అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | |
---|---|
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | మల్రెడ్డి రంగారెడ్డి[1] |
నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
తెలంగాణ శాసనసభ | |
In office 2014–ప్రస్తుతం | |
నియోజకవర్గం | మలక్‌పేట్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1967 అక్టోబరు 22
జాతీయత | భారతదేశం |
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
తల్లిదండ్రులు | అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాలా - హుమేరా సుల్తానా[2] |
నివాసం | పత్తర్‌గట్టి, హైదరాబాదు[2] |
కళాశాల | సెయింట్ పాల్స్ హైస్కూల్ (హైదరాబాద్) [2] |
వృత్తి | రాజకీయ నాయకుడు |
అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున మలక్ పేట శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 1967, అక్టోబరు 22న అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాలా - హుమేరా సుల్తానా దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. హిమాయత్ నగర్ లోని సెయింట్ పాల్స్ హైస్కూల్ నుండి పదవ తరగతి పూర్తిచేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాకు షహనాజ్ సుల్తానాతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]బలాలా 2009లో ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ టిక్కెట్‌పై మలక్‌పేట నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన ముహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్‌పై 8,371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బి. వెంకటరెడ్డిపై 23,268 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముజఫర్ ఆలీపై 36,910 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]
ఇతర వివరాలు
[మార్చు]హాంకాంగ్, మలేషియా, సౌదీ అరేబియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Constituency Wise Results – Andhra Pradesh (2004)". Rediff. Retrieved 22 April 2017.
- ↑ 2.0 2.1 2.2 "Ahmed bin Abdullah Balala". My Neta. Retrieved 22 April 2017.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "ఎన్నికల ఫలితం 2018: విజేతలు & రన్నర్స్ అప్, అభ్యర్థులు జాబితా - Oneindia Telugu". www.oneindia.com. Retrieved 2021-10-28.
- ↑ "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మలక్‌పేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి - Telangana Assembly Election Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
- జీవిస్తున్న ప్రజలు
- 1967 జననాలు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- హైదరాబాదు జిల్లా వ్యక్తులు
- హైదరాబాదు జిల్లా వ్యాపారవేత్తలు
- హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
- ఆంధ్రప్రదేశ్ ముస్లిం నాయకులు
- హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- తెలంగాణ శాసన సభ్యులు (2023)