ఉదయపూరు రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Mewar State or Udaipur State
c. 734–1949


Coat of arms of Udaipur State

Motto
"The Almighty protects the one who upholds righteousness"
Boundaries of Udaipur State in 1909
Capital
Languages Mewari[3]
Religion
Government
History
 •  Established c. 734
 •  Accession to the Union of India 1949
Area
 •  1901 33[4] km² (. sq mi)
 •  1941 33,517[5] km² (. sq mi)
Population
 •  1941 est. 1[5] 
     Density . /km²  (. /sq mi)
Warning: Value not specified for "common_name"
Warning: Value not specified for "continent"

భారత రిపబ్లికు ఏర్పడటానికి ముందు దీనిని ఉదయపూరు రాష్ట్రం, మేవారు రాజ్యం అని కూడా పిలుస్తారు.[6] వాయువ్య భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

మేవారు భౌగోళిక సరిహద్దులు శతాబ్దాల కాలంలో క్షీణించాయి.[7] కానీ 1941 నాటికి రాజ్యం వైశాల్యం 34,110 చదరపు కిలోమీటర్లు (సుమారుగా నెదర్లాండ్సు పరిమాణం).[8][9] 1818 లో బ్రిటిషు వారితో కుదుర్చుకున్న ఒప్పందం నుండి 1949 లో రిపబ్లికు ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించడం వరకు ఉదయపూరు రాజ్య సరిహద్దులు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఈ రాజ్య ఉత్తరాన బ్రిటిషు జిల్లా అజ్మీరు-మెర్వారా సరిహద్దులుగా ఉన్నాయి; పశ్చిమసరిహద్దులో జోధ్పూరు, సిరోహి; నైరుతి సరిహద్దులో ఇదారు ఉంది; దక్షిణసరిహద్దులో దుంగారు పూరు, బంస్వరా, ప్రతాప్గడు ఉన్నాయి; తూర్పున బుండి, కోటా ఉన్నాయి; ఈశాన్య సరిహద్దులో జైపూరు ఉన్నాయి.[10]

చరిత్ర[మార్చు]

రాజ్యస్థాపన[మార్చు]

బట్టా రావలు మేవారును స్థాపించాడు. గతంలో చిత్తూరులోని మోరి ప్రజలకు అధిపతి ఉండేవాడు. ఆయన చిత్తోరు మీద నియంత్రణను c.క్రీ.శ. 728 లో పొందాడు.[11] మేవారు మొదటి రాజధానిగా నాగ్దా ఉండేది. క్రీ.శ. 948 పాలకుడు అల్లాతు రాజధానిని నాగ్డా నుండి అహరుకు మార్చాడు.[1]

మేవారు, మెగలు[మార్చు]

1615 లో నాలుగు దశాబ్దాల వాగ్వివాదం తరువాత మేవారు, మొఘలులు ఒక ఒప్పందానికి అంగీకరించారు. దీని ఆధారంగా మొఘలుల ఆధీనంలో ఉన్న మేవారు భూభాగం తిరిగి రాజపుత్రుల స్వాధీనం అయింది. మేవారు యువరాజు రాజసభకు హాజరయ్యారు. మేవారు 1,000 మంది గుర్రపు సైనికులను మొఘలులకు అందించారు.[12]

మరాఠీల ప్రభావం[మార్చు]

మరాఠాలు 1725 లో మేవారు భూభాగంలోకి మొదటిసారిగా చొరబాటు చేసారు. తదనంతరం మేవారు మీద మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దుంగార్పూరు, బంసువ్రా, బుండి రాజ్యాలమీద కూడా ప్రభావం చూపారు.[13] మరాఠాలను ఎదుర్కోవటానికి మేవారుకు చెందిన మహారాణా జగతు సింగు 1734 లో హుర్దాలో రాజపుత్ర పాలకుల సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.[13] మరాఠా శక్తి పెరుగుతూనే ఉంది. శతాబ్దం మిగిలిన భాగంలో మరాఠాలు క్రమం తప్పకుండా మేవారు నుండి నివాళులు అందుకున్నారు.[13]

బ్రిటిషు రాజు పాలనలో మేవారు[మార్చు]

1818 నాటికి హోల్కరు, సింధియా, అమీరు ఖాను సైన్యాలు మేవారును, దాని పాలకుడిని, ప్రజలను దోచుకున్నాయి. [14] 1805 లోనే మేవారుకు చెందిన మహారాణా భీం సింగు సహాయం కోసం బ్రిటిషు వారిని సంప్రదించినప్పటికీ సింధియాతో 1803 ఒప్పందం బ్రిటిషు వారి అభ్యర్థనను స్వీకరించడంలో నిరోధించింది. [14] కానీ 1817 నాటికి బ్రిటీషు వారు కూడా రాజపుత్ర పాలకులతో పొత్తులు పెట్టుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. 1818 జనవరి 13 న ఈస్టు ఇండియా కంపెనీ (బ్రిటను తరపున), మేవారు మధ్య స్నేహం, పొత్తులు, ఐక్యత ఒప్పందం ముగిసింది.[14][15]


ఈ ఒప్పందం ఆధారంగా మేవారు భూభాగాన్ని రక్షించడానికి బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రతిగా మేవారు బ్రిటిషు ఆధిపత్యాన్ని అంగీకరించింది. ఇతర రాజ్యాలతో రాజకీయ సంబంధాలకు దూరంగా ఉంటూ దాని ఆదాయంలో నాలుగవ వంతు నివాళిగా 5 సంవత్సరాలు బ్రిటిషుప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించింది.[15] మే 23, 1947 న ఉదయపూరు రాజ్యానికి రాజ్యాంగం ఆమోదించబడింది.[16] ఉదయపూరు రాజ్య చివరి పాలకుడు 1949 ఏప్రెలు 7 న స్వతంత్ర భారతదేశంలోకి ప్రవేశించడానికి సంతకం చేశాడు.[17]

మహారాణాలు[మార్చు]

1303 వరకు మేవారు పాలకులను 'మహారావాలూ అని పిలిచేవారు.[1] 1303 నాటికి అల్లావుద్దీను ఖిల్జీ చిత్తోరుగడును తొలగించిన సమయంలో మహారావలు రతను సింగు మరణించిన తరువాత హమీరు మేవారు పాలకుడు అయ్యాడు. తనను తాను 'మహారాణా' గా పేర్కొన్నాడు. 1949 లో రాజ్యం రద్దు అయ్యే వరకు దాని పాలకులను మహారాణా అని పిలిచారు.[1]

ఉదయపూరు శిశోడియా రాజపుత్ర రాజవంశం
పేరు పాలన ప్రారంభం క్రీ.శ. పాలన ముగింపు క్రీ.శ.
1 మహారాణా ఉదయ సింగు 1568 1572
2 'మహారాణా మొదటి ప్రతాప సింగు 1572 1597
3 'మహారాణా మొదటి అమరసింగుమేవారు మీద మొఘలు ఆధిపత్యాన్ని అంగీకరించిన కారణంగా 150 సంవత్సరాలు మాహారాణా పాలన కొనసాగించారు. 1597 1620
4 'మహారాణా రెండవ కరణు సింగు 1620 1628
5 'మహారాణా మొదటి జగతు సింగు 1628 1652
6 'మహారాణా రాజ సింగు 1652 1680
7 'మహారాణా జై సింగు 1680 1698
8 'మహారాణా రెండవ అమరు సింగు 1698 1710
9 'మహారాణా సంగ్రామ సింగు 1710 1734
10 'మహారాణా రెండవ జగతు సింగు 1734 1751
11 'మహారాణా రెండవ ప్రతాపు సింగు 1751 1754
12 'మహారాణా రెండవ రాజ సింగు 1754 1761
13 'మహారాణా రెండవ అరి సింగు 1761 1773
14 'మహారాణా రెండవ హమీరు సింగు 1773 1778
15 'మహారాణా భీం సింగు 1778 1828
16 'మహారాణా జవాను సింగు 1828 1838
17 మాహారాణా సరదారు సింగు 1838 1842
18 'మహారాణా స్వరూప సింగు 1842 1861
19 'మహారాణా శంభు సింగు 1861 1874
20 'మహారాణా సజ్జన సింహు 1874 1884
21 'మహారాణా ఫతేహు సింగు 1884 1930
22 'మహారాణా భూపాలు సింగు 1930 1956
23 'మహారాణా భగతు సింగు - "చివరి ఉదయపూరు రాజ్యపాలకుడు" 1956 1984
24 'మహారాణా మహేంద్ర సింగు - "భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత రాజరికం రద్దు చేయబడిన తరువాత ఈ వంశానికి నామమాత్ర నాయకుడుగా ఉన్నాడు." 1984 Present

భగవతు సింగు 1984 నవంబరు 2 న మరణించాడు. అతనికి ఇద్దరు కుమారులు; మహేంద్ర సింగు, అరవింద సింగు ఉన్నారు. తన మరణానికి ముందు, ఆయన మహారాణా మేవారు ఫౌండేషను అనే ట్రస్టును స్థాపించి దానిని నిర్వహించే బాధ్యతను చిన్న కుమారుడు అరవిందుకు అప్పగించాడు. అరవిందు ఉదయపూరు సిటీ ప్యాలెసులో నివసిస్తున్నాడు.[ఉల్లేఖన అవసరం]

బ్రిటిషు నివాసులు, రాజప్రతినిధులు[మార్చు]

రాజ్యంలో వారి వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఈస్టు ఇండియా కంపెనీ చేత నియమించబడిన జేమ్స్ టాడ్, 1818 మార్చి నుండి 1822 వరకు పదవిలో ఉన్నారు.[ఉల్లేఖన అవసరం] అలాన్ హోల్మె బ్రిటిషు రెసిడెంటు పదవీ బాధ్యతలు రెండు మార్లు నిర్వహించాడు (1911 - 1916 - 1919).[ఉల్లేఖన అవసరం]

నిర్వహణ[మార్చు]

1901 జనాభా లెక్కల సమయంలో రాజ్యాన్ని 17 పరిపాలనా ఉపవిభాగాలుగా విభజించారు - 11 జిల్లలు, 6 పరగణాలు, ఒక జిల్లా, పరగణాల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, పరగణా పెద్దది, ఇది మరింతగా ఉపవిభాగాలుగా విభజించబడింది. [18] ఇంకా 28 ప్రిన్సిపలు జాగీర్లు, 2 భూమాట్లు ఉన్నాయి. [19] ప్రతి జిల్లాను ఒక హకీం, ఒక రాజ్య అధికారి, ప్రతి తహసీలు (జిలా సబ్ డివిజన్) వద్ద సహాయక హకీం మద్దతుగా పనిచేసేవాడు.[20]

పదవీకాలం[మార్చు]

రాజ్యంలో భూ పదవీకాలం ప్రధాన రూపాలు జాగీరు, భూం, సాసను, ఖల్సా. జాగీర్లు పౌర లేదా రాజకీయ సేవకు గుర్తింపుగా భూమిని మంజూరు చేశారు. జాగీరుదార్లు సాధారణంగా వార్షిక ప్రాతిపదికన చాతుండు అని పిలువబడే స్థిర వార్షిక నివాళిని, కొత్త మహారాణా వారసత్వంగా నజరానాను చెల్లించేవారు. జాగీర్దారు మరణం తరువాత, దివంగత జాగీర్దారు వారసుడిని మహారాణా గుర్తించే వరకు జాగీరు మహారాణాకు తిరిగి వస్తుంది. భూం పదవీకాలం ఉన్నవారు ఒక చిన్న నివాళి లేదా నామమాత్రపు -అద్దె (భుం బరారు) చెల్లించారు. స్థానిక సేవ కోసం ఆహ్వానించబడతారు. సాసనుదారులు (మువాఫీ అని కూడా పిలుస్తారు) మహారాణాకు చెల్లింపులకు బాధ్యత వహించరు కాని వారి నుండి కొన్నిసార్లు పన్నులు పొందబడతాయి. ఖల్సా (ప్రభుత్వ భూములు) ఉన్నవారు సాగుదారులు. వారు భూమి ఆదాయాన్ని చెల్లించడం కొనసాగించినంత కాలం వారి ఆధీనంలో కొనసాగుతుంది.[21] 21] 1912 నాటికి రాజ్య భూ ఆదాయంలో 38% ఖల్సా భూమి నుండి, మిగిలినవి ఇతర వనరుల నుండి లభించింది.[22]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Bhattacharya, A.N. (2000). Human Geography of Mewar. Himanshu Publications.
 2. Agarwal, B.D. (1979). Rajasthan District Gazetteers, Udaipur. Jaipur: Directorate of District Gazetteers.
 3. 3.0 3.1 Ojha, Gaurishankar Hirachand (1990). उदयपुर राज्य का इतिहास [History of Udaipur State]. Rajasthani Granthagar.
 4. Bannerman, A.D. (1902). Census of India 1901, Vol. XXV-A, Rajputana, Part II Imperial Tables (PDF). Newal Kishore Press.
 5. 5.0 5.1 Dashora, Yamunalal. Mewar in 1941 or A Summary of Census Statistics. R.C. Sharma.
 6. Agarwal, B.D. (1979). Rajasthan District Gazetteers: Udaipur. Jaipur: Government of Rajasthan. p. 230.
 7. Gupta, R.K.; Bakshi, S.R., సంపాదకులు. (2008). Studies in Indian History: Rajasthan Through the Ages Vol. 5. New Delhi: Sarup & Sons. p. 64. ISBN 978-81-7625-841-8.
 8. "The World Factbook: Netherlands". Central Intelligence Agency. Retrieved 22 డిసెంబర్ 2017.
 9. Dashora, Yamunalal (1942). Census of Mewar, 1941. Alwar: Sharma Bros.
 10. Based on map of Mewar shown with the article.
 11. Vaidya, C.V. (1924). History Of Mediaeval Hindu India. II. Poona: The Oriental Book Supplying Agency. p. 75.
 12. Panagariya, B.L.; Pahariya, N.C. (1947). Political, socio-economic and cultural history of Rajasthan (Earliest times to 1947). Jaipur: Panchsheel Prakashan. Retrieved 2 మే 2019.
 13. 13.0 13.1 13.2 Mathur, Tej Kumar (1987). Feudal polity in Mewar. Jaipur and Indore: Publication Scheme.
 14. 14.0 14.1 14.2 Gupta, R.K.; Bakshi, S.R., సంపాదకులు. (2008). Studies in Indian History: Rajasthan Through the Ages Vol. 5. New Delhi: Sarup & Sons. p. 64. ISBN 978-81-7625-841-8.
 15. 15.0 15.1 Aitchison, C.U. (1909). A Collection of Treaties, Engagements and Sanads Relating to India and Neighbouring Countries Vol. III. Calcutta: Superintendent Government Printing, India. pp. 10–32.
 16. Darda, D.S. From Feudalism to Democracy. New Delhi: S. Chand & Co. (Pvt.) Ltd.
 17. Princely States of India
 18. Agarwal, B.D. (1979). Rajasthan District Gazetteers: Udaipur. Jaipur: Government of Rajasthan. p. 2.
 19. Imperial Gazetteer of India : Provincial Series Rajputana. Calcutta: Superintendent of Government Printing. 1908. pp. 106–168.
 20. Ojha, Gaurishankar Hirachand (1999). उदयपुर राज्य का इतिहास. Jodhpur: Rajasthani Granthagar. pp. 15–16. మూలం నుండి 26 ఫిబ్రవరి 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 10 జనవరి 2020.
 21. Erskine, K.D. (1908). Rajputana Gazeteers, Vol II-A (The Mewar Residency). Ajmer: Scottish Mission Industries Co. Ltd. pp. 71–72.
 22. Administration Report of the Mewar State for the Year 1910-11. Ajmer: Scottish Mission Industries Co., Ltd. 1911. p. 1.

అదనపు అధ్యయనం[మార్చు]

 • The Kingdom of Mewar: great struggles and glory of the world's oldest ruling dynasty, by Irmgard Meininger. D.K. Printworld, 2000. ISBN 81-246-0144-5.
 • Costumes of the rulers of Mewar: with patterns and construction techniques, by Pushpa Rani Mathur. Abhinav Publications, 1994. ISBN 81-7017-293-4.

Coordinates: 24°35′N 73°41′E / 24.58°N 73.68°E / 24.58; 73.68 మూస:Princely states of India మూస:Udaipur