Jump to content

ఆకాంక్ష పూరి

వికీపీడియా నుండి
ఆకాంక్ష పూరి
2022లో ఆకాంక్ష పూరి
వృత్తి
  • నటి
  • మోడల్
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం

ఆకాంక్ష పూరి భారతీయ నటి, మోడల్. ఆమె కొన్ని టెలివిజన్ షోలతో పాటు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె విఘ్నహర్త గణేష్‌లో పార్వతీ దేవి పాత్రకు ప్రసిద్ధి చెందింది.[1] రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా ఉంది.[2][3]

సినిమాలు, టీవీ షోలతోనే కాకుండా ఆమె పలు మ్యూజిక్​ ఆల్బమ్స్​లోనూ ఆడిపాడింది. ఇన్​స్పెక్టర్​ అవినాష్ వెబ్​సిరీస్​లోనూ ఆమె నటించింది. ఇది 2023 హిందీ భాష యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, దీనికి నీరజ్ పాఠక్ కథ అందించి దర్శకత్వం వహించింది. ఇందులో రణదీప్ హుడా, ఊర్వశి రౌటేలా తదితరులు నటించారు.[4]

కెరీర్

[మార్చు]

మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​లో పుట్టి పెరిగిన ఆకాంక్ష పూరి అంతర్జాతీయ కింగ్ ​ఫిషర్​ ఎయిర్​లైన్స్​లోని క్యాబిన్ క్రూ మెంబర్‌గా ఉన్న కొద్ది కాలంలోనే మోడలింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. పలు బ్రాండ్స్​ ప్రచార చిత్రాల్లో తన ఫొటోలతో పాటు వివిధ యాడ్స్​లోనూ ఆమె నటించింది. వాణిజ్య ప్రకటనలలో ఆమెను​ చూసిన తమిళ సినిమా​ నిర్మాణ సంస్థ 'గ్రీన్​ స్టూడియో' ఆమెకు సినిమా అవకాశం ఇచ్చింది. ఆమె 2013 తమిళ యాక్షన్ కామెడీ అలెక్స్ పాండియన్‌లో ఒక పాత్ర కోసం ఆమెను స్టూడియో గ్రీన్ ఎంచుకుంది, దానితో ఆమె తన మొదటి చలనచిత్ర ప్రవేశం చేసింది.[5][6]

అలెక్స్ పాండియన్‌ చిత్రం తెలుగులో బ్యాడ్ బాయ్ గా 2023 మార్చి 22న విడుదలైంది. ఇందులో కార్తిక్ శివకుమార్, అనుష్క శెట్టి, సంతానం, సుమన్ తదితరులు నటించారు.

ఆ తర్వాత ప్రేయిస్​ ది లార్డ్​ అనే మలయాళ సినిమా, సామ్రాజ్యం 2 అనే కన్నడ చిత్రంలోనూ ఆమె నటించింది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన 2015 డ్రామా చిత్రం క్యాలెండర్ గర్ల్స్‌తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం కూడా చేసింది.[7][8] 2017లో, ఆమె విఘ్నహర్త గణేష్ టీవీ సిరీస్‌లో మాతా ఆదిపరాశక్తిగా నటించింది.[9]

షాన్ హోస్ట్ చేసి స్టార్ భారత్ లో ప్రసారమయిన భారతీయ రియాలిటీ షో స్వయంవర్ - మికా ది వోహ్తి లో ఆమె విజేత.[10] 2023లో, ఆకాంక్ష బిగ్ బాస్ ఓటిటి హిందీ సీజన్ 2లో పాల్గొంది. జూన్ 2023లో మరో 12 మంది పోటీదారులతో షోలోకి ఆమె ప్రవేశించింది. అక్కడ ఆమె జడ్ హదీద్‌ను ముద్దుపెట్టుకుంది, ఇది వివాదానికి కారణమైంది.[11][12][13]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు
2013 అలెక్స్ పాండియన్ దివ్య తమిళం
2014 ప్రేజి ది లార్డ్ అన్నీ మలయాళం [14]
2015 లొద్దె ఆకాంక్ష కన్నడ [15]
సామ్రాజ్యం II: సన్ ఆఫ్ అలెగ్జాండర్ సైరా మలయాళం [16]
క్యాలెండర్ గర్ల్స్ నందితా మీనన్ హిందీ [17]
అమర్ అక్బర్ ఆంటోనీ గౌరీ మలయాళం అతిధి పాత్ర [18]
2019 యాక్షన్ కైరా తమిళం [19]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో/ధారావాహిక పాత్ర నోట్స్ మూలాలు
2015 సిఐడి అతిథి
2017–2020 విఘ్నహర్త గణేష్ పార్వతి [20]
2019 బిగ్ బాస్ 13 అతిథి
2022 బిగ్ బాస్ 15 ఛాలెంజర్ [21]
స్వయమవర్ - మికా ది వోహ్తి పోటీదారు విజేత [22]
2023 బిగ్ బాస్ ఓటిటి 2 12వ స్థానం [23]

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం టైటిల్ గాయని గాయకులు మూలాలు
2017 జహాన్ తుమ్ హో శ్రేయ్ సింఘాల్ [24][25][26]
2019 డాన్సింగ్ డాల్ జ్యోతికా టాంగ్రీ [27]
చిట్టి జుబిన్ నౌటియల్
2020 మెయిన్ బాలక్ తు మాతా జుబిన్ నౌటియల్
2021 మెయిన్ జిస్ దిన్ భులా దూన్ జుబిన్ నౌటియల్, తులసి కుమార్ [28]
హరే కృష్ణ హరే పాలక్ ముచ్చల్ [29]
డెంజరస్ శ్రేయ్ సింఘాల్ [30]
బేవఫ తేరా ముస్కురానా జుబిన్ నౌటియల్ [31]
మేరే వర్గ కాకా జీ
2022 జా రహే హో యాసర్ దేశాయ్ [32]
ఇష్క్ హాయ్ హై సమన్
2023 డోన్ట్ యు నో అమృత్ మాన్
దువా కరో నింజా
వీడియో వైరల్ హోగయా ఆకాశ సింగ్
బారిషోన్ ఉదిత్ నారాయణ్, పాయల్ దేవ్

మూలాలు

[మార్చు]
  1. "Akanksha Puri confirms she has quit Vighnaharta Ganesh but not for Bigg Boss 14: 'Want to grow and want people to see the real me". Hindustan Times. 5 September 2020. Archived from the original on 7 September 2020. Retrieved 7 September 2020.
  2. "భోపాల్​ భామ ఆకాంక్ష పూరి.. బిగ్​బాస్​లో చేరి!". {{cite web}}: zero width space character in |title= at position 7 (help)[permanent dead link]
  3. Singh, Swati (Jun 24, 2023). "Bigg Boss Ott-Season 2 Day 7 Written Update Drama Unfolds As Akanksha Puri Breaks Down Into Tears". English Jagram. JE Entertainment News. Retrieved 25 June 2023.
  4. Srivastava, Abhishek (18 May 2023). "Inspector Avinash Season 1 Review : Randeep Hooda delivers a stellar performance in this gripping and authentic crime thriller". The Times of India. Retrieved 20 October 2023.
  5. "Madhur Bhandarkar's Calendar girl Akanksha was Vijay Mallya's handpicked Kingfisher cabin crew - Times of India". The Times of India. Archived from the original on 18 September 2015. Retrieved 12 December 2017.
  6. "Calendar Girl Akanksha Puri roots for dry Holi - Times of India". The Times of India. Archived from the original on 13 December 2017. Retrieved 12 December 2017.
  7. "Akanksha Puri: After 'Calendar Girls', I was only offered erotic roles - Times of India". The Times of India. Archived from the original on 8 November 2017. Retrieved 12 December 2017.
  8. "Akanksha Puri is Prithviraj's heroine - Times of India". The Times of India. Archived from the original on 12 December 2017. Retrieved 12 December 2017.
  9. "कैलेंडर गर्ल से पार्वती बन गयी हैं आकांक्षा पुरी, विघ्नहर्ता गणेश में एक नया अवतार". jagran. Archived from the original on 22 August 2017. Retrieved 12 December 2017.
  10. "Swayamvar Mika di Vohti winner Akanksha Puri say show was 'not a sham, my entry was not planned'".
  11. "Jad Hadid and Akanksha Puri's steamy 30-sec kiss on Bigg Boss OTT 2 lights up Twitter: 'What the hell!'".
  12. "Bigg Boss OTT's Akanksha Puri on kissing Jad Hadid: 'Had I just touched his lips for 30 seconds we would have...'".
  13. "Jad Hadid, Akanksha Puri kiss in public after BB OTT 2 scandal. Internet not happy".
  14. "Akanksha dubbed in her own voice for Praise the Lord - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 30 October 2021.
  15. "Lodde | "Trailer 1" | New Kannada". Archived from the original on 11 August 2020. Retrieved 26 June 2020 – via YouTube.
  16. Samrajyam 2 - Son of Alexander Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 30 October 2021
  17. "'Calendar Girls' Akanksha Puri, Satarupa Pyne sing 'Khawaishein' live with Madhur Bhandarkar, watch video". The Indian Express (in ఇంగ్లీష్). 8 September 2015. Retrieved 30 October 2021.
  18. "Akanksha Puri is Prithviraj's heroine - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 30 October 2021.
  19. "Akanksha Puri on her Tamil return with 'Action'". Gulf News (in ఇంగ్లీష్). Retrieved 30 October 2021.
  20. "Exclusive - Akanksha Puri confirms quitting Vighnaharta Ganesh, says not leaving for Bigg Boss 14 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 30 October 2021.
  21. "Akanksha Puri, Surbhi Chandna, Vishal Singh and Munmun Dutta to enter Bigg Boss house as challengers - Times of India". The Times of India.
  22. "Swayamvar Mika Di Vohti: Actress Akanksha Puri to participate as one of the contestants". News18 (in ఇంగ్లీష్). 21 June 2022. Retrieved 8 July 2022.
  23. Pramila Mandal (2 July 2023). "Bigg Boss OTT 2 Weekend Ka Vaar Elimination: Akanksha Puri gets evicted from Salman Khan-led show". Pinkvilla. Archived from the original on 2 జూలై 2023. Retrieved 3 July 2023.
  24. "Jahaan Tum Ho Video Song and chitthi | Shrey Singhal | Latest Song 2016 | T-Series". Archived from the original on 9 April 2017. Retrieved 16 June 2017 – via YouTube.
  25. "Madhur Bhandarkar s Calendar Girl takes chauffeur to cops for damage to Mercedes". mid-day (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2017. Retrieved 12 December 2017.
  26. "Akanksha Puri and her 'Calendar Girls' director have a lot in common - Times of India". The Times of India. Archived from the original on 27 December 2017. Retrieved 12 December 2017.
  27. Dancing Doll (Full Song) - Dancing Doll - Download or Listen Free - JioSaavn (in అమెరికన్ ఇంగ్లీష్), 27 February 2019, retrieved 9 August 2021
  28. "Check Out New Hindi Trending Song Music Video - 'Main Jis Din Bhulaa Du' Sung By Jubin Nautiyal, Tulsi Kumar, Rochak Kohli - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 August 2021.
  29. "T-Series' Devotional Song Hare Krishna Hare, Featuring Akanksha Puri, Is Out Now". NDTV.com. Retrieved 9 August 2021.
  30. "Akanksha Puri ने फिल्मों में बोल्ड सीन करने को लेकर दिया बड़ा बयान, एक्ट्रेस ने कहा-'मेरे लिए प्रशंसा की बात, करना चाहूंगी ऐसा...'". Dainik Jagran (in హిందీ). Retrieved 9 August 2021.
  31. "Watch Latest Hindi Song 'Bewafa Tera Muskurana' Sung By Jubin Nautiyal | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 August 2021.
  32. "Akanksha Puri and Mohsin Khan's fans experience love, pain and agony in their newly released music video 'Jaa Rahe Ho'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 22 April 2022.