ఆజాదీ కా అమృత్ మహోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం)
జరుపుకొనేవారు భారతదేశం
రకంజతీయ
ప్రాముఖ్యతభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్బంగా 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది
ప్రారంభం12 మార్చ్ 2021
ముగింపు15 ఆగస్టు 2023
జరుపుకొనే రోజు15 ఆగష్టు 2022
ఉత్సవాలుజెండా ఎగురవేయడం, కవాతు, బాణసంచా కాల్చడం, దేశభక్తి పాటలు పాడటం, జాతీయ గీతం జన గణ మన, భారత ప్రధాని, భారత రాష్ట్రపతి ప్రసంగం
సంబంధిత పండుగస్వాతంత్ర్య దినోత్సవం
ఆవృత్తివార్షిక

భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (आजादि का अमृत महोतसव), ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది.[1] 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది.[2] జన-భాగీదారి స్ఫూర్తితో దీనిని జనోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార ప్రముఖులతో జాతీయ అమలు కమిటీ ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాతుంది. 2021 మార్చి 12 న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ లోని నవ్‌సారి జిల్లాలోని జలాల్‌పూర్ తాలూకాలో ఉన్న దండి వరకు 241 మైళ్ల దూరం పాదయాత్రను నిర్వహిస్తారు.ఈ పాదయాత్ర 25 రోజులు పాటు సాగి 2021 ఏప్రిల్ 5న దండిలో ముగుస్తుంది.

వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు.[3]

తెలంగాణ

[మార్చు]

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర భారత అమృతోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయించారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్కతిక శాఖ డైరక్టర్‌లుగా ప్రభుత్వం నియమించింది.[4] ఇందులో భాగంగా 2022లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగష్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు మొత్తంగా 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడకలను నిర్వహించబడుతున్నాయి. ఆగస్టు 15న గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలుతో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

కార్యక్రమాలు

[మార్చు]
 1. స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా 2021, మార్చి 12న తొలి కార్యక్రమంగా హైదరాబాదు ప‌బ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్క‌రించాడు.[5]
 2. 2021 మార్చి 24న రెండో వారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించారు.[6][7]
 3. 2021, ఏప్రిల్ 3న మూడో వారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాన్ని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాస్థాయి కవి సమ్మేళనాలు నిర్వహించారు. కవి సమ్మేళనానికి "స్వాతంత్ర్య స్ఫూర్తి"ని "ధీమ్"గా నిర్వహించారు.[8]
 4. 2021, ఏప్రిల్ 9న నాల్గొవ వారం హైదరాబాదు తెలంగాణ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ & రీజినల్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో (ఆర్‌ఓబీ) సంయుక్త ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్య పోరాటంపై ఏడు రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహించారు.[9]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Azadi Ka Amrit Mahotsav". MyGov.in. 2021-03-09. Retrieved 2021-06-12.
 2. "'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ". pib.gov.in. Retrieved 2021-03-12.
 3. "75 వారాలపాటు 75వ స్వాతంత్ర వేడుకలు: నేటి నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్". Samayam Telugu. Retrieved 2021-06-12.
 4. మన తెలంగాణ (8 March 2021). "75వ స్వాతంత్ర దిన మహా అమృతోత్సవాలు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 11 April 2021. Retrieved 11 April 2021.
 5. నమస్తే తెలంగాణ, Home న్యూస్ ఇన్ పిక్ (12 March 2021). "ఘ‌నంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్ వేడుక‌లు ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 11 April 2021. Retrieved 11 April 2021.
 6. నమస్తే తెలంగాణ (24 March 2021). "ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌.. ఫ్రీడం రన్‌ ప్రారంభించిన సీఎస్‌". Namasthe Telangana. Archived from the original on 24 March 2021. Retrieved 14 April 2021.
 7. ఆంధ్రజ్యోతి (24 March 2021). "నెక్లెస్ రోడ్డులో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్". www.andhrajyothy.com. Archived from the original on 25 March 2021. Retrieved 14 April 2021.
 8. ఆంధ్రజ్యోతి (1 April 2021). "ఈ నెల 3న 'స్వాతంత్ర్య స్పూర్తి" రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం". www.andhrajyothy.com. Archived from the original on 1 April 2021. Retrieved 14 April 2021.
 9. నమస్తే తెలంగాణ, హైదరాబాద్‌ (10 April 2021). "స్వాతంత్ర్యోద్యమాన్ని నేటి తరం తెలుసుకోవాలి". Namasthe Telangana. Archived from the original on 11 April 2021. Retrieved 14 April 2021.