మదనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మదనూరు
రెవిన్యూ గ్రామం
మదనూరు is located in Andhra Pradesh
మదనూరు
మదనూరు
నిర్దేశాంకాలు: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117Coordinates: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొత్తపట్నం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,040 హె. (5,040 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం6,598
 • సాంద్రత320/కి.మీ2 (840/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523280 Edit this at Wikidata

మడనూరు, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 280., యస్.టీ.డీ.కోడ్ 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈతముక్కల 2 కి.మీ, ఆలకూరపాడు 4 కి.మీ, కొనిజేడు 5.3 కి.మీ, పొందురు 6.5 కి.మీ, కొత్తపట్నం 8.4 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

టంగుటూరు 6.8 కి.మీ, కొత్తపట్నం 8.4 కి.మీ, జరుగుమిల్లి 13.1 కి.మీ, సింగరాయకొండ 14 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. శ్రీ దామతోటి దేవదాసు 2001-2006 మధ్య, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. గ్రామసేవకుడిగా రాజీనామా చేసి సర్పంచిగా పోటీచేసి ఎన్నికైనారు. ఆఖరి జీతం, 1200 రూపాయలు మాత్రమే ఎన్నికలకు ఖర్చు చేసారు. అంతకు మించి ఆయన వద్ద డబ్బు లేదు. గ్రామ సేవకుడి కంటే ముందు గ్రామంలో రేషను షాపు డీలరుగా 12 సంవత్సరాలు ఉన్నారు. 15 సంవత్సరాలు ప్రభుత్వాసుపత్రిలో కాంపౌండరుగా పనిచేసారు. సర్పంచి పదవి నుండి దిగిపోయేటప్పుడు, 4 లక్షల రూపాయల అప్పు మిగిలినది. వీరు తన హయాంలో, 50 సంవత్సరాలుగా లేని పంచాయతీ భవనం నిర్మాణం చేసారు. ప్రతి పాఠశాలలో తన స్వంత నిధులతో, జాతీయ జండాలు ఎగురవేయడానిఉకి జండా దిమ్మెలు నిర్మించారు. [2]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కత్తి పద్మ సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం[మార్చు]

ఈ ఆలయం బాగా ప్రసిద్ధిగాంచింది. శ్రీరామునిచే ప్రతిష్ఠితమైన సైకతలింగంగా, శ్రీ రామలింగేశ్వరస్వామిగా శివుడు పూజలందుకుంటున్న పవిత్రస్థలి "మదనూరు". మదనూరు గ్రామానికి తూర్పుదిశగా గల ఈ ఆలయం, అద్భుత గోపురప్రాకారాలను గలిగి భక్తులకు నేత్రపర్వం కలిగిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన దేవాలయంగా పేరు గాంచిన ఈ ఆలయంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. వివిధ రకాల పుష్పాలు ఇక్కడ లభ్యం అవుతాయి. ఇది బంగాళా ఖాతమునకు 1 కి.మీ దూరములో ఉంది. [3]&[4]

ఈ ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్సనాని పరిశీలించిన పురాతత్వ శాస్త్రఙులు, ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంనాత్టి శాసనంగా గుర్తించారు. ఈ శాసనం ప్రకారం 1517లో ధర్మార్ధం తిమ్మరుసు మడనూరు గ్రామాన్ని శ్రీ రామలీగేశ్వరస్వామివారి ఆలయానికి దానం చేసారు. [8]

శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015, ఆగస్టు-26వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయినవి. ఈ ఆలయంలో అమ్మవారి తంతుల మహోత్సవం నిర్వహించి 36 సంవత్సరాలయినది. ఈ సంవత్సరం తిరిగి ఈ ఉత్సవం నిర్వహించారు. బుధవారం నాడు, శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం నుండి, కలశాల ఉత్సవం, బియ్యపుకోల నిర్వహించారు. గురువారం ఉదయం సుడికప్పెర, సాయంత్రం అమ్మవారి పూల కప్పెర, నిర్వహించారు. శుక్రవారం జమ్మిచెట్టు ఆన, పాప వేషాలు, రాత్రికి జ్వాలాముఖి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం కాటి ఆన, "నడివీధి జేజాతర", రాత్రికి అంకమేడ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం గంధదీపాలు, అడుగుల మడుగులు, సాయంత్రం మేటి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహిళలు ఇంటివద్ద పొంగళ్ళు పెట్టి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. పసుపు బండ్లు కట్టి, ఊరేగింపుగా బయలుదేరి, ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మందుచెట్లను కాల్చారు. ఈ సందర్భంగా ఆదివారంనాడు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసినది. [6]&[7]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,598 - పురుషుల సంఖ్య 3,315 - స్త్రీల సంఖ్య 3,283 - గృహాల సంఖ్య 1,830

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,159.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,098, మహిళల సంఖ్య 3,061, గ్రామంలో నివాస గృహాలు 1,566 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,040 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-22; 1వపేజీ. [3] ఈనాడు 2013, డిసెంబరు-23; తీర్ధయాత్ర పేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఫిబ్రవరి-27; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, సెప్టెంబరు-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, ఆగస్టు-26; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, ఆగస్టు-31; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, జూన్-26; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మదనూరు&oldid=2853537" నుండి వెలికితీశారు