్టెంబరు 1985 వరకు, హోం వ్యవహారాల మంత్రిగా సెప్టెంబరు 1985 నుండి అక్టోబరు 1986 వరకు భారతదేశ 10వ మంత్రిత్వ శాఖలో పనిచేసాడు. తరువాత, ఆయన కాంగ్రెస్ ను వదిలి జనతాదళ్ కు 1989 లో బిల్హౌర్ నుండి 9 వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు, అక్కడ ఆయన కేంద్ర వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[2]

ఆయన రైల్వే కన్వెన్షన్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, విదేశీ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, 7వ లోక్సభ సభ్యుడు, కన్సల్టేటివ కమిటీ, విదేశీ కార్యకలాపాలు మొదలైన వివిధ కమిటీలలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Arun Nehru, former Union minister, dies". The Times of India. 25 July 2013. Retrieved 26 July 2013.
  2. 2.0 2.1 2.2 "Lok Sabha Member's Bioprofile". Archived from the original on 17 October 2013. Retrieved 16 February 2012.
  3. 3.0 3.1 3.2 "Arun Nehru Bio". Parliament of India. Archived from the original on 17 October 2013. Retrieved 27 July 2013.
  4. 4.0 4.1 "From the corporate world to politics". The Hindu. 26 July 2013. Retrieved 26 July 2013.
  5. "Former union minister and Congress leader Arun Nehru passes away". Deccan Chronicle. PTI. 25 July 2013. Archived from the original on 27 July 2013. Retrieved 25 July 2013.
  6. Mystery surrounds circumstances under which Nehru was ousted from power, India Today.