ఇండోర్ - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
ఇండోర్-జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భారతదేశం కేంద్ర రాష్ట్ర వాణిజ్య కేంద్రంగాను, అతిపెద్ద నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రము ఇండోర్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్, ఈ రాష్ట్రములోనే మరొక మరి ఒక ప్రధాన నగరం అయిన జబల్పూర్ లోని జబల్పూర్ రైల్వే స్టేషన్ మధ్య నడిచే ట్రై వీక్లీ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందిస్తోంది.[1]
జోను , డివిజను
[మార్చు]ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
[మార్చు]రైలు వారానికి రెండు రోజులు నడుస్తుంది.
సంఖ్య , నామకరణం
[మార్చు]రైలు కోసం కేటాయించిన సంఖ్య:
- 11702 - జబల్పూర్ ఇండోర్.[2]
- 11701 - ఇండోర్ నుండి జబల్పూర్
"అంతర్ పట్టణ" పేరు (ఇంటర్ సిటీ) అనగా, ముఖ్యమైన నగరాల మధ్యన రైలు సేవలను సూచిస్తుంది.
ఆగమన , నిష్క్రమణ సమాచారం
[మార్చు]రైలు రెండు ప్రదేశాల నుండి వారానికి మూడుసార్లు నిర్వహించే పద్ధతి.
- రైలు నం. 11702 ఉదయం 04:20 గం.కు ఇండోర్ వద్ద నుండి ప్రతి మంగళవారం, గురువారం, శనివారం నుండి బయలు దేరుతుంది, 20:25 గం.కు జబల్పూర్ వద్దకు అదే రోజు చేరుతుంది.
- రైలు నం. 11701 ఉదయం 05:00 గం.కు జబల్పూర్ వద్ద నుండి, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం బయలు దేరుతుంది, 20:40 గం.కు అదే రోజు ఇండోర్ వద్దకు చేరుతుంది.
మార్గాలు , ఆగు స్టేషన్లు
[మార్చు]
ఈ రైలు బినా-కాట్నీ రైలు మార్గము ద్వారా వయా మక్షి, రాజ్‌ఘర్, గుణలు గుండా వెళుతుంది. రైలుయొక్క ముఖ్యమైన ఈ క్రింద సూచించిన స్టేషన్లులో ఆగి గమ్యస్థానం చేరుతుంది:
- ఇండోర్ జంక్షన్
- దేవస్
- మక్షి
- షాజాపూర్
- రాజ్‌ఘర్
- గుణ
- అశోక్ నగర్
- ఖురాయి
- సౌగోర్
- దామోహ్
- కాట్నీ జంక్షన్
- సిహోర రోడ్
- జబల్పూర్
లోకో లింకులు , కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు ఆర్‌టిఎం డబ్ల్యుడిఎం 2 ఎ లోకోమోటివ్ ద్వారా నెట్టబడే సామర్ధ్యం ఉంది. దీనిలో మొత్తం 13 కోచ్‌లు ఉంటాయి:
- 1 ఎసి చైర్ కార్
- 5 రిజర్వ్డ్ కుర్చీ కార్లు
- 5 జనరల్ కుర్చీ కార్లు
- 2 ఎస్‌ఎల్‌ఆర్/ స్త్రీలు (లేడీస్)
