అల్లూరు (కొత్తపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
అల్లూరు is located in Andhra Pradesh
అల్లూరు
అల్లూరు
అక్షాంశరేఖాంశాలు: 15°28′00″N 80°07′00″E / 15.4667°N 80.1167°E / 15.4667; 80.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొత్తపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ మొక్కా మోహనరావు
జనాభా (2011)
 - మొత్తం 2,246
 - పురుషుల సంఖ్య 1,115
 - స్త్రీల సంఖ్య 1,131
 - గృహాల సంఖ్య 586
పిన్ కోడ్ 523286
ఎస్.టి.డి కోడ్ 08592

అల్లూరు, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 286. ఎస్.టి.డి కోడ్. 08592.[1]

సమీప గ్రామాలు[మార్చు]

చెరువుకొమ్ముపాలెం 7.1 కి.మీ,కొత్తపట్నం 7.3 కి.మీ,పాదర్తి 7.4 కి.మీ,కరవది 7.8 కి.మీ,కొప్పోలు 8.5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 7 కి.మీ,కొత్తపట్నం 7.1 కి.మీ,టంగుటూరు 17.3 కి.మీ,నాగులుప్పలపాడు 18 కి.మీ. ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం,దక్షణాన టంగుటూరు మండలం,ఉత్తరాన మద్దిపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

అల్లూరు ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని వి.భాగ్యం కు, అవార్డ్ టీచర్స్ అసోసియేషన్ వారు, '''సర్వేపల్లి పురస్కారం''' అందజేసినారు. [1]

గ్రామ పంచాయతీ[మార్చు]

  • శ్రీ చిడిపూడి వీరాస్వామిరెడ్డి, 1970 నుండి 1988 వరకూ ఏకగ్రీవంగా ఎన్నికై, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసినారు. ఆ తరువాత 1995 వరకూ ఎన్నికలలో పోటీచేసి, గెలుపొంది, సర్పంచిగా పనిచేసారు. తన పదవీ కాలంలో తనకున్న మూడు ఎకరాల పొలం, మూడు సవర్ల బంగారం అమ్మినారు. ఆరు గ్రామాలకు సంబంధించిన మంచినీటి పథకాన్ని ఆలూరులో ఏర్పాటుచేసారు. తన స్వంత నిధులు ఒక లక్ష రూపాయలతో, గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేసారు. [2]
  • ఈ గ్రామ పంచాయతీకి 2014,జనవరి-18న జరిగిన ఎన్నికలలో శ్రీ మొక్కా మోహనరావు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. [6]
  • శ్రీ కృష్ణ మందిరం.
  • శ్రీ సాయి పంచారామం:- ఈ గ్రామంలోని శ్రీ సాయి పంచారామం, 20 వ వ్యవస్థాపక దినోత్సవం, 2014,ఏప్రిల్-2, బుధవారం నాడు, వైభవంగా జరిగింది. పంచారామంలో నిర్మించిన వివిధ మందిరాల వార్షికోత్సవాలు, నాలుగు రోజులుగా నిర్వహించుచున్నారు . ఈ సందర్భంగా 2113వ శ్రీ సాయికోటినామ లిఖిత మహా యగ్నాన్ని నిర్వహించారు. తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు, 2 కోట్ల సాయి నామాలు కలిగిన, సాయికోటి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా, ప్రత్యేకంగా నిర్మించిన, సాయికోటి స్థూపంలో నిక్షిప్తం చేశారు. అనంతరం సాయిబాబాకు కాగడా హారతి నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. [4]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ముదిగొండ శివప్రసాద్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,246 - పురుషుల సంఖ్య 1,115 - స్త్రీల సంఖ్య 1,131 - గృహాల సంఖ్య 586

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,247.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,172, మహిళల సంఖ్య 1,075, గ్రామంలో నివాస గృహాలు 556 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,981 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; జూలై-22,2013; 1వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,జనవరి-19; 2వ పేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014,ఏప్రిల్-3; 16 వ పేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,మే-16; 2వ పేజీ.[6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఏప్రిల్-5; 2వపేజీ.