అర్షద్ ఖాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పెషావర్, పాకిస్తాన్ | 1971 మార్చి 22|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (1.93 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 149) | 1997 నవంబరు 17 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 మార్చి 24 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 87) | 1993 ఫిబ్రవరి 1 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2006 ఫిబ్రవరి 11 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 19 |
అర్షద్ ఖాన్ (జననం 1971, మార్చి 22) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా రాణించాడు. పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.
6'4" ఎత్తుగా ఉన్న అర్షద్ క్లాసికల్ ఆఫ్-స్పిన్నర్ మౌల్డ్‌లో బౌలింగ్ చేస్తాడు.[2]
2015లో, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్ళాడు. కోచ్‌గా క్రికెట్‌కు తిరిగి వెళ్ళేముందు అక్కడ కొన్ని సంవత్సరాలు టాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు.[3]
క్రికెట్ కెరీర్
[మార్చు]1997–98 సీజన్‌లో వెస్టిండీస్‌తో ఆడేందుకు అర్షద్ తొలిసారి ఎంపికయ్యాడు. ఆ తర్వాతి సంవత్సరం, శ్రీలంకపై ఢాకాలో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1998 కామన్వెల్త్ గేమ్స్ కౌలాలంపూర్‌లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2001 వరకు పాకిస్తానీ జట్టులో క్రమం తప్పకుండా చేర్చబడ్డాడు.[2]
2005 భారత పర్యటనలో క్రికెట్ ఆడాడు. అందులో ముఖ్యంగా బెంగుళూరు టెస్టులో, ఆఖరి సెషన్‌లో పాకిస్థాన్ ను గెలిపించి సిరీస్‌ను డ్రా చేసుకున్నాడు.[2]
2005 మేలో కరేబియన్‌లో పర్యటించాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.[2]
2005లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో రెండవ, ఐదవ మ్యాచ్‌లలో ఆడాడు. ఐదవ మ్యాచ్ సమయంలో, ఎకానమీ ఓవర్‌కు కేవలం 3 పరుగుల కంటే ఎక్కువగా ఉంది.[2][4]
కోచింగ్ కెరీర్
[మార్చు]2020 నవంబరు 12న, పాకిస్తాన్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Former Pakistan cricketer now steers a cab in Australia". September 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Rezaul Karim Refath". Cricinfo. Retrieved 2023-09-10.
- ↑ "From playing international cricket to taxi driver: The tragic life story of Arshad Khan". DNA India. 26 August 2021. Retrieved 2023-09-10.
- ↑ BBC scorecards Results of the 2005 Pakistan versus England tour.
- ↑ "Younis Khan appointed Pakistan men's batting coach until T20 World Cup 2022". International Cricket Council. Retrieved 2023-09-10.