ఆశారాం బాపూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంత్ శ్రీ ఆశారాం బాపు
పరమ పూజ్య సంత శ్రీ ఆశారాం బాపు
జననం (1941-04-17) 1941 ఏప్రిల్ 17 (వయసు 83)
బెరని గ్రామం
సింధు రాష్ట్రం
(భారతదేశం విభజనకు ముందు)
జాతీయతభారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
225 పైగా ఆశ్రమాలు, 1500 పైగా యోగ సాధనా కేంద్రాలు.[1]
జీవిత భాగస్వామిజి.లక్ష్మీదేవి
పిల్లలునారాయణ్ ప్రేం సాయి (అబ్బాయి) & భారతీ దేవి (అమ్మాయి)
తల్లిదండ్రులుమేహన్గి బా (తల్లి) & శ్రీ తవుమల్ సిరులమలని జీ (తండ్రి)
వెబ్‌సైటుwww.ashram.org
సంతకం
దస్త్రం:Bapu sign1.JPG

సంత్ శ్రీ ఆశారామ్‌జీ బాపూ (Sant Sri Asaramji Bapu) ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. బాపూజీ దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటనలు జరిపారు. సత్సంగ్, యోగ, వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధిస్తారు. 1993 లో "ప్రపంచ మతాల పార్లమెంటు"లో గ్లోబల్ మతాల అసెంబ్లో కమిటీ సభ్యునిగా ఉన్నారు.

అనుభవజ్ఞులు, యువకులు, ముసలివారు, భాగ్యవంతులు, పేదవారు, నాస్తికులు వంటి విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు బాపుజి సత్సంగకి వస్తుంటారు. కొందరు భక్తి. ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి చూపుతారు. మరికొందరు తమ సమస్యలు, వ్యాధుల గురించి సలహాలు, ఓదార్పులు ఆశిస్తారు. బాపూజీ ప్రసంగాలు అందరికీ ఎంతో ప్రశాంతత చేకూరుస్తాయని అనుచరులు అంటారు. అధికంగా బాపూజీ భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మ యోగం గురించి వివరిస్తారు.

వివాదాలు

[మార్చు]

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కాలేదు ఐనా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్‌పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆశారామ్‌బాపూ ఆశ్రమ ప్రతినిధి నీలమ్ దూబే తోసిపుచ్చారు.

ఆశారామ్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు ఈ తప్పుడు కేసు పెట్టించారని ప్రత్యారోపణ చేశారు. పోలీసు దర్యాప్తు మొదలైతే ఈ కేసు వెనక ఎవరున్నారో తేలుతుందన్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్‌లో ఆశారామ్‌కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.[2][3][4][5]

ఆశారామ్ ఆశ్రం దగ్గర పని చేసే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయ్యాడు.. దేశంలోనే ఆధ్యాత్మిక గురువుల్లో ప్రముఖుడిగా పేరున్న ఈ స్వామి.. ఆధ్యాత్మికం ముసుగులోచేస్తున్న అరాచకాలివి..మనవరాలి వయసున్న మైనర్ బాలికనే తన కామవాంఛను తీర్చుకునే యత్నం చేశాడు.. రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఆశారంబాపూ ఆశ్రమంలోనే ఈ ఘటన జరిగిందని ఆ బాలిక స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఆశారామ్ కోసం గత కొద్దిరోజులుగా వెదుకుతున్నారు. తాజాగా ఇండోర్లో శనివారం అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టు చేసేక్రమంలో ఆశారాం అనుచరులు పోలీసులు, మీడియాపైనా దాడికి పాల్పడ్డారు..ఆశారాం బాపూ అనుచరుల దాడిలో నేషనల్ మీడియా కెమేరామేన్లకు తీవ్రగాయాలయ్యాయి.[6]

అక్రమ ఆస్తులు

[మార్చు]

పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని 2014 జనవరి 30 న పోలీసులు చెప్పారు.ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు.[7]

జీవిత చరిత్ర

[మార్చు]

బాపూజీ 17 ఏప్రిల్ 1941 మ అనగా ఛైత్రమాసం 6 వ తిథిన, అప్పటి సింధురాష్ట్రంలో నవాబ్ జిల్లా బెరనీ గ్రామంలో జన్మించాడు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త తౌమల్ సిరుమలానీ, తల్లి మెహంగీబా. ఆ పిల్లవాడు పుట్టినరోజున ఒక వర్తకుడు వారి ఇంటికి వచ్చి, ఇక్కడ ఒక దివ్య ఋషి పుడతాడని నాకు బలమైన అనుభూతి కలిగిందని చెప్పి ఒక ఊయలను బహుమతిగా ఇచ్చారట.

ఆసుమల్ ఆ ఇంటిలో ముగ్గురు ఆడపిల్ల తరువాత కలిగిన మొదటి మగసంతు. అలా గయితే అరిష్టమని ఒక మూఢ నమ్మకం ఉంది కాని ఆ బాలుని జననం తరువాత ఆ కుటుంబం ప్రతిష్ఠ, సంపద మరింతగా అభివృద్ధి చెందాయి. ఆ బాలుని 3 సం. ల వయస్సులో వారి కులగురువు పరశురామ్‌జీ మహారాజ్ ఆ ఇంటికివచ్చి, బహిరంగంగా - ఈ బాలుడు సామాన్యుడు కాదు. భవిష్యత్తులో ఒక దివ్యభక్తుడు అవుతాడని, భగవద్జ్యోతిని అజ్ఞాన ప్రజలకు చూపిస్తాడని - చెప్పారు.

బాల్యం నుండే ఆసుమల్ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపేవారు. తల్లి నుండి భగవత్ గీత, రామాయణం మొదలగు గ్రంథాలు వినేవారు. అందరి మహాపురుషులు లాగే తల్లితండ్రులు, పెద్దలు, గురువులు అంటే చాలా నమ్రత, నమ్మకం, హృదయ పూర్వకంగా గౌరవ భావంగా వుండేది.

 1. . వ్యాస్ పూర్ణిమ
 2. . ఈశ్వర్ కి ఓర్
 3. . మహాన్నారి
 4. . యౌవన్ సురక్ష
 5. . నిర్భాయ్ నాథ
 6. . యోగాసన్
 7. . జీవన్ రసయన్
 8. . ఇష్ట్ సిద్ధి
 9. . అవ్‌తార్ లీల
 10. . పురుశార్త్పరందేవ్
 11. . మంగల్మి జీవన్మ్రిత్యు
 12. . నషే సే సావధాన్
 13. . జీవన్ వికాస్
 14. . తూ గులాబ్ హోకర్ మహాక్
 15. . ప్రభూ పరం ప్రకాష్ కి ఓర్ లేచల్

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-19. Retrieved 2008-06-19.
 2. http://timesofindia.indiatimes.com/city/delhi/Asaram-Bapu-booked-in-Delhi-for-sexual-assault-on-minor/articleshow/21952233.cms
 3. http://www.ndtv.com/article/india/asaram-bapu-booked-for-alleged-sexual-assault-on-minor-408440
 4. http://www.rediff.com/news/report/minor-accuses-asaram-bapu-of-rape-delhi-police-registers-case/20130821.htm
 5. http://zeenews.india.com/news/nation/minor-accuses-asaram-bapu-of-sexual-assault-case-registered_870505.html
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-04. Retrieved 2013-09-02.
 7. "ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు". Sakshi. 2014-01-31. Retrieved 2014-01-31.