Jump to content

అశోక్ తన్వర్

వికీపీడియా నుండి
అశోక్ తన్వర్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
2009–2014
అంతకు ముందు వారుఆత్మ సింగ్ గిల్
తరువాత వారుచరంజీత్ సింగ్ రోరి
నియోజకవర్గంసిర్సా లోక్‌సభ నియోజకవర్గం
హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
In office
14-02-2014 – 04-09-2019
అంతకు ముందు వారుఫూల్ చంద్ ముల్లానా
తరువాత వారుకుమారి సెల్జా
ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
In office
ఫిబ్రవరి 2005 – ఫిబ్రవరి 2010
అంతకు ముందు వారురణదీప్ సుర్జేవాలా
తరువాత వారురాజీవ్ సాతావ్
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
In office
2003–2005
అంతకు ముందు వారుమీనాక్షి నటరాజన్
తరువాత వారునదీమ్ జావేద్
వ్యక్తిగత వివరాలు
జననం (1976-02-12) 1976 ఫిబ్రవరి 12 (వయసు 48)
హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ (2019 వరకు), అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (2021) ఆమ్ ఆద్మీ పార్టీ (2022-2024)
జీవిత భాగస్వామి
అవంతిక మాకెన్
(m. 2005)
సంతానం2
తల్లిదండ్రులుదిల్బాగ్ సింగ్
నివాసంహర్యానా
చదువుఎం.ఎ.(చరిత్ర), ఎం.ఫిల్ (చరిత్ర), పీహెచ్.డి.
కళాశాలకాకతీయ విశ్వవిద్యాలయము (వరంగల్)
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ)

అశోక్ తన్వర్ (జననం 1976 ఫిబ్రవరి 12) భారతీయ రాజకీయ నాయకుడు, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సిర్సా లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) మాజీ అధ్యక్షుడు కూడా. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందాడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని చిమ్నిలో ఒక రైతు కుటుంబంలో దిల్బాగ్ సింగ్, కృష్ణ రాఠీలకు జన్మించాడు.[2][3][4] వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో బీఏ చేసాడు. ఆ తరువాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్‌కి వెళ్లి తన ఎం.ఎ., ఎం.ఫిల్ పూర్తి చేసాడు. అక్కడే ఆయన మధ్యయుగ భారత చరిత్రపై పిహెచ్.డి పట్లా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జెఎన్‌యులో ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా అశోక్ తన్వర్ కెరీర్‌ను ప్రారంభించాడు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో ఆయన ప్రాధాన్యత సంతరించుకుంది. అతను 1999లో దానికి కార్యదర్శి అయ్యాడు. తిరిగి 2003లోనూ దాని అధ్యక్షుడయ్యాడు.[5]

అశోక్ తన్వర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇండియన్ యూత్ కాంగ్రెస్ తన నెట్‌వర్క్‌ను బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వర్క్‌షాప్‌లు, సెమినార్లు, వీధి నాటకాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సామాజిక కార్యక్రమాల ద్వారా బలోపేతం చేయడానికి ప్రయత్నించింది.

ఆయన 2014 ఫిబ్రవరి 14న హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు.

2009లో హర్యానాలోని సిర్సా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 35499 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే అతను 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కి చెందిన చరణ్‌జీత్ సింగ్ రోరీ చేతిలో ఓడిపోయాడు.[6]

2024 జనవరి 20న, ఆయన న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జూన్ 2005లో, అశోక్ తన్వర్, లలిత్ మాకెన్ కుమార్తె అవంతిక మాకెన్‌ను వివాహం చేసుకకున్నాడు. ఆమె తాత మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఆదికర్త, ఒక కుమార్తె అభిస్తద ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Rahul’s backroom boys and a girl
  2. Rift between Bhupinder Hooda and Ashok Tanwar worries Haryana Congress, newindianexpress.com, 22 January 2018.
  3. "Ashok Tanwar attacked for being Dalit: Haryana min". Business Standard. Press Trust of India. 2016-10-13. Retrieved 2020-06-03.
  4. "Ashok Tanwar: Keeping promises is the biggest task". gulfnews.com (in ఇంగ్లీష్). 6 November 2010. Retrieved 2020-09-05.
  5. Rori trounces Tanwar in Sirsa
  6. "Congress now anti-thesis of democracy: Former Haryana Congress chief Ashok Tanwar resigns". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 October 2019.
  7. "Ashok Tanwar joins BJP: Ex-Congress star and Rahul aide makes another jump in Haryana, leaves AAP in lurch". Indian Exprees (in ఇంగ్లీష్). Retrieved 21 January 2024.